Posts

Showing posts from June, 2019

‘దొరసాని’ ట్రైలర్.. ప్రేమ కూడా ఒక ఉద్యమమే!

Image
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘దొరసాని’. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహనిర్మాత. కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించారు. ఇదే ఈయనకు తొలి సినిమా. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈనెల 12న ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చి్ంది. ఆనంద్ దేవరకొండను సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. కానీ, తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరుగుతుంది. పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆ నాటి కాలాన్ని కళ్లకు కట్టేటట్టు సహజసిద్ధమైన సెట్టింగ్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. ఇంటికొచ్చిన ఆనంద్ దేవరకొండకు ఆమె చెంబుతో

ఇంత అన్యాయమా.. రామ్ చరణ్ ఆఫీసు ముందు ‘ఉయ్యాలవాడ’ వారి ధర్నా

Image
రాయలసీమకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వంశస్థులు హీరో రామ్ చరణ్ కార్యాలయం ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. ‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని వారు ఆరోపించారు. తమను ఆదుకుంటామని రామ్ చరణ్ అప్పుడు మాటిచ్చారని.. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తమను ఆదుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుకున్నారు. ఉయ్యాలవాడ వంశానికి చెందిన ఒక మహిళ రామ్ చరణ్ ఆఫీసు ముందు మాట్లాడుతూ.. ‘ఉయ్యాలవాడ వచ్చి మా ఇండ్లలోకి దూరి షూటింగ్‌లు చేసుకున్నారు. ‘సైరా’ సెట్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం కూడా మాదే. మా సొంత ప్రాపర్టీలో వీళ్లు సెట్ వేసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు వీళ్లు ఎవరూ లేకపోయినా మేం వెళ్లాం. తిరుపతి ప్రసాద్ అనే వ్యక్తి చరణ్ బాబు మీకు న్యాయం చేస్తారని మాటిచ్చారు. నా భర్తను నన్ను తీసుకెళ్లి చరణ్ బాబుతో మాట్లాడించారు. మా దగ్గర ఆధారాలున్నాయి(ఫొటోలు). మమ్మల్ని తల్లిదండ్రులులా రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషంగా మాట్లాడారు. న్యాయం చేస్తానన్నారు’ అని ఆమె వెల్లడించారు. అయితే,

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు.. సి.కళ్యాణ్ ఘన విజయం

Image
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘మ‌న కౌన్సిల్‌-మ‌న ప్యానెల్‌’ ఘ‌న విజ‌యం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నిక‌ల్లో సి.క‌ల్యాణ్ అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 477 ఓట్లు పోలుకాగా సి.కళ్యాణ్‌కు 378 వచ్చాయి. కళ్యాణ్ ప్రత్యర్థి ఆర్కే గౌడ్‌కు డిపాజిట్ దక్కలేదు. ఆయనకు కేవలం 95 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో నాలుగు ఓట్లు చెల్లలేదు. కాగా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులుగా కె.అశోక్‌కుమార్‌, వై.వి.ఎస్‌.చౌద‌రి.. సెక్రట‌రీగా టి.ప్రస‌న్నకుమార్‌, మోహన్ వడ్లపట్ల జాయింట్ సెక్రటరీగా, ట్రెజ‌ర‌ర్‌గా చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఎన్నిక‌య్యారు. అలాగే ఈసీ మెంబ‌ర్స్‌గా కె.అమ్మిరాజు, అశోక్‌కుమార్ వ‌ల్లభ‌నేని, బండ్ల గ‌ణేశ్‌, ఆచంట గోపీనాథ్, ప‌ల్లి కేశ‌వ‌రావు, శివ‌లెంక కృష్ణప్రసాద్‌, జి.వి.న‌ర‌సింహారావు, ఎస్‌.కె.న‌యీమ్ అహ్మద్‌, ప‌రుచూరి ప్రసాద్‌, టి.రామ‌స‌త్యనారాయ‌ణ‌, వి.సాగ‌ర్‌, వ‌జ్జా శ్రీనివాస‌రావు, పి.సునీల్‌కుమార్ రెడ్డి, కామిని వెంక‌టేశ్వర‌రావు, వి.వెంక‌టేశ్వర‌రావు ఎన్నిక‌య్యారు. అధ్యక్షుడుగా ఎన్నికైన సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికలు సజ

పాలకొల్లులో ‘జనసేన’ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్.. ఇప్పటికే అన్నీ సిద్ధం

Image
సినీ హీరోగా టాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించడంతో పాటు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పవర్ స్టార్ వాటన్నిటినీ వదిలి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీకి దిగారు. కానీ, హీరోగా పవన్‌ను ఆదరించిన ప్రజలు నాయకుడిగా మాత్రం ఎన్నుకోలేదు. అయినప్పటికీ తన జీవితం ప్రజాసేవకే అంకితం అని పవన్ చెప్పకనే చెప్పారు. ఓడినా గెలిచినా తాను ప్రజలకు అండగానే ఉంటానని అంటున్నారు. ఓ వైపు రాజకీయాలు చూసుకుంటూనే ఔత్సాహిక యువత కోసం ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ మంత్రి హరిరామ జోగయ్యను ఆదివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే, ఈ సందర్భంగా పాలకొల్లులో జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు హరిరామ జోగయ్య చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా ఉంటారు. నిర్మాత బన్నీ వాసు ఇన్‌స్టిట్యూట్ కార్యకలాపాలు చూసుకుంటారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎంద

ఇంకెక్కడి సందీప్! అయిపోయాడు అన్నారు: సందీప్ కిషన్

Image
కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత సమకూర్చారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా సినిమా ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాత 'జెమిని' కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హీరో సందీప్ కిషన్ సుధీర్ఘంగా మాట్లాడారు. తన ఆవేదనను, కసిని చెప్పుకున్నారు. "అందరూ నిర్మాత అంటుంటే కొత్తగా ఉంది. నన్ను నేను వెండితెరపై చూసుకుని రెండేళ్లు అవుతోంది. ఒక యాక్టర్‌‌కు అది నరకం. సినిమా తప్ప ఇంకేదీ తెలియని నాలాంటి వాడికి పెద్ద నరకం. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంట

‘నిను వీడని నీడను నేనే’ ట్రైలర్.. సందీప్ కిషన్ అద్దంలో వెన్నెల కిషోర్‌లా!

Image
ఇప్పటి వరకు హీరోగా సత్తాచాటిన ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, వి స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటించింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇవి చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. కానీ, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం భయపెడుతోంది. ‘400 సంవత్సరాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్నపిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది. ఆ ఊరివాళ్లు భయంతో ఆ పిల్లవాడిని చంపేశారు. చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తూన్నాను’ అంటూ చర్చి ఫాదర్ హీరోయిన్‌తో చెప్

కృష్ణను పరామర్శించిన చంద్రబాబు, బాలయ్య

Image
భార్య విజయనిర్మలను కోల్పోయి బాధలో ఉన్న నటశేఖరుడు కృష్ణను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, గల్లా జయదేవ్‌తో కలిసి ఆదివారం హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడారు. వీరి వెంట సూపర్ స్టార్ మహేష్ బాబు, తనయుడు వీకే నరేష్ కూడా ఉన్నారు. ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల ఈనెల 27న కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో 27వ తేదీ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోకసంద్రంలో ముగినిపోయారు. 50 ఏళ్లుగా ఒకరినొకరు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా జీవించారు. ఎక్కడివెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిని చేసి వెళ్లిపోవడంతో ఆ బాధను తట్టుకోవడం కృష్ణ వల్ల కాలేదు. కన్నీమున్నీరు అయ్యారు. శోకసంద్రంలో ముగినిపోయిన కృష్ణను ప్రముఖులంతా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇప

శ‌ర్వానంద్ హీరోగా మరో చిత్రానికి ‘శ్రీకారం’

Image
హీరో మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు ‘శ్రీకారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవరం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ సుకుమార్ ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా.. ఎన్నారై శ‌శికాంత్ వ‌ల్లూరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మాటల రచయిత సాయిమాధ‌వ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను కిశోర్ రెడ్డి అందించ‌గా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగ‌స్ట్ మొద‌టి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. ఇంకా హీరోయిన్లను ఖరారు చేయలేదు. పూర్తి తారాగణాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. కాగా, శర్వానంద్ హీరోగా నటిస్తోన్న మరో చిత్రం ‘రణరంగం’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా శర్వానంద్‌కు గాయమైంది. దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పటక

‘సాగరకన్య’కు భారీ ఊరట.. విషయం ఇదే!

Image
విక్టరీ వెంకటేశ్ నటించిన సాహరవీరుడు.. సాగరకన్య సినిమా పేరుచెబితే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది చెప్పపిల్ల వేషం వేసిన బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టినే. ఆమె అందచందాలు, గ్లామర్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదేమో. ఈ అమ్మడు ఇప్పటికీ కూడా జీరో సైజ్‌ మెయింటెన్ చేస్తూ ఆడియన్స్‌కు కిక్కేక్కిస్తున్నారు. ఫిట్‌నెస్‌‌.. ఫిట్‌నెస్ అని పరితపించే ఈ హీరోయిన్ యోగాసనాలు వేయడంలో కూడా దిట్టే. వ్యాయామానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లిచేసుకొని జీవితం కొనసాగిస్తున్న శిల్పాశెట్టి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్‌కు ఇదివరకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఈమెకు ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) నుంచి ఆదాయపు పన్ను సంబంధిత కేసుకు సంబంధించి భారీ ఊరట లభించింది. శిల్పా శెట్టి 2010-11 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం రూ.7.6 కోట్లుగా ప్రకటించారు. అయితే అసెస్‌మెంట్ తర్వాత ఆదాయపు పన్ను అధికారులు ఈ మొత్తాన్ని రూ.13 కోట్లు

‘ఓ బేబీ’ సరికొత్త ప్రయోగం.. సామ్ అదరగొట్టింది: వెంకటేశ్

Image
‘ఓ బేబీ’లాంటి కథలు ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలని అన్నారు విక్టరీ వెంకటేశ్. కీలకపాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యూనిట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేశ్, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జులై 5న ‘ఓ బేబీ’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను. సినిమా మామూలుగా లేదు. సమంత సినీ జీవితంలోనే ఇది అత్యుత్తమ చిత్రం అనుకోవచ్చు. ఇలాంటి కథను ఎంచుకుని సినిమాగా తెరకెక్కించినందుకు డైరెక్టర్ నందినీరెడ్డిని అభినందిస్తున్నా. బేబీ పాత్రలో సమంత అదరగొట్టేసింది. తెలుగులో ఇప్పటివరకు రాని కథ ఇది. నటీనటులంతా చాలా బాగా చేశారు’ అని మెచ్చుకున్నారు. రానా మాట్లాడుతూ.. తెలుగులో కొత్త తరహా సినిమాలు రావాలని కోరుకునే వాళ్లలో నేనూ ఉంటా. బేబీ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్‌లో కొత్త శకం ప్రారంభమైంది. ఇలాంటి సినిమాలు ప్రతి వారం రావాలి. బేబీగా సమంత నటన సూపర్బ్’ అని అన్నారు. సమంతకూ, లక్ష్మికీ నేనే బోయ్‌ఫ్రెండ్‌ని: రాజేంద్రప్రసాద్ ‘‘ఓ బేబీ’లో నటిస్తుంటే హాలీవుడ్ సినిమాలో నటించిన ఫీలింగ్ కలిగింది. మంచి పాత్రలు ఎంపిక చేసుకోవడం

నటుడు వేణుమాధవ్ ఇంట విషాదం.. వారం కిందటే పెళ్లి, అంతలోనే గుండెపోటు

Image
హా స్య నటుడు వేణుమాధవ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు విక్రమ్‌ బాబు (54) గుండెపోటుతో మృతి చెందారు. స్థిరాస్తి వ్యాపారి అయిన విక్రమ్ బాబు పలు చిత్రాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఆయన నివాసం ఉంటున్నారు. తొమ్మిది రోజుల కిందటే ఆయన తన కూతురు వివాహాన్ని ఘనంగా జరిపించారు. శుక్రవారం (జూన్ 28) రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. విక్రమ్‌ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల స్థానిక కార్పొరేటర్‌ అంజయ్య, పలువురు స్థిరాస్తి వ్యాపారులు, టీఆర్‌ఎస్ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం సాయంత్రం లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో విక్రమ్ బాబు అంత్యక్రియలు పూర్తిచేశారు.

బిగ్‌బాస్ కాన్సెప్ట్ నచ్చదు.. బ్యాడ్‌గా మాట్లాడతా, నాగార్జున కామెంట్స్ వైరల్!

Image
‘బిగ్‌బాస్ 3’ తెలుగు హోస్ట్ ఎవరేనది ఎట్టకేలకు తెలిసిపోయింది. ప్రముఖ నటుడు, నిర్మాత అక్కినేని ఈ షో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రోమో కూడా విడుదలైంది. అయితే, ఈ షో మొదలుకాక ముందే నాగార్జునపై ట్రోల్స్, జోకులు మొదలయ్యాయి. ఇందుకు కారణం.. గతంలో ఆయన ‘బిగ్‌బాస్‌’ షోపై చేసిన వ్యాఖ్యలే. హోస్ట్‌గా నాగార్జున పేరు వెలువడగానే.. నెటిజనులు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోతో ట్రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ 2 తెలుగు హోస్ట్ నానితో కలిసి నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదల సందర్భంగా నాగ్ ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘బిగ్‌బాస్ షో గురించి అడగొద్దు. నేను బ్యాడ్‌గా మాట్లాడతా. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చదు. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో తొంగిచూడటం నచ్చదు’’ అని చెప్పారు. ఆ వ్యాఖ్యల వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చస్తున్నారు. ఆయన ఏదైతే ఇష్టపడడో అదే షోను హోస్ట్ చేయాల్సి వస్తుందని, దీన్నే కర్మ అంటారని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, ఇంకొందరు వద్దనుకున్న షోనే ఆయన చేయాల్సి వస్తోందని అంటున్నారు. అయితే, నాగ్ అభిమానులు మాత్రం అది ఆయన వ్యక్తిగత అభి

‘రణరంగం’ టీజర్.. శర్వానంద్ వైవిధ్య భరితమైన పాత్రలో

Image
తొలి చిత్రం ‘స్వామి రా.. రా..’తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో, హీరోగా తెరకెక్కుతోన్న ‘రణరంగం’ టీజర్ విడుదలైంది. శర్వానంద్ ఇందులో గుబురు గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోద్ది.. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాల’ని శర్వానంద్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. కాజల్ అగ‌ర్వాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శర్వానంద్ ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ‘కొందరికి అతను నేరస్థుడు. మిగిలిన వారికి అతను హీరో’ అంటూ 90ల నాటి కాలం కథతో ప్రారంభమైన టీజర్‌ ఆకట్టుకుంది. ‘కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు’ అంటూ శర్వానంద్‌ చెప్పిన డైలాగ్‌‌ను బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Dear Comrade: ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే...’ సాంగ్ ప్రోమో

Image
‘గీతాగోవిందం’ సూపర్‌హిట్ తర్వాత , రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు భ‌ర‌త్ క‌మ్మకు ఇదే తొలిచిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈ సినిమా నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటోంది. జులై 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పాటలను యూట్యూబ్‌ ద్వారా యూనిట్ విడుదల చేసింది. వీటిలో ‘కడలల్లే వేచె కనులే’, ‘గిర గిర గిర’, పాటలు యూత్‌ను ఊపేస్తున్నాయి. అయితే సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు పక్కా యూత్ సాంగ్‌ను సిద్ధం చేశారు మ్యూజిక్ డైరెక్టర్. దీనికి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెను..’ అంటూ సాగే పల్లవిని నాలుగు భాషల్లో యూనిట్ సభ్యులతో పాడించారు. ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్‌ను రెడీ చేస్తుండగా యూన

అశ్రునయనాల మధ్య విజయ నిర్మలకు తుది వీడ్కోలు.. బోరున విలపించిన కృష్ణ

Image
బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ సినీ చరిత్రలో ఏ మహిళా దర్శకురాలికి సాధ్యంకాని అరుదైన గుర్తింపు పొందిన విజయ నిర్మలకు ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. తొలుత నానక్‌రామ్ గూడలోని ఆమె ఇంటి నుంచి పార్థీవదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు, అక్కడ కాసేపు ఉంచి మెయినాబాద్‌ మండలం చిలుకూరు సమీపంలో వారి ఫామ్‌హౌస్‌‌‌కు తరలించారు. అక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తిచేశారు. అభిమాన నటి కడసారి చూపుకోసం అభిమానులు, ప్రజలు భారీగా తలివచ్చారు. మరణంతో ఆమె భర్త కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. చివరిసారిగా విజయ నిర్మల పార్ధీవదేహాన్ని చూసి కృష్ణ బోరున విలపించారు. ఈ సమయంలో ఆయన పరిస్థితి చూసినవారందరూ కంటతడి పెట్టుకున్నారు. శాస్త్రోక్తంగా అన్నింటి పూర్తిచేసి కుమారుడు నరేశ్ ఆమె చితికి నిప్పంటించారు. నటిగా, దర్శకురాలిగానే కాదు, కుటుంబ పెద్దగానూ తనదైన ముద్రవేశారు. అప్పట్లో సినిమా షూటింగ్‌లతో కృష్ణ బీజీగా ఉంటే కుటుంబాన్ని ఆమె చూసుకున్నారు. బాలనటిగా సినీ ప్రస్థానం ప్రారంభించి కథానాయికగా, దర్శకరాలిగా, నిర్మాతగా తన మార్క్ చూపారు. అంతకు ముందు మెయినాబాద్‌లో అంత్యక్రియల ఏర్పా

విజయనిర్మల కల.. కలగానే మిగిలిపోయింది

Image
సినిమా ప్రపంచంలోనే ఏ మహిళకు దక్కని రికార్డును సొంతం చేసుకున్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్ రికార్డు సాధించిన ఆమె తెలుగు సినిమా పరిశ్రమకే మకుటంగా నిలిచారు. అయితే సినీ రంగంలో ఎన్నో ఘనతలు సాధించిన విజయనిర్మల తన కలను నెరవేర్చుకోకుండానే దివికేగడం విషాదకరం. ఇంతకీ ఆమె కల ఏమిటో తెలుసా?. 50 చిత్రాలకు దర్శకత్వం వహించడం. 44 సినిమాలకు దర్శకత్వం వహించిన విజయనిర్మల ఎప్పటికైనా హాఫ్ సెంచరీ కొట్టాలని అనుకునేవారట. దాని కోసం ఎంతో తపించిన ఆమె కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. ‘2009లో వచ్చిన నేరము-శిక్ష’ ఆమె 44వ సినిమా. ఆ తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్లు కొద్దికాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో దాదాపు నాలుగేళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె 2013లో మరో సినిమా చేసేందుకు కసరత్తులు చేసేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేశ్‌బాబు మల్టీస్టారర్ కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆమెకు తెగ నచ్చేసింది. ఈ సినిమా స్ఫూర్తితోనే ఓ కుటుంబ కథా చిత్రం చేయాలని అనుకున్నారట. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్రయత్నం

‘దేవదాసు’ ఫ్లాప్ తర్వాత మెగా ఫోన్ పట్టనన్నారు.. కానీ

Image
ఆరు దశాబ్దాల సినీ కెరీర్.. 200 సినిమాల్లో నటన, 44 చిత్రాలకు దర్శకత్వం, 10కి పైగా సినిమాల నిర్మాణం. ఇది చాలదా గురించి చెప్పుకోవడానికి. 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల ఒకానొక సమయంలో డైరెక్షన్‌కు స్వస్తి చెబుదామనుకున్నారట. కానీ భర్త కృష్ణ వద్దని వారించడంతో నిర్ణయం మార్చుకున్నారట. 1971లో ‘మీనా’తో డైరెక్షన్ మొదలుపెట్టిన విజయనిర్మల ‘దేవుడే గెలిచాడు’, ‘డాక్టర్‌ సినీ యాక్టర్‌’ ‘పంచాయితీ’, ‘రౌడీ రంగమ్మ’, ‘ముఖ్యమంత్రి’, ‘మూడు పువ్వులు ఆరు కాయలు’,‘రామ్‌ రాబర్ట్‌ రహీం’, ‘ఖైదీ కాళిదాసు’, ‘సిరిమల్లె నవ్వింది’, ‘భోగీ మంటలు’, ‘అంతం కాదిది ఆరంభం’, , ‘బెజవాడ బెబ్బులి’, , ‘ముక్కోపి’, ‘లంకె బిందెలు’ ‘కలెక్టర్‌ విజయ’, ‘అజాత శత్రువు’, ‘పుట్టింటి గౌరవం’, ‘నేరము శిక్ష’ లాంటి సినిమాలు తెరకెక్కించారు. అయితే కృష్ణతో జతకట్టి దర్శకత్వం వహించిన ‘దేవదాసు’ సినిమా ఆమెకు తీరని ఆవేదనను మిగిల్చింది. 1974లో విడుదలైన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై దారుణ పరాజయం పాలైంది. దీంతో మనస్తాపం చెందిన విజయనిర్మల దర్శకత్వానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమెను వ

శోకసంద్రంలో కృష్ణ.. మామ పరిస్థితిపై గల్లా జయదేవ్ భావోద్వేగం

Image
ప్రముఖ దర్శకురాలు, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, సీనియర్‌ నటి విజయనిర్మల (73) అంతిమ యాత్ర కొనసాగుతోంది. తొలుత నానక్‌రామ్‌గూడలోని స్వగృహం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి చిలుకూరులోని విజయగార్డెన్స్‌కు తరలిస్తున్నారు. ఈ అంతిమ యాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్ బాబుతోపాటు ఎంపీ , అరుణకుమారి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే వేలాది మంది అభిమానులు కూడా తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు తరలివచ్చారు. దీంతో నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. మరికాసేపట్లో చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయనిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కన్నడ నటుడు ఉపేంద్ర సైతం అంతిమ యాత్రలో నరేశ్ వెంట ఉన్నారు. మెయినాబాద్‌లో అంత్యక్రియల ఏర్పాట్లను గల్లా జయదేవ్, ఆయన తల్లి అరుణకుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... 50 ఏళ్లపాటు సహధర్మచారిణిగా ఉండి, కష్ట సుఖాల్లో తోడున్న విజయనిర్మల మరణం అందరికన్నా కృష్ణ గారికి తీరని లోటన

విజయ నిర్మల ఇంట్లో వైఎస్ ఫోటోలు చూసి భావోద్వేగానికి గురైన జగన్‌!

Image
విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సీఎం నానక్‌రూమ్ గూడలోని ఆమె నివాసానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇంట్లోని ఓ చోట వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని జగన్‌కు విజయ నిర్మల కుమారుడు నరేశ్ చూపించారు. ఆమెకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని నరేశ్ వివరించారు. ఇంట్లోని ఓ టేబుల్ పై ఆ ఫోటోలకు పూలమాలలు వేసి ఉన్నారు. ఈ ఫోటోలనూ చూస్తూ ఒకింత భావోద్వేగానికి గురైన జగన్, నరేశ్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా సినీ రంగానికి విజయ నిర్మల చేసిన సేవలను జగన్ కొనియాడారు. ఇదిలా ఉండగా కృష్ణ, వైఎస్ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్‌తో చాలా దగ్గరగా ఉండేవారు. 1989 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణ ఎంపీగా విజయం సాధించారు. అయితే, తన విజయం వెనుక వైఎస్ కూడా ఉన్నారనే అప్పట్లో కృష్ణ చెప్పేవారు. తదనంతర పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నా, వైఎస్ కుటుంబంతో కృష్ణ సాన్నిహిత్యంగానే ఉంటూ వచ్చారు. ఆయన సోద

విజయనిర్మల మృతి... ‘అమ్మ’ను కోల్పోయామంటున్న నానక్‌రామ్‌గూడ వాసులు

Image
అలనాటి నటి, ప్రముఖ దర్శకురాలు మృతి సినీ పరిశ్రమతో పాటు ఆమె నివాసముంటున్న ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. తాము ‘అమ్మ’ అంటూ ఆప్యాయతగా పిలుచుకునే విజయనిర్మల ఇకలేరని తెలుసుకున్న నానక్‌రామ్‌గూడ వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏ కష్టమొచ్చినా ఆమె చూసుకుంటారులే అన్న భరోసాతో ఉండే స్థానికులు ఇప్పుడు తమ కష్టసుఖాలు ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు. విజయనిర్మలకు నానక్‌రామ్‌గూడ ప్రాంతమంటే చాలా ఇష్టం. ఇక్కడే తన శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్న ఆమె మూడు దశాబ్దాల క్రితమే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. సుమారు రెండు దశాబ్దాల నుంచి భర్త కృష్ణతో కలిసి అక్కడే ఉంటున్నారు. నానక్‌రామ్‌గూడ ప్రాంత వాసులకు పెద్దదిక్కుగా ఉంటూ ఆ గ్రామ బాగోగులు చూసుకుంటున్నారు. గ్రామంలో జరిగే సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే వారితో కలిసి పోయేవారు. Also Read: ఆ ప్రాంతంలోని పోచమ్మ ఆలయాన్ని విజయనిర్మల 20ఏళ్ల క్రితమే దత్తత తీసుకుని సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఆలయ పూజారికి నెలనెలా జీతం ఆమే ఇస్తున్నారని అక్కడివారు చెబుతున్నారు. నానక్‌రామ్‌గూడలో ఏటా అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా నిర్వహిస్తుంటారు. దీని

విజయనిర్మల అంతిమయాత్ర.. ఫిల్మ్ ఛాంబర్‌కు పార్థీవదేహం

Image
బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన ప్రముఖ నటి అంత్యక్రియలు కొద్దిసేపటి కిందట ప్రారంభమయ్యాయి. ఆమె పార్థీవ దేహాన్ని తొలుత ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కాసేపు ఉంచి, మెయినాబాద్‌ మండలంలోని చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌‌కు తరలిస్తారు. అక్కడే విజయ నిర్మలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంతకు ముందు ఏపీ సీఎం జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ‌కృష్ణ, నరేశ్‌లను వీరంతా ఓదార్చారు. నానక్‌రామ్‌ గూడలోని ఆమె నివాసం నుంచి బంధులువు, అభిమానుల కన్నీటి మధ్య కడసారి యాత్ర మొదలైంది. ముందు ప్రకటించినట్టు ఉదయం 11.00 గంటలకే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా, కొంత ఆలస్యమైంది. మరోవైపు అంతిమయాత్రకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ నిర్మలతో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు. Read Also: మరోవైపు, విజయ నిర్మల మరణవార్తను కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రాణం వదిలివెళ్లిపోయిందని ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరంకావడంలేదు. విజయనిర్మల పార్థివదేహం వద్ద విలపిస్తునన కృష్ణ

విజయ నిర్మలకు నివాళులర్పించి కృష్ణను ఓదార్చిన జగన్

Image
బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థీవ దేహానికి ఏపీ సీఎం నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కోసం సీఎం జగన్ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం ఉదయం తన నివాసం లోటస్‌పాండ్‌‌ నుంచి నానక్‌రామ్‌గూడ‌లోని కృష్ణ నివాసానికి వెళ్లారు. ఉదయం 9గంటలకు విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించారు. విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్‌ వెంట , ఏపీ మంత్రులు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. కడసారి చూపు కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి తరలివస్తున్నారు. పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. గత ఏడునెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్‌ గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 11గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌లో ఆమె అ

‘బ్రోచేవారెవరురా’ ట్విట్టర్ రివ్యూ.. హిట్టు కొట్టేశారు!

Image
సినిమా సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోన్న నటుడు శ్రీవిష్ణు. తన స్నేహితుడు నారా రోహిత్ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీవిష్ణు తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందిస్తున్నారు. కిందటేడాది ‘నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు.. ఈ ఏడాది కూడా ఓ వైవిధ్యమైన చిత్రంతో తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము - చిత్రమే చలనము’ అనేది ఉప శీర్షిక. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ కుమార్ మన్యం నిర్మించారు. సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పుడు కొత్తగా ఉందే అన్నారంతా. ఇక పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రచార కార్యక్రమాలతో సినిమాను బాగానే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. ప్రచార పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన

‘బ్రోచేవారెవరురా’: పొట్టచెక్కలవ్వాల్సిందే.. నాని ఫస్ట్ రివ్యూ

Image
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న చిన్న హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆయన ప్రతి సినిమా ఒక కొత్త కథాంశమే.. ఒక ప్రయోగమే. ఈసారి కూడా డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా చిన్నదే అయినా దీనికి కల్పించిన ప్రచారంతో ప్రేక్షకుల్లో్ అంచనాలు పెరిగాయి. దీనికి తోడు మంచి తారాగణం తోడవడంతో ప్రేక్షకుల దృష్ణి ఈ సినిమాపై పడింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘నేను కేవ‌లం ఆడ‌పిల్లల కోసం ఈ సినిమా చేశా. ప్రతి అమ్మాయి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అదేంట‌న్నది సినిమాలో చూడండి. న‌వ్వులు కూడా చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. ఏడ

విజయ నిర్మలకు నివాళులు అర్పించిన చిరంజీవి.. కృష్ణ, నరేష్‌లను ఓదార్చిన మెగాస్టార్

Image
ప్రముఖ నటి, దర్శకురాలు భౌతిక కాయానికి మెగాస్టార్ నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసానికి వెళ్లిన ఆయన.. విజయ నిర్మల పార్థీవ దేహం వద్ద అంజలి ఘటించారు. అనంతరం కృష్ణ, నరేష్‌లను ఆయన పరిమర్శించారు. జీవిత, రాజశేఖర్ దంపతులు కూడా విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. విషాద వదనంతో ఉన్న కృష్ణను జీవిత ఓదార్చారు. అంతకు ముందే విజయ నిర్మల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మెగాస్టార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అరుదైన దర్శక నటీమణి విజయనిర్మల హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలుగు పరిశ్రమలో భానుమతి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల.. ఆమె నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారని చిరంజీవి తెలిపారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను విజయనిర్మల చాటారన్నారు. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని చిరంజీవి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

విజయ నిర్మల భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులు, కృష్ణను దగ్గరకు తీసుకొని ఓదార్చిన సీఎం

Image
హైదరాబాద్‌: సూపర్ స్టార్ కృష్ణ భార్య, నటి, దర్శకురాలు భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. విజయ నిర్మల పార్థివదేహానికి అంజలి ఘటించారు. భార్య మరణంతో విషాదంలో కూరుకుపోయిన సూపర్ స్టార్ కృష్ణను సీఎం ఓదార్చారు. నరేష్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. కేసీఆర్ వెంట మంత్రులు తలసాని, ఎర్రబెల్లి , శ్రీనివాస్‌ గౌడ్‌ వెళ్లారు. ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూడా విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌లోని ప్రముఖులంతా ఆమె పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు విజయ నిర్మల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్ర

మోహన్‌బాబుకు నేనంటే ప్రాణం: స్వరూపానంద సరస్వతి

Image
విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ , ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతిలు హైదరాబాద్ ఫిలింగనర్ దైవ సన్నిధానాన్ని సందర్శించారు. సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతిలకు.. సినీ నటుడు మోహన్‌బాబు, కళాబంధు సుబ్బిరామిరెడ్డిలు పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో , , పరుచూరి బ్రదర్స్, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు నిర్మల, సురేఖ, ఎస్. గోపాల్ రెడ్డి, దర్శకుడు బి . గోపాల్ , హీరో శ్రీకాంత్, ఊహ, చాముండేశ్వరినాథ్‌లో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన స్వరూపానందేంద్ర సరస్వతి.. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో.. సినిమావారు, తానంటే ప్రాణమిచ్చే మోహన్ బాబు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాలకు ఒక పరిచయ వేదికగా ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠానికి సుబ్బిరామి రెడ్డి ఎంతో చేయూతనిస్తున్నారని.. ఆయన తాను లేకుండా ఈ కార్యక్రమం చేయడానికి ఇష్టపడరన్నారు. తన తర్వాత ఆది శంకరాచార్యుల దృక్పథాన్ని నిలబెట్టడానికి 5వ యావత్ భారత దేశానికి ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వత

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం

Image
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో గురువారం జరిగాయి. ‘ఫిదా’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్‌తో సినిమా చేయబోతున్నారు శేఖర్ కమ్ముల. ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న హీరోగా.. తన డైరెక్షన్‌లోనే వచ్చిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ పెరిగింది. డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పాటు శేఖర్ ఎంచుకున్న తారాగణం కూడా ప్రాజెక్ట్‌కు పెద్ద ఎస్సెట్‌ అయింది.

శోకసంద్రంలో ఉన్న కృష్ణకు పవన్ కళ్యాణ్ ఓదార్పు

Image
భార్య విజయనిర్మల మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన నటశేఖరుడు కృష్ణను జనసేన అధినేత, ప్రముఖ నటుడు ఓదార్చారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని కృష్ణ నివాసంలో ఉంచిన విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించిన పవన్.. ఆ తరవాత కృష్ణను పరామర్శించారు. ఆయనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఆయన్ని ఓదార్చారు. తల్లిని పోగొట్టుకుని బాధలో ఉన్న నరేష్‌కు పవన్ ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌తోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నటుడు మోహన్‌బాబు, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, నటుడు రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి, రచయిత పరుచూరి గోపాలక్రిష్ణ, మెహర్ రమేష్, చార్మి, రష్మిక మందన తదితరులు విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. విజయనిర్మల గారి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. See Photos: కాగా.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్రవేసిన విజయనిర్మల గురువారం (జూన్ 27) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్

తన ప్రాణం ఇకలేదని కృష్ణ కన్నీరుమున్నీరు

Image
సూపర్ స్టార్ కృష్ణ ఎక్కడికెళ్లినా పక్కన ఉండాల్సిందే. 50 ఏళ్లుగా వీరి ప్రయాణం కలిసే సాగింది. ఏనాడూ ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు నటశేఖరుడిని ఒంటరిని చేసి విజయనిర్మల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తన ప్రాణం అయిన విజయ తనను వదిలిపెట్టి వెళ్లిపోవడాన్ని కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. విజయనిర్మల పార్థివదేహం వద్ద కూర్చొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. కృష్ణను అలా చూసి కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందినవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కృష్ణ గారిని అలా చూడలేకపోతున్నాం అంటున్నారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్రవేసిన విజయనిర్మల గురువారం (జూన్ 27) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్ గూడలోని నివాసానికి తీసుకొచ్చారు. కృష్ణ, విజయనిర్మల చాలా ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నారు. సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల సందర్శనార్థం ఈ ఇంట్లో విజయనిర్మల ప

విజయనిర్మల మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

Image
ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు, నిర్మాత మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నానక్‌రామ్ గూడలోని ఆమె నివాసంలో సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.

అంతటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో చూడలేం: చిరంజీవి

Image
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు మృతి పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల లాంటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని ఆయన అన్నారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. విజయనిర్మల లేని లోటు యావత్తు సినీ పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ‘అరుదైన దర్శక నటీమణి శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మన తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయనిర్మల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. కృష్ణగారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్‌ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ

కృష్ణ- విజయనిర్మల పెళ్లి .. రాజబాబు ముందే చెప్పారు!

Image
సినీ పరిశ్రమలో నటీనటులు దంపతులుగా మారడం సాధారణమే. పాతకాలం నుంచి నేటి కాలం వరకు ఎందరో నటీనటులు జీవిత భాగస్వాములుగా మారడం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమ విషయానికొస్తే ఇక్కడా ఎన్నో జంటలు మనకు కనిపిస్తుంటాయి. వారిలో కృష్ణ-విజయ నిర్మల జంట మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇద్దరూ ప్రముఖ నటులే కావడం, ఎన్నో సినిమాల్లో జంటగా నటించడంతో అప్పట్లోనే వీరి వివాహం టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీ కట్టిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. Also Read: 1966లో వచ్చిన ‘రంగులరాట్నం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరుసటి ఏడాదే ‘సాక్షి’ చిత్రంలో కృష్ణతో జోడీ కట్టారు. ఇక్కడే వీరి ప్రేమకు బీజం పడి అది వివాహ బంధంగా బలపడింది. అయితే కృష్ణ-విజయనిర్మల వివాహం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. ప్రముఖ చిత్రకారుడు బాపు 1967లో ‘సాక్షి’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఇందులో కృష్ణ-విజయనిర్మల హీరోహీరోయిన్లు. ఈ సినిమా కోసం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పులిదిండి గ్రామంలో అవుట్‌డోర్ షూటింగ్ చేశారు. ఆ గ్రామంలోని ఆలయంలో కృష్ణుడికి

నాన్నగారితోనే విజయనిర్మల తొలి చిత్రం: బాలకృష్ణ

Image
సీనియర్ నటి, దిగ్గజ దర్శకురాలు (73) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం అర్ధరాత్రి దాటిన తరవాత హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల మృతి వార్త విని తెలు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు.. విజయనిర్మల అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Also Read: ప్రముఖు నటుడు కూడా విజయనిర్మల మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. తన తండ్రితో విజయనిర్మల చేసిన చిత్రాలను ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. విజయనిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. Also Read: ‘నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మల గారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. సినీ రంగ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మల గారు ఒకరు. నాన్నగారి "పాండురంగ మహత్యం

ప్రపంచంలో ఆ ఘనత ఒక్క విజయనిర్మలకే సాధ్యం

Image
అలనాటి నటి, ప్రముఖ దర్శకురాలు మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్‌కు గురిచేసింది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. 1946, ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించిన విజయనిర్మల ఏడో ఏటనే తమిళ సినిమా ‘మత్స్యరేఖ’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 11 ఏళ్ల ప్రాయంలో ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎన్నో బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు పోటీ పడేవి. కేవలం నటిగానే కాకుండా దర్శకత్వం, నిర్మాణ రంగాల్లోనూ విజయనిర్మల రాణించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ,

విజయనిర్మల మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు: వైఎస్ జగన్

Image
అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయనిర్మల బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మిస్ యు నన్నీ.. విజయ నిర్మల మృతిపై మంచు మనోజ్ ఉద్వేగం

Image
నటిగా, దర్శకురాలుగా, సూపర్ స్టార్ క్రిష్ణ భార్యగా తెలుగు సినిమా పరిశ్రమకు విశేషసేవలు అందించిన లెజెండరీ యాక్టర్ విజయ నిర్మల మరణంతో టాలీవుడ్‌లో విషాదవదనం నెలకొంది. బుధవారం రాత్రి గుండెనొప్పితో మరణించిన ఆమె మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. విజయ నిర్మల కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్న ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. మిస్ యు నన్నీ అంటూ.. మీరు వచ్చారు.. చరిత్ర సృష్టించారు. మీలాంటి నటన ఇంకెవరకీ సాధ్యం కాదు.. మీలాంటి వ్యక్తులు మళ్లీ రారు. ఈరోజు మీరు మమ్మల్ని వదిలివెళ్లడం మాకు తీవ్ర విషాదం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా’ అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశారు మంచు మనోజ్.

విజయనిర్మల మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి

Image
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి, ప్రముఖ దర్శకురాలు (73) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స గుండెపోటుతో పొందుతూ మరణించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న విజయనిర్మల మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

విజయనిర్మల కన్నుమూత, టాలీవుడ్‌లో విషాదం

Image
టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. Read Also: ఏడేళ్లకే బాలనటిగా.. విజయనిర్మల 1950లో ‘మత్య్సరేఖ’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా పరిచమయ్యారు. అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు. అక్కడ పలు చిత్రాల్లో నటించి... పదకొండో ఏట ‘పాండుర

నన్ను ఏడిపించగలిగే ఏకైక మగాడు అతను: శ్రీవిష్ణు

Image
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్న నటుడు శ్రీవిష్ణు. ఆయన హీరోగా ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషించారు. వివేక్‌ సాగర్‌ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ హీరో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజైన త‌ర్వాత తెలుస్తుంది.. చిన్న సినిమా చేశామో, పెద్ద సినిమా చేశామో! నేను "మెంట‌ల్ మ‌దిలో" సినిమా చూశాను. వివేక్ చాలా బాగా చేశాడు. ఇలాంటి మంచి డైర‌క్టర్‌కి మంచి స్టార్ కేస్ట్ దొరికింది. ‘నిన్నుకోరి’లో ఫ‌స్ట్ షాట్ చూసిన త‌ర్వాత నివేదా మంచి పెర్ఫార్మర్ అని తెలిసింది. నేను ద‌ర్శితో ‘ఉన్నది ఒక్కటే జింద

Jr NTR: తారక్‌ని నటుడిగా తీర్చిదిద్దింది నాని!

Image
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తరవాత ఆ కుటుంబం నుంచి మళ్లీ నటనలో అంతటి ప్రశంసలు అందుకున్న నటుడు . తాతకు తగ్గ మనవడిగా నేటితరం హీరోల్లో ఉత్తమ నటుడిగా ఆయన ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఎలాంటి పాత్రనైనా తాను అవలీలగా చేసేయగలనని ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల ద్వారా చెప్పకనే చెప్పారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన ఈ నందమూరి యంగ్ టైగర్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను నటుడిగా తీర్చిదిద్దింది గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి అంటూ ఒక బహిరంగ సభలో మంత్రి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చిన తరవాత వరుసగా రెండుసార్లు గెలిచి ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కు గుడివాడలో ఆత్మీయ అభినందన సభ జరిపారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సభలో నానిని సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణాశాఖ, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ కొడాలి నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. సాటిలేని నిరంత విజేత కొడాలి నాని అంటూ పేర్ని నాని కొనియాడారు. హర

నిఖిల్ ‘శ్వాస’ మధ్యలోనే ఆగిపోయిందా!

Image
ఆ మధ్య వరుస హిట్లతో మంచి జోరుమీద కనిపించిన యంగ్ హీరో ఇప్పుడు కాస్త వెనకబడ్డారు. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘కేశవ’ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని నిఖిల్ తనవైపు తిప్పుకున్నారు. అయితే, కిందటేడాది వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక నిఖిల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ముద్ర’ సినిమా ఆ తరవాత ‘అర్జున్ సురవరం’గా పేరు మార్చుకున్నా విడుదలకు నోచుకోలేదు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాలు పడుతూ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే, నిఖిల్ ‘శ్వాస’ అనే మరో సినిమాను కిందటేడాది మొదలుపెట్టారు. గతేడాది దసరా సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. నివేదా థామస్ హీరోయిన్. కిషన్ కట్టా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తేజ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, రెడ్ స్కై ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై చరణ్ తేజ్ ఉప్పలపాటి, హరిణికేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ కూడా అయిపోయింది. అయితే, ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. సినిమాను తెరకెక్కిస్తున్న విధానం నిఖిల్‌కు నచ్చలేదని, ఔట్‌పుట్‌పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వ

చిరంజీవి కోసం ఫ్రెష్ ఫేస్.. కొరటాల వేట!

Image
మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ను పూర్తిచేసేశారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చిరంజీవి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమాకు ఇంకా హీరోయిన్‌ను ఫైనల్ చేయలేదు. చిరంజీవి సరసన ఒక కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని కొరటాల శివ చూస్తున్నట్లు సమాచారం. సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. కథతో పాటు దానిలో ఉన్న పాత్రల విషయంలోనూ కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే చిరంజీవి పక్కన చేయబోయే హీరోయిన్ విషయంలో కూడా కొరటాల చాలా జాగ్రత్త తీసుకుంటున్నారని అంటున్నారు. మెగాస్టార్ వయసుకు, ఇమేజ్‌కు సరిపోయే ఒక కొత్త ముఖం కోసం కొరటాల వెతుకుతున్నారట. వాస్తవానికి చిరంజీవి సర

‘సైరా’ షూటింగ్‌లో అనుష్కకు గాయం.. సీక్రెట్‌గా డాక్టర్‌ను కలిసిన జేజమ్మ!

Image
టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రాయలసీమ పోరాటయోధుడు, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. సినిమాకు కీలకమైన ఒక సన్నివేశంలో అనుష్క నటిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కాలికి గాయమైందట. అయితే, ఈ విషయం బయటికి రాకుండా ‘సైరా’ చిత్ర యూనిట్, అనుష్క జాగ్రత్త పడ్డారని సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా అనుష్క హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం చేయించుకున్నారని, కాలికి ఫ్యాక్చర్ కావడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారని తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రమాదా

బికినీలో 45 ఏళ్ల ముదురు హీరోయిన్.. పిచ్చ హాట్!

Image
సాధారణంగా వయసు పెరిగేకొద్దీ అందం తరిగిపోతుంది. కానీ, సినీ తారల విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. వాళ్లకు వయసు పెరుగుతన్నకొద్దీ అందం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందం మీద వాళ్లు పెట్టే శ్రద్ధ అలా ఉంటుంది మరి. హేమమాలిని, రేఖ, కాజోల్, మాధురి దీక్షిత్, , టబు, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్ వీళ్లంతా ఈ కోవకు చెందినవాళ్లే. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలకు దూరంగా ఉన్న కొంత మంది మాజీ హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా వీరు అభిమానులకు దగ్గరవుతున్నారు. ఇదిలా ఉంటే, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మంగళవారం (జూన్ 25న) తన 45వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పుట్టినరోజును ఆమె లండన్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. చెల్లెలు కరీనా కపూర్, తల్లి బబితా కపూర్ ఇతర కుటుంబ సభ్యులతో ఆమె లండన్‌లో పార్టీ చేసుకున్నారు. అక్కడ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసుకున్న హాట్ ఫొటోను తాజాగా కరిష్మా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘ఏ వయస్సులో ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అని క్యాప్షన్ కూడా పెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ వెరీ నాటీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన కరాటే కళ్యాణి

Image
కరాటే కళ్యాణి.. ఈ పేరు వింటే మనకు బాగా గుర్తొచ్చేది ‘బా..బీ’ అనే డైలాగ్. ఆమె ఎప్పటి నుంచో తెలుగు సినీపరిశ్రమలో నటిగా కొనసాగుతున్నప్పటికీ ‘కృష్ణ’ సినిమాలో పనిమనిషి పాత్ర చాలా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో బ్రహ్మానందం వంటింటి ప్రియురాలిగా ఆమె నటన, యాటిట్యూడ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరవాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆమె టీవీ సీరియళ్లతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, కళ్యాణిని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో కళ్యాణి తన వ్యక్తిగత, సినీ జీవితాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. వీటిలో సినీ జీవితానికి సంబంధించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘షూటింగ్ సెట్‌లో నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు కాస్త కోపంగా, దురుసుగా ఉంటారని.. ఎవరైనా తప్పుచేస్తే అరిచేస్తూ ఉంటారని అంటుంటారు. వారిద్దరితో మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రూమర్‌లో నిజమెంత?’ అని కళ్యాణిని యాంకర్ అడిగారు. దీనికి కళ్యాణి సమాధానం ఇస్తూ.. ‘వాస్తవానికి ఎవరికైతే వర్క్ మీద కమాండ్ ఉంటుందో, ఎవరైతే మనం చేస్తున్నది వృత్తి ధర్మం అనుకుంటారో వాళ్లకు ఆ కోపం ఉంటుంది. నాకు కూ

‘మౌనరాగం’ జూన్ 25, ఎపిసోడ్: నాపై నీ ఫీలింగ్ చెప్పమంటే భరత్‌కి దేవుడి పటం చూపించిన అమ్ములు

Image
స్వచ్ఛమైన మనసుతో తన వాళ్ల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే అమ్ములు ఎప్పుడూ తన సంతోషం కోసం ఆలోచించలేదు. తన జీవితం ఏం అయిపోయినా ఫర్వాలేదనుకుంటూ మాట రాని తన మౌనానికి.. మనసుని జత చేసి, తన బాధల్నీ భావాలనీ మౌనంగానే దాచేస్తుంది. తండ్రి కోసమే.. గుండెలనిండా నిండిన మనిషిని దూరం చేసుకుంటుంది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తున్న కథ ఏం జరుగుతుందో చూద్దాం! నేడు(జూన్‌ 25) ప్రసారం కానున్న ఎపిసోడ్‌ వివరాలు ముందుగానే ‘సమయం’లో మీకోసం. 241 ఎపిసోడ్‌లోని హైలెట్స్‌ చూద్దాం! నీలవేణి, అమ్ములు, కాంతమ్మ(అమ్ములు నాన్నమ్మ), చక్రీ అంతా ఓ చోట కూర్చుని.. లక్కీ పుట్టింటికి వెళ్లిపోవడంతో ఇల్లంతా బోసుపోయిందని బాధపడుతూ ఉంటారు. పుట్టింట్లో లక్కీ కూడా మౌనంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నందిని చాలా స్వీట్స్, చికెన్‌ కర్రీ ఇలా అన్ని ఐటమ్స్‌ లక్కీ దగ్గరకు తెచ్చి.. తినిపిస్తూ ఉంటుంది. ‘‘అమ్మా.. సారీ అమ్మా! నిన్ను చాలా బాధపెట్టాను’’ అంటుంది ప్రేమగా లక్కీ నందినితో... ‘‘అవన్నీ ఇప్పుడు ఎందుకురా? నువ్వు సంతోషంగా ఉండాలి. తిను’’ అంటూ ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది నందిని. ఇంతలో అక్కడికి వచ్చిన సరయూ.. ‘‘బాగా తిను లక్కీ.. అత్

ఈ ఫొటోలో నా ముఖం మాత్రమే చూసే వాళ్లెందరు? : శ్రీరెడ్డి

Image
‘చెన్నైలో నేను ఉండే ఏరియాలో పవర్ పోయింది... 8 గంటలైనా పవర్ రావడం లేదు. ఉక్కబోతకు నిద్రే పట్టడం లేదు. బాగా నీరసించిపోయా.. కాస్త సేదతీరుదాం అని డాబా పైకి వెళ్లి చిన్న కునుకు తీశా.. నేను డాబాపై కునుకు చేస్తుండగా... ఫొటోకి పోజు కొట్టా. ఆ ఫొటో ఇదిగో’ అంటూ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో వదిలింది . ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ని రాబట్టిన శ్రీరెడ్డి.. హాట్ హాట్ కామెంట్స్ మాత్రమే కాదు.. అంతకు మించిన హాట్ హాట్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలోనే షేర్ చేసి హీటెక్కిస్తుంటోంది. తాజాగా ఆమె షేర్ చేస్తున్న ఫొటోలకు ఆమె ఫాలోవర్స్ కామెంట్స్‌‌, లైక్స్‌ మోత మోగిస్తుండగా... నయనానందం పొందే కొంతమంది అల్లరి ఫాలోవర్స్ ఆమె వక్షోజాలపై కామెంట్స్ చేస్తూ హాట్ స్లీపింగ్ అని రెచ్చిపోయారు. దీంతో శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించి.. ‘మీలో ఎంతమంది నా ఫేస్‌ని మాత్రమే చూస్తున్నారు’? అని మరింత రెచ్చగొట్టే ప్రశ్న వేసింది శ్రీరెడ్డి. ఇలాంటి సమాధానం వెతుక్కునే ప్రశ్నను.. నిజంగా నిజం అని పైకి చెప్పలేని ఆన్సర్‌లు ఉన్న ప్రశ్నల్ని పబ్లిక్‌గా అడిగేస్తే ఎలా శ్రీరెడ్డి అని కొందరు అంటుంటే.. శ్రీరెడ్డి ఎలాంటి సమా

Oh Baby ఏంటీ అందం.. సమంత ఫొటోకి రాశీ ఖన్నా ఫిదా

Image
అటాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అక్కినేని ముందు వరుసలో ఉంటారు. ఆమె ఏం చేసినా వైరలే. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ ఆమె నటిస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. కాస్ట్యూమ్, జ్యుయలరీ కంపెనీలకు కూడా ప్రచారం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా తీసుకున్న ఫొటోసూట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నారు. సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత మూడు ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో సమంత చాలా అందంగా ఉన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ క్రెషా బజాజ్ కలెక్షన్స్‌ను ప్రచారం చేయడంలో భాగంగా సమంత ఈ ఫొటోషూట్ చేశారు. క్రెషా బజాజ్ డిజైన్ చేసిన డ్రెస్, వన్రజవేరి జ్యుయలరీతో సమంత ఫొటోలకు పోజులిచ్చారు. రోహన్ శ్రేష్ఠ ఈ ఫొటోలను తీశారు. కాగా, ఈ ఫొటోలకు సమంత అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కేవలం సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తోటి హీరోయిన్లు కూడా ఏంటీ అందం అంటూ కొనియాడుతున్నారు. ముఖ్యంగా రాశీ ఖన్నా ‘సో ప్రెట్టీ’ అని కామెంట్ పెట్టారు. అలాగే హన్సిక ఎమోజీతో తన ప్రేమను తెలియజేశారు. ఇదిలా ఉంటే, సమంత ప్రధాన పా

Shraavya Reddy: అలల గాలికి ఎదను పరిచి.. సెల్ఫీ వీడియోతో బీచ్‌లో హాట్ పాప రచ్చ

Image
సముద్రపు గాలికి మైమరపు కలిగిందో ఏమో కాని.. యూట్యూబ్ హాట్ బ్యూటీ శ్రావ్యా రెడ్డి మరోసారి క్లోవేజ్ షో చేసింది. ఎలా చూపిస్తే ఎద అందాలను మొహం మొత్తేలా వడ్డించొచ్చో బాగా తెలిసిన శ్రావ్యా రెడ్డి కాలిఫోర్నియా మలిబు బీచ్‌లో హాట్ అవతారం ఎత్తింది. చిన్నపాటి ఫ్రాక్ వేసుకుని బీచ్‌లో నడుస్తూ.. కెమెరాను టాప్ యాంగిల్‌లో పెట్టి సెల్ఫీ వీడియో తీసింది. అసలే అలల తాకిడి.. ఆపై సముద్రపు గాలులకు ఆమె ఒంటిపై ఉన్న చిన్నపాటి వస్త్రాలు ఎగురుతుంటే.. ఆ అందాలను తన కెమెరాతో బంధించి తనివితీరా ఆస్వాదించమని తన ఫాలోవర్స్ కోసం సోషల్ మీడియాలో వదిలింది. ఇక అమ్మడు అందాలను ఫిదా అయి నయనానందం పొందిన ఆమె ఫాలోవర్స్ లైక్‌ల మీద లైక్‌లు బాదేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి 5.2k లైక్స్ రాగా.. 900 పైగా కామెంట్స్.. 170 షేర్లు వచ్చాయి. యూట్యూబ్‌లో ఫిట్ నెస్ మంత్ర అంటూ హాట్ హాట్ వీడియాలతో తన ఫ్యాన్స్‌కి నయనానందం కలిగించే శ్రావ్యా రెడ్డి అడపాదడపా సినిమాల్లోనూ నటించింది. అంగాంగ ప్రదర్శనకు తెరతీసే ఈ హాట్ భామ.. అందాల ప్రదర్శనను కొత్త పుంతలు తొక్కిస్తూ బీర్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంజ్‌ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ సెలబ్రిటీగా మారింది. ఆ మధ్య వెం