65వ పడిలోకి తెలుగువారి ఆనందం బ్రహ్మానందం.. హాస్య బ్రహ్మ సినీ జర్నీలో మైలురాళ్లు ఎన్నో ఎన్నెన్నో..!
బ్రహ్మానందం.. ఈ పేరు వినబడితే చాలు తెలుగు వారి మదిలో ఆనందం చిగురిస్తుంటుంది. తనదైన ఎక్స్‌ప్రెషన్స్, కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్‌తో వెండితెరపై హాస్యం పండించడంలో తనకు సాటెవ్వరూ లేరని నిరూపించారు . కోట్లాదిమంది ప్రేక్షకులను ఇట్టే రిలాక్స్ చేసే ఓ కామెడీ టానిక్ ఆయన. మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అలాంటి కామెడీ కింగ్ పుట్టినరోజు అంటే మామూలుగా ఉంటుందా!. సోషల్ మీడియా హోరెత్తిపోవాల్సిందే.. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆయన పుట్టినరోజు. నేటితో 64 సంవత్సరాలు పూర్తిచేసుకొని 65వ పడిలోకి అడుగుపెడుతున్నారు బ్రహ్మానందం. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆయన బర్త్ డే విషెస్ మాత్రమే దర్శనమిస్తున్నాయి, హాస్యానికి పెట్టింది పేరు మీరంటూ సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఆయనపై ప్రశంసల వర్షం గుప్పిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఆయన తండ్రి కన్నెగంటి నాగలింగాచారి, తల్లి పేరు కన్నెగ