‘జల జల జలపాతం’ సాంగ్: దేవిశ్రీ సంగీతం.. శ్రేయా ఘోషల్ గానం.. జస్ట్ వావ్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవ‌రి 12న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. వీటిలో ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. అలాగే ‘ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో అందమైన పాట విడుదలైంది. ‘జల జల జలపాతం’ అంటూ సాగే ఈ మెలొడీ సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ పాటను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేయడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ మరో అద్భుతమైన మెలొడీని స్వరపరిచారు. శ్రీమణి సాహిత్యం, జస్ప్రీత్ జాజ్ - శ్రేయా ఘోషల్ గానం, దేవిశ్రీ సంగీతం కలిపి మరో గుర్తుండిపోయే పాటను తెలుగు ప్రేక్షకులకు అందించాయి. మరోవైపు, ఇప్పటికే విడుదలైన ‘ఉప్పెన’ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో హీరో గంగపుత్రుడిగా కనిపించనున్నాడు. ఇక హీరోయిన్ కాలేజీకి వెళ్లే పెద్దింటి అమ్మాయి. వీరిద్దరి మధ్య ప్రేమకథే ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా అందించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతంతో పాటు షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి పాత్ర కూడా మెస్మరైజ్ చేయనుంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ