విజయనిర్మల మృతి... ‘అమ్మ’ను కోల్పోయామంటున్న నానక్‌రామ్‌గూడ వాసులు

అలనాటి నటి, ప్రముఖ దర్శకురాలు మృతి సినీ పరిశ్రమతో పాటు ఆమె నివాసముంటున్న ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. తాము ‘అమ్మ’ అంటూ ఆప్యాయతగా పిలుచుకునే విజయనిర్మల ఇకలేరని తెలుసుకున్న నానక్‌రామ్‌గూడ వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏ కష్టమొచ్చినా ఆమె చూసుకుంటారులే అన్న భరోసాతో ఉండే స్థానికులు ఇప్పుడు తమ కష్టసుఖాలు ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు. విజయనిర్మలకు నానక్‌రామ్‌గూడ ప్రాంతమంటే చాలా ఇష్టం. ఇక్కడే తన శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్న ఆమె మూడు దశాబ్దాల క్రితమే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. సుమారు రెండు దశాబ్దాల నుంచి భర్త కృష్ణతో కలిసి అక్కడే ఉంటున్నారు. నానక్‌రామ్‌గూడ ప్రాంత వాసులకు పెద్దదిక్కుగా ఉంటూ ఆ గ్రామ బాగోగులు చూసుకుంటున్నారు. గ్రామంలో జరిగే సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే వారితో కలిసి పోయేవారు. Also Read: ఆ ప్రాంతంలోని పోచమ్మ ఆలయాన్ని విజయనిర్మల 20ఏళ్ల క్రితమే దత్తత తీసుకుని సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఆలయ పూజారికి నెలనెలా జీతం ఆమే ఇస్తున్నారని అక్కడివారు చెబుతున్నారు. నానక్‌రామ్‌గూడలో ఏటా అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనికి కృష్ణ-విజయనిర్మల దంపతులు హాజరై అన్నదానం నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు.
తమ ప్రాంత వాసులకు కష్టమొచ్చినా నేనున్నానంటూ విజయనిర్మల ముందుండేవారని గుర్తుచేసుకుంటూ అక్కడివారు కన్నీరుమున్నీరవుతున్నారు. పనివాళ్లను సొంత మనుషులుగా చూసుకునేవారని, వారికి ఇళ్లు కట్టించి, పిల్లలకు పెళ్లిళ్ల ఖర్చు కూడా భరించారని గ్రామస్థుడొకరు చెప్పారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరై అందరినీ పలకరించేవారని, ఆమె మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆ ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు. తమకు తోడుగా ఉండి ‘అమ్మ’లా చూసుకునే విజయనిర్మల ఇకలేరన్న విషయం నమ్మలేకపోతున్నామంటూ భోరున విలపిస్తున్నారు. Also Read: Also Read:
Comments
Post a Comment