శోకసంద్రంలో ఉన్న కృష్ణకు పవన్ కళ్యాణ్ ఓదార్పు

భార్య విజయనిర్మల మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన నటశేఖరుడు కృష్ణను జనసేన అధినేత, ప్రముఖ నటుడు ఓదార్చారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని కృష్ణ నివాసంలో ఉంచిన విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించిన పవన్.. ఆ తరవాత కృష్ణను పరామర్శించారు. ఆయనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఆయన్ని ఓదార్చారు. తల్లిని పోగొట్టుకుని బాధలో ఉన్న నరేష్‌కు పవన్ ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌తోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నటుడు మోహన్‌బాబు, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, నటుడు రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి, రచయిత పరుచూరి గోపాలక్రిష్ణ, మెహర్ రమేష్, చార్మి, రష్మిక మందన తదితరులు విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. విజయనిర్మల గారి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. See Photos: కాగా.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్రవేసిన విజయనిర్మల గురువారం (జూన్ 27) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్ గూడలోని నివాసానికి తీసుకొచ్చారు. కృష్ణ, విజయనిర్మల చాలా ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నారు. శుక్రవారం విజయనిర్మల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Comments
Post a Comment