పవన్ కళ్యాణ్‌తో రానా ఢీ.. రంగంలోకి దగ్గుబాటి వారసుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సమరానికి దిగాడు దగ్గుబాటి వారసుడు రానా. ఈ ఇద్దరి మధ్య నిన్న (జనవరి 28) నుంచి పోరాటం ప్రారంభమైంది. అర్థం కాలేదా..? అదేనండీ.. పవన్ కళ్యాణ్- కాంబోలో రాబోతున్న మలయాళీ మూవీ '' తెలుగు రీమేక్ సెట్స్ పైకి రానా కూడా వచ్చేశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా రూపొందుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు పవన్ ఎంటర్ కాగా, నిన్న రానా కూడా సెట్స్ మీదకొచ్చేశారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో ప్రస్తుతం పవన్- రానా మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లోని లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ జరుగుతోంది. మరో పది రోజుల పాటు ఈ ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడే జరగనుందట. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, ఆయనను ఢీకొట్టే బలమైన పాత్రలో రానా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే వీళ్ళు కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారట. ఇకపోతే థమన్ బాణీలు కడుతున్న ఈ చిత్రంలో సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Post a Comment