28 ఏళ్ల తర్వాత మళ్లీ మే నెలలో చిరంజీవి సినిమా.. నక్షత్రం కూడా బాగా కలిసొస్తుందట!

మెగాస్టార్ , డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’ను వేసవి కానుకగా మే 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ‘ఆచార్య’ టీజర్‌ను విడుదల చేసిన గంటన్నర వ్యవధిలోనే చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు మెగాస్టార్. అయితే, ఈ విడుదల తేదీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. మే నెల గతంలో చిరంజీవికి బాగా అచ్చొచ్చిందట. చిరంజీవి కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి. అలా అని అన్నీ సూపర్ హిట్లే కాదు.. మే నెలలో విడుదలైన చిరంజీవి సినిమాల్లో ఫ్లాపులు ఉన్నాయి. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ హీరో హోదాను సంపాదించిన చిరంజీవి.. ఆ తరవాత చాలా తక్కువ సినిమాలను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. చిరంజీవి 86వ చిత్రం ‘వేట’ 1986 మే 28న విడుదలైంది. కానీ, ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత మళ్లీ 1990 మే 9న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘వేట’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి మధ్య 22 సినిమాలు వచ్చాయి. కానీ, ఏ సినిమా మే నెలలో విడుదల కాలేదు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైన తరవాత సంవత్సరమే అంటే 1991 మే 9న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదో ట్రెండ్ సెట్టర్. ‘గ్యాంగ్ లీడర్’ తరవాత మళ్లీ మే నెలలో విడుదలైన సినిమా ‘మెకానిక్ అల్లుడు’. బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1993 మే 27న విడుదలైంది. చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా తరవాత చిరంజీవి మరో సినిమా మే నెలలో రాలేదు. ఇప్పుడు సుమారు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ‘ఆచార్య’ రూపంలో చిరంజీవి సినిమా మే నెలలో వస్తోంది. మే 13 గురువారం వచ్చింది. ‘గ్యాంగ్ లీడర్’ కూడా గురువారం నాడే విడులైందట. అంతేకాదు, మే 13న రోహిణి నక్షత్రమట. చాలా మంచిదట. ఇవన్నీ ‘ఆచార్య’కు కలిసొస్తాయని చర్చ. వీటికి తోడు మే 13న రంజాన్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇవన్నీ కలిస్తే ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ