‘దొరసాని’ ట్రైలర్.. ప్రేమ కూడా ఒక ఉద్యమమే!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘దొరసాని’. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహనిర్మాత. కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించారు. ఇదే ఈయనకు తొలి సినిమా. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈనెల 12న ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చి్ంది. ఆనంద్ దేవరకొండను సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. కానీ, తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరుగుతుంది. పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆ నాటి కాలాన్ని కళ్లకు కట్టేటట్టు సహజసిద్ధమైన సెట్టింగ్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. ఇంటికొచ్చిన ఆనంద్ దేవరకొండకు ఆమె చెంబుతో తాగడానికి నీళ్లు ఇస్తుంది. ఆ చెంబు పట్టుకుని ‘మేం తాగొచ్చా’ అని ఆనంద్ అడుగుతాడు. వెంటనే దొరసాని అతనికి ముద్దు పెడుతుంది. ఈ ఎమోషనల్ సీన్ ట్రైలర్‌కే హైలైట్. ఈ సినిమాలో హీరో జైలుకు వెళ్తాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. జైలులో ఉన్న సమయంలో అతనికి ఒక ఉద్యమకారుడు తగులుతాడు. ‘ఉద్యమంలో చావు కూడా ఒక విజయమే’ అని ఆ ఉద్యమకారుడు అనగానే.. ‘నా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’ అని అంటాడు హీరో. ఆనంద్ దేవరకొండ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అచ్చం విజయ్ దేవరకొండలానే అనిపిస్తోంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్టుకొట్టేలానే కనిపిస్తోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ