‘మౌనరాగం’ జూన్ 25, ఎపిసోడ్: నాపై నీ ఫీలింగ్ చెప్పమంటే భరత్‌కి దేవుడి పటం చూపించిన అమ్ములు
స్వచ్ఛమైన మనసుతో తన వాళ్ల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే అమ్ములు ఎప్పుడూ తన సంతోషం కోసం ఆలోచించలేదు. తన జీవితం ఏం అయిపోయినా ఫర్వాలేదనుకుంటూ మాట రాని తన మౌనానికి.. మనసుని జత చేసి, తన బాధల్నీ భావాలనీ మౌనంగానే దాచేస్తుంది. తండ్రి కోసమే.. గుండెలనిండా నిండిన మనిషిని దూరం చేసుకుంటుంది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తున్న కథ ఏం జరుగుతుందో చూద్దాం! నేడు(జూన్ 25) ప్రసారం కానున్న ఎపిసోడ్ వివరాలు ముందుగానే ‘సమయం’లో మీకోసం. 241 ఎపిసోడ్‌లోని హైలెట్స్ చూద్దాం! నీలవేణి, అమ్ములు, కాంతమ్మ(అమ్ములు నాన్నమ్మ), చక్రీ అంతా ఓ చోట కూర్చుని.. లక్కీ పుట్టింటికి వెళ్లిపోవడంతో ఇల్లంతా బోసుపోయిందని బాధపడుతూ ఉంటారు. పుట్టింట్లో లక్కీ కూడా మౌనంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నందిని చాలా స్వీట్స్, చికెన్ కర్రీ ఇలా అన్ని ఐటమ్స్ లక్కీ దగ్గరకు తెచ్చి.. తినిపిస్తూ ఉంటుంది. ‘‘అమ్మా.. సారీ అమ్మా! నిన్ను చాలా బాధపెట్టాను’’ అంటుంది ప్రేమగా లక్కీ నందినితో... ‘‘అవన్నీ ఇప్పుడు ఎందుకురా? నువ్వు సంతోషంగా ఉండాలి. తిను’’ అంటూ ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది నందిని. ఇంతలో అక్కడికి వచ్చిన సరయూ.. ‘‘బాగా తిను లక్కీ.. అత్తయ్యా చాలా బెంగ పెట్టుకుంది నీకోసం.. ఎక్కడ ఎలా ఉన్నావో ఏమోనని’’ అంటూ ఎత్తిపొడుస్తుంది. దాంతో కోపమొచ్చిన లక్కీ.. ‘‘నేను ఉన్నది మానవత్వం లేని మనుషుల మధ్య కాదు సరయూ.. కన్నతల్లిగా ప్రేమను చూపించేవాళ్లు ఆ ఇంట్లోనూ ఉన్నారు’’ అంటుంది కాస్త గట్టిగా.. ‘‘ప్రేమదేముంది లక్కీ? పైసా ఖర్చుపెట్టకుండా వచ్చేదేగా.. ఇక్కడ చూడు ఎన్నిసౌకర్యాలు ఉన్నాయో.. ఇవన్నీ ఆ మట్టింట్లో వస్తాయా?’’ అంటుంది మరింత రెచ్చగొడుతూ.. ‘‘అందరూ నీలాగే సౌకర్యాలు చూడరు సరయూ.. ఇచ్చే వస్తువుకన్నా.. ఆ వస్తువు ఇచ్చే మనిషికి మనమీద ఎంత ప్రేమ ఉందన్నదే ముఖ్యం. అయినా అభిమానాన్ని కళ్లతో కాదు.. మనసుతో చూడాలి. నీకు అది ఎప్పటికీ చేతకాదులే!’’ అంటుంది లక్కీ సమాధానంగా... ‘‘చూశావా అత్తయ్యా! నేను మనసులోని మనిషినట. తనకి మెట్టింటివాళ్లు ఎక్కువే అయ్యుండొచ్చు.. కానీ ఎదుటివాళ్లని కించపరచాల్సిన అవసరం ఏంటి? మా అభిమానాలు మాకూ ఉంటాయి’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది సరయూ.. దాంతో నందిని.. ‘‘సరయూ ఆగు.. ఇలా రా!’’ వెనక్కి పిలిచి... ‘‘లక్కీ అది అన్నదానిలో తప్పు ఏం ఉంది? నువ్వు అక్కడ సరిగా తినకపోవడం వల్లేగా బిడ్డ బలహీనంగా ఉందని డాక్టర్ చెప్పింది?’’ అంటుంది నందిని లక్కీతో... ‘‘అది వేరు.. ఇది వేరమ్మా!!’’ అంటూ సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్న లక్కీతో నందిని మాట్లాడుతూ.. ‘‘లక్కీ.. సరయూ నీ అన్నకు కాబోయే భార్య. ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు అది ఆలోచించుకుని మాట్లాడటం నేర్చుకో’’ అంటుంది కాస్త సీరియస్‌గా... అది విన్న సరయూ.. మనసులో పొంగిపోతూ.. ‘నేను లక్కీని కావాలనే రెచ్చగొట్టాను అత్తయ్యా! నేను గెలిచేవారకూ ఇలానే రెచ్చగొడతాను!’ అనుకుంటుంది. అమ్ములు ఇంటికి భోజనానికి వచ్చిన భరత్.. భోజనం చేసి చెయ్యి కడుక్కుని.. అమ్ములు తీసుకొచ్చే పాయసం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్ములు రాగానే పాయసం తింటూ.. ‘అమ్ములు మనసులో నా స్థానం ఏంటో తెలుసుకోవాలి!’ అనుకుంటాడు తనలో తాను. వెంటనే ఆలస్యం చెయ్యకుండా.. ‘‘అమ్ములూ! నేను ఒకటి అడగొచ్చా? నీ సమాధానం కావాలి.. మీ ఇంట్లో అందరూ నన్ను సొంత మనిషిలా చూస్తున్నారు.. మీ నాన్నమ్మ మనవడిలా అనుకుంటుంది.. మీ నాన్నగారు బంధువులా ఆధరిస్తున్నారు.. మరి నువ్వు నన్ను ఎలా చూస్తున్నావ్?’’ అని అడుగుతాడు భరత్ సూటిగా... ఆ ప్రశ్నకు సమాధానంగా అమ్ములు దేవుడిని చూపించి.. ‘‘దేవుడిలా చూస్తున్నాను’’ అంటూ సైగ చేస్తుంది. ‘ఇదేంటి దేవుడ్ని చూపిస్తుంది? ప్రేమ ఉన్నట్లా? లేనట్లా? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నా మీద అభిమానమే కానీ ప్రేమ లేదన్నమాట’ అని అనుకుంటాడు మనసులో.. వాళ్లు మాట్లాడుకోవడం ఇష్టంలేనట్లుగా చూస్తాడు చక్రీ. అంకిత్–లక్కీ మాట్లాడుకుంటూ ఉంటారు. ‘‘ఏంట్రా ఆలోచిస్తున్నావ్’’ అని అడుగుతుంది లక్కీ అంకిత్‌ని. ‘‘ఏం లేదురా లక్కీ..’’ అంటూ నిరుత్సాహంగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ‘‘అవునురా? ఇందాక భరత్ అన్నయ్య ఎందుకు? కాల్ చేశాడు’’ అని అడుగుతుంది లక్కీ అంకిత్‌ని. Read Also: కార్తీకదీపం ఈరోజు (జూన్ 25) ఎపిసోడ్: ‘‘అమ్ములు ఇంటికి భోజనం వెళ్తున్నానని చెప్పడానికి చేశాడు’’ అంటాడు అకింత్ సమాధానంగా.. ‘‘ఆ విషయం చెప్పడానికి ఎందుకు చేశాడు? గత వారం రోజులుగా అక్కడే తింటున్నాడుగా?’’ అంటుంది అనుమానంగా.. దాంతో అంకిత్ మనసులో.. ఆ భరత్ గాడికి నాకు జరిగిన ఛాలెంజ్ గురించి చెప్పకూడదు’ అనుకుంటూ ఉంటాడు. మళ్లీ లక్కీనే మాట్లాడుతూ... ‘‘గత వారం రోజులుగా భరత్ ఆ ఇంటికి వచ్చి తింటున్నాడు.. నాకెందుకో నచ్చేది కాదురా.. అసలు ఆ ఇంట్లో పొజీష్ ఏంటో చక్రీకి ఫోన్ చేసి అడుగుదాం ఉండు’’ అని ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది లక్కీ అంకిత్‌కి వినిపించాలనే ఉద్దేశంతో... చక్రీ ఫోన్ లిప్ట్ చెయ్యగానే.. ‘‘భరత్ అన్నయ్య అక్కడే ఉన్నాడా?’’ అని అడుగుతుంది లక్కీ చక్రీని. ‘‘అవును.. దూరంగా అక్కతో మాట్లాడుతున్నాడు’’ అంటాడు అయిష్టంగా.. ‘‘అదేంటి? అసలు పెళ్లి కాని పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు.. భరత్ అన్నయ్య ఇలా రావడం మంచిది కాదుగా..? ఒకప్పుడు మావయ్య (సీనయ్య) గారే వాళ్లిద్దరినీ (అమ్ములు–భరత్‌లని) అనుమానించారుగా? మళ్లీ ఇప్పుడు ఎందుకు ఇలా? సరేలే నేను మళ్లీ చేస్తాను’’ అంటూ ఫోన్ పెట్టేస్తుంది లక్కీ.. ‘‘అప్పుడు రచ్చ చేసిన ఆ పెద్ద మనిషి (సీనయ్య) భరత్ వచ్చి వెళ్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఎవరూ అడగరా?’’అంటూ లక్కీ ముందు అంకిత్ ఆవేశంగా అరుస్తాడు. ‘‘నాన్నమ్మా భరత్ బాబు.. రోజు ఇలా రావడం బాగోదు.. నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు కదా! కావాలంటే నేనే క్యారేజ్ తీసుకెళ్లి ఇస్తుంటాను కదా నాన్నమ్మా’’ అంటాడు చక్రీ కాంతమ్మతో... ‘‘నెమ్మదిగా అనరా.. భరత్ బాబు వింటే బాగుదో’’ అంటూ ఉండగానే.. ఆ మాటలన్నీ భరత్ వినేస్తాడు. కమింగ్ అప్‌లో... ‘‘అక్కా! బావ(అంకిత్) సరయూతో నిశ్చితార్థం చేసుకుంటుంటే.. నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావ్ అక్కా? బాధ అనిపించలేదా?’’ అని అడుగుతాడు చక్రీ అమ్ముల్ని. వినిపించినా పట్టించుకోలేనట్లుగా ఉంటుంది అమ్ములు. ‘‘అక్కా.. ఎప్పటికీ ఇలానే ఉండిపోలేవుగా? నాన్న నీకు సంబంధం చూస్తే ఏం చేస్తావ్?’’ అని అడుగుతాడు చక్రీ మళ్లీ అమ్ముల్ని. ఆవేశంగా చక్రీవైపు తిరిగిన అమ్ములు.. ‘‘నాన్న ఏం చెబితే నేను అదే చేస్తాను’’ అంటుంది సైగలు చేస్తూ కోపంగా... మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం! మౌనరాగం కొనసాగుతుంది.
Comments
Post a Comment