టీజర్: గుణపాఠాలు చెప్పే ‘ఆచార్య’ ఏం స్టైలిష్‌గా ఉన్నాడబ్బా!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. ‘ఆచార్య’ టీజర్‌తో మెగా అభిమానులకు కనువిందు తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమాలు తీయడంతో సిద్ధహస్తుడిగా మారిన కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా రూపొందుతోన్న ఈ ‘ఆచార్య’ టీజర్‌ను శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. ‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అనే రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలైంది. అదే వాయిస్ ఓవర్‌తో ‘ఆచార్య’గా చిరంజీవి వైలెంట్ ఇంట్రడక్షన్ కూడా జరిగింది. టీజర్ చూస్తుంటే చిరంజీవి హీరోయిజాన్ని కొరటాల శివ ఏ రేంజ్‌లో ఎలివేట్ చేశారో అర్థమవుతోంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరవాత ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా’ సినిమాలు వచ్చినా.. ఎందుకో ఈ ‘ఆచార్య’ ఆయనకు కరెక్ట్ ఫిలిం అని టీజర్ చూస్తుంటే అనిపిస్తోంది. టీజర్‌లో చిరంజీవి స్టైల్, హీరోయిజం చూసి మెగా అభిమానులకు సంబరాలు చేసుకోవడం ఖాయం. అంత అందంగా, స్టైలిష్‌గా ఉన్నారు మెగాస్టార్. ఫైట్స్ కూడా వేరే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ కూడా చిరంజీవి స్టైలే హైలైట్. ‘‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ టీజర్‌కి మరో హైలైట్. ఈ టీజర్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సింది మణిశర్మ నేపథ్య సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ గురించి. ఈ రెండూ అద్భుతంగా ఉన్నాయి. Also Read: వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, ‘సిద్ధ’ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ మెరవనున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ