విజయనిర్మల అంతిమయాత్ర.. ఫిల్మ్ ఛాంబర్‌కు పార్థీవదేహం

బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన ప్రముఖ నటి అంత్యక్రియలు కొద్దిసేపటి కిందట ప్రారంభమయ్యాయి. ఆమె పార్థీవ దేహాన్ని తొలుత ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కాసేపు ఉంచి, మెయినాబాద్‌ మండలంలోని చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌‌కు తరలిస్తారు. అక్కడే విజయ నిర్మలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంతకు ముందు ఏపీ సీఎం జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ‌కృష్ణ, నరేశ్‌లను వీరంతా ఓదార్చారు. నానక్‌రామ్‌ గూడలోని ఆమె నివాసం నుంచి బంధులువు, అభిమానుల కన్నీటి మధ్య కడసారి యాత్ర మొదలైంది. ముందు ప్రకటించినట్టు ఉదయం 11.00 గంటలకే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా, కొంత ఆలస్యమైంది. మరోవైపు అంతిమయాత్రకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ నిర్మలతో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు. Read Also: మరోవైపు, విజయ నిర్మల మరణవార్తను కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రాణం వదిలివెళ్లిపోయిందని ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరంకావడంలేదు. విజయనిర్మల పార్థివదేహం వద్ద విలపిస్తునన కృష్ణను అలా చూసి కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందినవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కృష్ణ గారిని అలా చూడలేకపోతున్నాం అంటున్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఏ మహిళా దర్శకురాలికీ సాధ్యం కాని విధంగా ఏకంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పింది. ఆమె దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు చాలా వరకూ విజయం సాధించాయి. అభ్యుదయ భావాలున్న చిత్రాలే ఆమె ఎక్కువగా తీశారు. నవలా చిత్రాలకు ఆమె పెట్టింది పేరు. సావిత్రి తర్వాత లెజెండరీ నటుడు శివాజీ గణేషన్‌ను డైరెక్ట్ చేసిన రెండో మహిళ డైరెక్టర్‌గా ఆమె అరుదైన ఘనత సాధించారు. విజయ నిర్మల ఖాతాలో మరో అరుదైన రికార్డుంది. ప్రపంచ సినీ చరిత్రలో ఒక నటుడితో కలిసి అత్యధిక చిత్రాల్లో కథానాయికగా నటించిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఆ కాగా, వీళ్లిద్దరూ కలిసి 47 చిత్రాల్లో నటించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ