ఇకపై థియేటర్లలో 'ఫుల్' ఆక్యుపెన్సీ.. సినీ ప్రియులకు శుభవార్త చెప్పిన కేంద్రం

కరోనా తెచ్చిన కష్టాల్లో థియేటర్ గేట్లు మూతపడటం ఒకటి. గతేడాది కోవిడ్ ప్రభావంతో సినిమా షూటింగ్స్, థియేటర్స్ అన్నీ క్లోజ్ కావడంతో సినీ పరిశ్రమ విలవిల్లాడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని గతేడాది అక్టోబర్‌లో పర్మిషన్స్ ఇచ్చిన కేంద్రం.. తాజాగా మరో సడలింపు చేసింది. ఇకపై థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని అనుమతులిస్తూ ఇటు సినీ ప్రియులకు, అటు థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. క్రమంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండటంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే సినిమా హాళ్లలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఇకపై థియేటర్లు 'ఫుల్' ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. థియేటర్‌ యాజమాన్యాలు సంతోషించేలా 100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. జనవరి 31 నుంచే నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు థియేటర్ జయమాన్యాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. థియేటర్‌ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, థియేటర్ ప్రవేశ ద్వారం వద్ద శరీరా ఉష్ణోగ్రతను కొలిచే థర్మల్‌ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ సినిమా హాలు లోపల ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్ ఉండేలా జాగ్రత్త పడాలని పేర్కొంది. అదేవిధంగా ‌థియేటర్లలో ఉమ్మి వేయడాన్ని నిషేదిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ