‘ఖిలాడి’ అప్డేట్: రవితేజకు విలన్‌గా అర్జున్.. సర్ప్రైజ్ ఇచ్చిన యాక్షన్ కింగ్!
మాస్ మహారాజా హీరోగా రూపొందుతోన్న ‘ఖిలాడి’ సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో మరో సీనియర్ నటుడు భాగం అయ్యారు. ఆయన ఎవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘2021లో కొత్త సినిమా.. ‘ఖిలాడి’ సెట్స్‌లో నేను’ అని క్యాప్షన్ పెట్టి ఒక స్టైలిష్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అర్జున్. ఇప్పటి వరకు ‘ఖిలాడి’లో అర్జున్ ఉన్నట్టు తెలీదు.. ఇప్పుడు సడెన్‌గా రివీల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు యాక్షన్ కింగ్. ఇదిలా ఉంటే, అర్జున్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరవాత అర్జున్ నటిస్తోన్న మరో తెలుగు సినిమా ఇది. అందులో అల్లు అర్జున్‌కు తండ్రిగా నటించారు అర్జున్. అంతకు ముందు నితిన్ ‘లై’ సినిమాలో విలన్‌గా మెప్పించారు. కానీ, రవితేజ లాంటి మాస్ హీరోకు అర్జున్ విలన్ అంటే ఆ కిక్కే వేరు. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, ‘ఖిలాడి’ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హవీష్ ప్రొడక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్. రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఖిలాడి’ గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘ఖిలాడి’ గ్లింప్స్ వీడియోకు ఇచ్చిన బీజీఎంతోనే ఈ సినిమాలో నేపథ్య సంగీతం ఎలా ఉండబోతుందో రుచి చూపించారు డీఎస్పీ. ఇదిలా ఉంటే, సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండటం విశేషం. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ కలిసి ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నారు. అలాగే శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. ‘రాక్షసుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత దర్శకుడు రమేష్ వర్మ నుంచి వస్తోన్న చిత్రం ‘ఖిలాడి’.
Comments
Post a Comment