Ram Charan: నిజంగా అది నా అదృష్టం.. 'ఆచార్య'పై ఫీలింగ్స్ బయటపెట్టిన రామ్ చరణ్

మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధ అనే ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిన్న (శుక్రవారం) సాయంత్రం ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయగా.. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసిన రామ్ చరణ్.. ఆచార్యలో సిద్ధ పాత్రలో నటించడం, తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో తనది అతిథి పాత్ర కాదని చెప్పిన చెర్రీ తన తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఒకే తెరపై కనిపించనుండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాన్న సినిమాలో, నాన్నతో కలిసి నటించే అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు అని రామ్ చరణ్ తెలిపారు. గత కొన్నిరోజులుగా జరుగుతున్న 'ఆచార్య' రెగ్యులర్‌ షూట్‌లో రామ్ చరణ్ కూడా‌ పాల్గొంటున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే కనిపించనుందట. వీళ్ళిద్దరితో ఓ డ్యూయట్ కూడా ప్లాన్ చేశారని తెలిసింది. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే రామ్ చరణ్ రోల్ సినిమాకు మేజర్ అసెట్ కానుందని తెలుస్తుండటం మెగా అభిమానుల్లో ఉన్న ఆతృతను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాలో నటించడమే గాక, నిర్మాణ భాగస్వామిగా ఉన్న రామ్ చరణ్.. ‘ఆచార్య’ను వేసవి కానుకగా మే 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ అంచనాల నడుమ చిరంజీవి 152వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ