‘దేవదాసు’ ఫ్లాప్ తర్వాత మెగా ఫోన్ పట్టనన్నారు.. కానీ

ఆరు దశాబ్దాల సినీ కెరీర్.. 200 సినిమాల్లో నటన, 44 చిత్రాలకు దర్శకత్వం, 10కి పైగా సినిమాల నిర్మాణం. ఇది చాలదా గురించి చెప్పుకోవడానికి. 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల ఒకానొక సమయంలో డైరెక్షన్‌కు స్వస్తి చెబుదామనుకున్నారట. కానీ భర్త కృష్ణ వద్దని వారించడంతో నిర్ణయం మార్చుకున్నారట. 1971లో ‘మీనా’తో డైరెక్షన్ మొదలుపెట్టిన విజయనిర్మల ‘దేవుడే గెలిచాడు’, ‘డాక్టర్‌ సినీ యాక్టర్‌’ ‘పంచాయితీ’, ‘రౌడీ రంగమ్మ’, ‘ముఖ్యమంత్రి’, ‘మూడు పువ్వులు ఆరు కాయలు’,‘రామ్‌ రాబర్ట్‌ రహీం’, ‘ఖైదీ కాళిదాసు’, ‘సిరిమల్లె నవ్వింది’, ‘భోగీ మంటలు’, ‘అంతం కాదిది ఆరంభం’, , ‘బెజవాడ బెబ్బులి’, , ‘ముక్కోపి’, ‘లంకె బిందెలు’ ‘కలెక్టర్‌ విజయ’, ‘అజాత శత్రువు’, ‘పుట్టింటి గౌరవం’, ‘నేరము శిక్ష’ లాంటి సినిమాలు తెరకెక్కించారు. అయితే కృష్ణతో జతకట్టి దర్శకత్వం వహించిన ‘దేవదాసు’ సినిమా ఆమెకు తీరని ఆవేదనను మిగిల్చింది. 1974లో విడుదలైన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై దారుణ పరాజయం పాలైంది. దీంతో మనస్తాపం చెందిన విజయనిర్మల దర్శకత్వానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమెను వారించిన భర్త కృష్ణ జయాపజయాలు పట్టించుకోకుండా డైరెక్షన్ చేయాలని సూచించడంతో మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం మీద తీసిన ‘సాహసమే నా ఊపిరి’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఆమెకు ఓసారి ఎదురైన ఎన్టీఆర్? నా ఇంకా సినిమాలు తీసే ఆలోచన ఉందా? అని సరదాగా అడిగారట.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ