‘రణరంగం’ టీజర్.. శర్వానంద్ వైవిధ్య భరితమైన పాత్రలో

తొలి చిత్రం ‘స్వామి రా.. రా..’తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో, హీరోగా తెరకెక్కుతోన్న ‘రణరంగం’ టీజర్ విడుదలైంది. శర్వానంద్ ఇందులో గుబురు గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోద్ది.. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాల’ని శర్వానంద్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శర్వానంద్ ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ‘కొందరికి అతను నేరస్థుడు. మిగిలిన వారికి అతను హీరో’ అంటూ 90ల నాటి కాలం కథతో ప్రారంభమైన టీజర్ ఆకట్టుకుంది. ‘కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు’ అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగ్‌ను బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Post a Comment