పుష్ప షూటింగ్‌లో విషాద ఘటన.. గుండెపోటుతో స్టిల్ ఫొటోగ్రాఫర్ కన్నుమూత

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ టీం ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో ఉన్నారు. కాగా ఈ సినిమాకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న (54) సెట్స్ పైనే గుండెపోటుకు గురై కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. ‘పుష్ప’ షూటింగ్ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వెళ్లిన జి. శ్రీనివాస్ శుక్రవారం ఉదయం షూటింగ్ లొకేషన్‌లో అస్వస్థతకు లోనయ్యారు. గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో వెంటనే అప్రమత్తమైన చితయూనిట్.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన కన్నుమూశారు. దాదాపు 200లకు పైగా చిత్రాలకు శ్రీనివాస్ స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల ‘పుష్ప’ టీమ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పుష్ప మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు నిన్న (జనవరి 28)నే ప్రకటించింది చిత్రయూనిట్.
Comments
Post a Comment