Posts

Showing posts from November, 2021

పాటలు.. ఆయన చెప్పే మాటలే కాదు.. సిరివెన్నెల వ్యక్తిత్వం అలాంటిది: నాగార్జున ఎమోషనల్

Image
ప్రముఖ సినీ గేయ రచయిత మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. ఆయన ఇక లేరనే వార్త సినీ ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో సిరివెన్నెల కన్నుమూశారు. అయితే సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈ రోజు (బుధవారం) ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్‌ లోని ఫిలిం చాంబర్‌‌లో ఉంచగా పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెలకు కడసారి చూసేందుకు వచ్చిన అక్కినేని .. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు సిరివెన్నెలతో ఎప్పటినుంచో స్నేహం ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడు కలిసినా ఏం మిత్రమా అని తీయగా పలకరించేవారని చెబుతూ 'క్రిమినల్' సినిమాలో 'తెలుసా మనసా పాట' జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ''సీతారామ శాస్త్రి గారిని ఎప్పుడు కలిసినా చాలా సరదాగా మాట్లాడేవారు. ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తొస్తోంది. అదే క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా పాట.

Radhe shyam Love Anthem: స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ప్రభాస్- పూజా హెగ్డే రొమాంటిక్ మూమెంట్స్

Image
యంగ్ రెబల్ స్టార్ హీరోగా రూపొందుతున్న భారీ సినిమా . పాన్‌ ఇండియా మూవీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్‌‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబోయే సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. ప్రమోషన్స్ వేగవంతం చేసి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతోంది. కోవిడ్‌తో పాటు పలు కారణంలతో రాధే శ్యామ్ షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వస్తాయా? అని ఇన్నాళ్లు ఎదురుచూసిన రెబల్ స్టార్ అభిమానులు ఖుషీ అయ్యేలా ఇప్పుడు ఒక్కో అప్‌డేట్ వదులుతున్నారు మేకర్స్. ఇప్పటికే కొన్ని పోస్టర్స్, ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన టీజర్ ద్వారా అభిమానులకు పూనకాలు తెప్పించిన యూనిట్.. తాజాగా ప్రేమ బాణం విసురుతూ రాధే శ్యామ్ లవ్ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసింది. “రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ ప్రోమోతోనే ఈ సాంగ్‌పై ఆసక్తి పెరగగా.. తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి లవ్ బర్డ్స్ మనసు దోచుకున్నారు. ఈ పాటలో ప్రభాస్‌, చాలా అందంగా కనిపించడమే గాక వాళ్ళిద

ఫిలిం చాంబర్‌లో సిరివెన్నెలకు సినీ ప్రముఖుల నివాళి.. కన్నీటి పర్యంతమైన తనికెళ్ళ భరణి

Image
సాహిత్య దిగ్గజం ఇకలేరని తెలిసి యావత్ సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కలం నెలకొరిగిందని తెలిసి సినీ ప్రముఖులు షాకయ్యారు. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. సిరివెన్నెల మరణ వార్త వినగానే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకొని విచారం వ్యక్తం చేశారు. అయితే సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈ రోజు (బుధవారం) ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్‌ లోని ఫిలిం చాంబర్‌‌లో ఉంచారు. ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిరివెన్నెలను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తగా.. పలువురు సినీ ప్రముఖులు వచ్చి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతూ సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, మహేష్ బాబు, తనికెళ్ళ భరణి, అల్లు అర్జున్, చిరంజీవి, రావు రమేశ్, వెంకటేష్, మణిశర్మ, గుణశేఖర్, సునీత, పరుచూరి గోపాలకృష్ణ, స్రవంతి రవికిషోర్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సాయికుమార్, బాలకృష్ణ తదితరులు సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకు

సాహితీ హిమాలయం సీతారాముడు : ఇళయరాజా

Image
తెలుగు సినీ పాట‌ల దిగ్గ‌జ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అనంత లోకాల‌కు వెళ్లిపోవ‌డంపై యావ‌త్ సినీ లోకం సంతాపాన్ని వ్య‌క్తం చేసింది. ఆయ‌న‌తో అనుబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటూ దుఃఖంలో మునిగిపోయారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన పాట‌ల‌కు అంద‌మై బాణీల‌ను అందించిన సంగీత ద‌ర్శ‌కుడు మాస్ట్రో ఇళ‌య‌రాజా. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఎన్నో విన‌సొంపైన పాట‌లు సంగీతాభిమానుల‌ను అల‌రించాయి. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ ఆ పాట‌లు ఎవ‌ర్‌గ్రీన్‌. తామిద్ద‌రి మ‌ధ్య వృత్తిప‌ర‌మైన పోటీ గురించి.. సిరివెన్నెల‌తో త‌న‌కున్న బంధాన్ని క‌వితాత్మ‌కంగా తెలియ‌జేశారు ఇసై జ్ఞాని ఇళ‌యరాజా. వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో అందమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు.. ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు... మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్

షాకిచ్చిన జక్కన్న.. RRR ట్రైల‌ర్ వాయిదా .. నిరాశలో నంద‌మూరి, మెగాభిమానులు..!

Image
ఎంటైర్ ఇండియన్ సినీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో నంద‌మూరి, మెగాభిమానులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూడ‌టం ప్రారంభించారు. అయితే యూనిట్ అందరికీ మరోసారి షాక్ ఇచ్చింది. ట్రైలర్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు కారణం ఎంటనేది చిత్ర యూనిట్ తెలియజేయలేదు. అయితే సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు RRR ట్రైల‌ర్ ఇంకా రెడీ కాలేద‌ట‌. అనుకున్న ఔట్‌పుట్ వ‌చ్చే వర‌కు జ‌క్క‌న్న కాంప్ర‌మైజ్ కాడు. కాబ‌ట్టి ట్రైల‌ర్ విడుద‌ల ఆల‌స్య‌మైనా ప‌ర్లేదు. కానీ మంచి ట్రైల‌ర్‌ను క‌ట్ చేయాల‌ని RRR టీమ్ ప్లాన్ చేసింద‌ట‌. ఈ కార‌ణంగా ట్రైల‌ర్‌ను పోస్ట్ పోన్ చేసింది. దీంతో RRR ప్రేమికులు, నందమూరి, మెగాభిమానులు ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. కానీ ఈ వెయిటింగ్‌కు తగ్గ ఫలితం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రీ ఇండిపెండెన్స

Sirivennela : సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోవడానికి గల కారణాలు చెప్పిన డాక్టర్ !

Image
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) మంగళవారం కన్నుమూశారు. దాదాపు వారం ముందే ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో హాస్పిట‌ల్‌లో చేరారు. నిమోనియా కార‌ణంగా హాస్పిట‌ల్‌లో సిరివెన్నెల చేరార‌న్నారు. అయితే మంగ‌ళ‌వారం ప‌రిస్థితి విష‌మంగా మార‌టం, ఆయ‌న క‌న్నుమూయ‌టం అన్నీ అలా జ‌రిగిపోయాయి. అస‌లు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ఏమైంది? బావున్నాడనుకున్న వ్య‌క్తి ఎందుకు హ‌ఠాత్తుగా చ‌నిపోయారు? అని చాలా మంది మ‌దిలో క‌లుగుతున్న ప్ర‌శ్న‌. అయితే సిరివెన్నెల‌కు వైద్యం అందించిన కిమ్స్ ఎండి భాస్క‌ర్‌రావు ఈ విష‌యంపై మాట్లాడారు. ‘‘ ఆరేళ్ల క్రితం శాస్త్రిగారికి క్యాన్సర్ కారణంగా సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వ‌చ్చింది. త‌ర్వాత బైపాస్ స‌ర్జరీ జ‌రిగింది. వారం రోజుల ముందు మళ్లీ ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ అని వ‌స్తే.. దాంట్లో కూడా సగం తీసేశారు. రెండు రోజులు బాగానే ఉన్నారు. త‌ర్వాత ఆరోగ్యప‌రంగా కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయి. దాంతో ఆయ‌న్ని అడ్వాన్స్ ట్రీట్‌మెంట్ కోసం కిమ్స్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. రెండు రోజులు బాగానే ఉన్నారు. చికిత్స‌లో బాగంగా ప్రికాస్ట‌మీ చేశాం. 45 శాతం ఊపిరితిత్తు తీసేశాం. మిగిల

నేలకొరిగిన సిరివెన్నెల కలం.. ఇంటి అద్దె కట్టలేని ఆ పరిస్థితుల్లో! రాజమౌళి ఎమోషనల్ మెసేజ్

Image
అద్భుతమైన పాటల రచయితగా టాలీవుడ్ లోకంలో ఫేమస్ అయిన లిరిక్ దిగ్గజం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల కలం నేలకొరిగిందని తెలిసి యావత్ సినీ లోకంలో విషాదం నిండుకుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాజమౌళి.. ఆయనతో కెరీర్ ఆరంభం నాటి గత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ భావోద్వేగ పూరిత సందేశం పెట్టారు. ''1996లో మేము అర్థాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల నుంచి ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులు కోవద్దురా ఓరిమి' అన్న సీతారామ శాస్త్రి గారి పదాలు.. భయం వేసినప్పుడల్లా గుర్తు చేసుకొని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. అప్పటికి నాకు శాస్త్రి గారి

Sirivennela : సిరివెన్నెల మ‌ర‌ణం సంతాపాన్ని తెలియజేసిన ఎన్టీఆర్, చరణ్

Image
సీతారామ‌శాస్త్రికి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఉన్న అనుబంధంసినీ ప‌రిశ్ర‌మ ఉన్నంత కాలం అలాగే నిలిచిపోతుంది. అనారోగ్యంతో ఆయ‌న క‌న్నుమూసినా, ఆయ‌న రచ‌న‌ల‌తో మ‌న మ‌న‌సుల్లో అలాగే ఎప్ప‌టికీ నిలిచిపోతారు. మంగ‌ళ‌వారం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్లో క‌న్నుమూశారు. సిరివెన్నెల‌ ఇక లేర‌నే విష‌యం తెలిసిన టాలీవుడ్ షాక్ అయ్యింది. ఆయ‌న మృతిపై టాలీవుడ్ ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు, అభిమానులు త‌మ సంతాపాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన RRR సినిమాలో దోస్తీ సాంగ్‌ను సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ర‌చించారు. అలాంటి సీనియ‌ర్ రైట‌ర్ మ‌ర‌లిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌డంపై రామ్‌చ‌ర‌ణ్ సందిస్తూ ‘‘సీతారామశాస్త్రిగారు ఇక లేరు అనే విష‌యం తెలియ‌గానే షాక‌య్యాను. చాలా బాధేసింది. RRR, సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాల గురించి ఆయ‌న చెప్పిన మాట‌లు నాకెప్ప‌టికీ గుర్తుండిపోతాయి. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు, సాహిత్యానికి ఆయ‌న చేసిన సేవ‌లు వెల క‌ట్ట‌లేనివి. ఆయ‌న కుటుంబానికి న

Sirivennela : సిరివెన్నెల మరణం సినీ పరిశ్రమకే కాదు..తెలుగు సాహిత్యానికి తీరని లోటు : పవన్ కళ్యాణ్

Image
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ర‌చ‌యిత‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆయ‌న వేసిన ముద్ర చిర‌స్మ‌ర‌ణీయం. అలాంటి రైట‌ర్ ఇక లేర‌నే వార్త తెలుసుకున్న యావ‌త్ తెలుగు సినీ ప్ర‌పంచం శోక సంద్రంలో మునిగిపోయింది. తెలుగు సినీ సెల‌బ్రిటీలు మ‌ర‌ణంపై త‌మ సంతాపాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేనాని, హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ట్విట్ట‌ర్ ద్వారా త‌న సంతాపాన్ని తెలియ‌జేస్తూ ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ‘‘వాగ్దేవి వరప్రసాదంగా మన తెలుగునాట నడయాడిన విద్వత్‌క‌వి శ్రీ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారు. బ‌ల‌మైన భావాన్ని, మాన‌వ‌త్వాన్ని, ఆశావాదాన్ని చిన్న చిన్న మాట‌ల్లో పొదిగి జ‌న సామాన్య గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత ర‌చ‌న చేసిన అక్ష‌ర త‌ప‌స్వి శ్రీ శాస్త్రిగారు. తెలుగు పాట‌ను కొత్త పుంత‌లు తొక్కించిన ఆ మ‌హ‌నీయుడు ఇకలేరు అనే వార్త‌ను జీర్ణించుకోవ‌డం క‌ష్టం. అస్వ‌స్థ‌త‌తో హాస్పిట‌ల్‌లో చేరిన శాస్త్రిగారు. కోలుకుంటారు అని భావించాను. ఇంత‌లోనే ఈ విషాద వార్త‌ను వినాల్సి వ‌చ్చింది. సీతారామ‌శాస్త్రిగారి మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కే కాదు.. యావ‌త్ తెలుగు సాహితీ లోకానికి తీర‌ని ల

ఇకలేరు అంటే.. ఎలా..? సిరివెన్నెల మరణంపై సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్

Image
సినిమా పాటలో తనదైన శైలిలో సాహిత్యాన్ని మేళవించి మెప్పించిన ప్రముఖ గేయ రచయిత ఇకలేరని తెలిసి యావత్ సినీ లోకం షాకైంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. సాహిత్య దిగ్గజం మృతితో టాలీవుడ్ సర్కిల్స్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాళా తపస్వి కె. విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ రియాక్ట్ అవుతూ సిరివెన్నెల కుటుంబానికి తమ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తాజాగా స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ''తరలిపోయింది వసంతం.. ఈవేళలో నుండి చివరకు మిగిలేదీ వరకు సిరివెన్నెల (నాకు బాబాయి) గారు రాసిన ప్రతి పాటా ఎంతో గర్వంగా పాడాను. ఇక లేరు అంటే.. ఎలా?'' అంటూ సిరివెన్నెల ఫొటో షేర్ చేస్తూ ఇన్స్‌స్టాలో పోస్ట్ పెట్టారు సునీత. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణంలో సిరివెన్నెల క‌లం ఎప్పుడూ అలుపెర‌గ‌లేదు. వేలాది పాట‌లు రాసి ప్రేక్ష‌కుల గుండెల్లో తన ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌త

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై బాలకృష్ణ స్పందన.. బాధతో కూడిన మెసేజ్

Image
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతితో టాలీవుడ్‌ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నందమూరి రియాక్ట్ అవుతూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ''తెలుగు పాటను తన సాహిత్యంతో దశ దిశలా వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత గారు నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతదేహాన్ని రేపు (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉ

Sirivennela Sitaramasastri Death: సాహిత్యానికి ఇది చీకటి రోజు.. సిరివెన్నెల మరణంపై చిరంజీవి భావోద్వేగ సందేశం

Image
ప్రముఖ సినీ గేయ రచయిత మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి మెగాస్టార్ ఎమోషనల్ అవుతూ ట్విట్టర్‌లో సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. ''సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆరు రీజుల క్రితం హాస్పిటల్లో జాయిన్‌ అవ్వడానికి వెళుతున్న సమయంలో నేను ఆయనతో మాట్లాడాను. తన ఆరోగ్యం బాగాలేదని తెలిసి మద్రాసులో ఒక మంచి హాస్పి టల్‌ ఉందని, ఇద్దరం వెళదాం.. అక్కడ జాయిన్‌ అవుదురు గాని అని అన్నాను. ఆయన మిత్రమా, ఈ రీజు ఇక్క డ జాయిన్‌ అవుతాను నెలాఖరులోపు వచ్చేస్తాను. నువ్వు అన్నట్టుగానే అప్పటికి ఉపశమనం రాకపోతే, ఖచ్చితంగా మనిద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అన్నారు. అలా వచ్చెస్తానని వెళ్ళిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారు అనేది ఊహించ లేకపోయాను. చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయనకు అన్నిరకాల మెరుగైన వైద్యం అందివ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయనకు ఫోన్‌ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారు. అంత ఉత్సాహంగా దాదాపు 20నిముషాల

Pawan Kalyan: పవన్ జాతకం ప్రకారం రాజకీయాల్లో ఉండరు.. 2024 నాటికి జనసేన దుకాణం క్లోజ్: వేణు స్వామి సంచలనం

Image
2024 ఎన్నికలే లక్ష్యంగా అధినేత పార్టీని బలోపేతం చేసే దశగా అడుగులు వేస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే సొంత పార్టీని స్థాపించినప్పటికీ ఇప్పటివరకూ ఒంటిరిగా పోటీ చేసింది లేదు. టీడీపీ, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఎం-సీపీఐ ఇలా వివిధ పార్టీలతో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవి చూశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఇక జనసేన తరుపున పోటీ చేసిన గెలిచిన ఒకే ఒక్క సీటు.. రాజోలు (రాపాక వరప్రసాద్)ని నిలుపుకోలేకపోయారు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా జంపింగ్ జపాంగ్‌ల జాబితాలో చేరిపోయారు. అయితే నష్టనివారణ చర్యలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. బీజేపీ పొత్తుతో 2024 ఎన్నికల్లో సీఎం కుర్చీ ఎక్కడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పవన్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంటే.. ఆయనకు రాజకీయాలు అచ్చు రావు.. త్వరలో ఆ పార్టీయే ఉండదంటూ జోస్యం చెప్పారు ప్రముఖ సినీ జోతిష్యుడు . సమంత-నాగచైతన్య విడిపోతారని.. అఖిల్‌కి పెళ్లే జరగదని.. చంద్రబాబు ఓడిపోతారని ముందే జోతిష్యం చెప్పి పాపులర్ అయిన వేణు స్వామి.. పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం

అప్పుడు కుడి భుజం పోతే ఇప్పుడు ఎడమ భుజం పోయింది.. సిరివెన్నెల మృతిపై కె. విశ్వనాథ్ ఎమోషనల్

Image
ప్రముఖ సినీ గేయ రచయిత మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ఆయ‌న క‌లం ఎప్పుడూ అలుపెర‌గ‌లేదు. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రితో కళాతపస్వి బంధం ఎంతో ప్రత్యేకమైంది. సీతారామ శాస్త్రిని టాలీవుడ్ లోకానికి పరిచయం చేసింది డైరెక్టర్ కె. విశ్వనాథ్. తన పెన్ ప‌వ‌ర్ ఏంటో తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు రుచి చూపించిన ఆయన 'సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలు రాసి అదే పేరును ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి కాగా సిరివెన్నెల సాంగ్స్ రాశాక సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారిపోయింది. అలా సిరివెన్నెలతో అలుపెరగని ప్రయాణం చేసి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ రూపుదిద్దిన కె. విశ్వనాథ్.. ఇక సిరివెన్నెల లేరనే వార్త తెలిసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ''ఇది నమ్మలేని నిజం. చాల పెద్ద లాస్ నాకు. బాలసుబ్రమణ్యం పోయినపుడు కుడి భుజం పోతే సిరివెన్నెల మరణంత

Sirivennela : సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్

Image
టాలీవుడ్ ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత అనారోగ్యంతో క‌న్నుమూశారు. సినీ ప్రేమికులు, సాహిత్య ప్రేమికులు ఎంతో దుఃఖానికి లోన‌య్యే వార్త ఇది. పాట‌ల ర‌చ‌యిత‌గా తెలుగు సినిమాపై ఆయ‌న చూపిన ప్ర‌భావం ఎంత గొప్ప‌దో సినీ ప‌రిశ్ర‌మ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేస్తోంది. అయితే ఈ విష‌యాన్ని మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఏనాడో చెప్పేశారు. ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌లో అగ్ర హీరోలంద‌రూ ఉన్న‌ప్పుడు త్రివిక్ర‌మ్ సీతారామ‌శాస్త్రి గురించి మాట్లాడుతూ ‘‘సీతారామశాస్త్రిగారి సాహిత్యం గురించి మాట్లాడేంత శక్తి నాకు లేదు. నాకున్న పదాలు సరిపోవు. ఆయ‌న సిరివెన్నెల సినిమాలో ‘విధాత త‌ల‌పున’ అనే సాంగ్‌లో ‘ప్రాగ్దిశ వేణియపైన దిన‌క‌ర మ‌యూఖ తంత్రుల‌పైన‌... ’ అనే లైన్ వినగానే తెలుగులో డిక్షనరీ ఉంటుంది. దాన్ని శ‌బ్ద ర‌త్నార‌కం అంటార‌ని తెలుసుకున్నాను. దాన్ని కొనుక్కుని ప్రాగ్దిశ‌, మ‌యూఖం అంటే ఏంట‌నే విష‌యాల‌ను తెలుసుకున్నాను. ఒక పాట‌ను ప్రేక్ష‌కుడికి అర్థ‌మ‌య్యేలా రాయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా అర్థం చేసుకోవాల‌నే ఆలోచ‌న పుట్టేలా రాయొచ్చు అని తెలియ‌జేసి తెలుగు పాట గొప్ప‌తనాన్ని పెంచిన వ్య‌క్తి సీతారామ‌శాస్త్రిగారు. తిల‌క్ రాసి

సిరివెన్నెల టాలెంట్‌ గుర్తించింది మొదట ఆయనే.. చిన్నప్పటి సీతారామశాస్త్రి కోరిక అదే!!

Image
తెలుగు సినీ పాటను, అందులోని మాధుర్యాన్ని ప్రపంచానికి వినిపించి మన్ననలు పొందారు . ఆయన కలం నుంచి లిఖించబడ్డ ప్రతి అక్షరం సగటు ప్రేక్షకుడి నరనరాన ఇమిడిపోయింది. 3000లకు పైగా పాటలు రాసిన ఆయనను 11 సార్లు నంది అవార్డ్‌ వరించింది. ఉత్తమ గేయ రచయితగా 4 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. పలు సినిమాల్లో ఆర్టిస్ట్‌ గానూ మెరిశారు. అలాంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. సినీ లోకమంతా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతోంది. అయితే సీతారామ శాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామ శాస్త్రికి పాటలు పాడాలనే కోరిక ఉదేదట. అయితే పాడటానికి ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చిన సీతారామ శాస్త్రి టాలెంట్ మొదట ఆయన సోదరుడు గుర్తించాడట. వెంటనే ఆయనకు ఓ సలహా ఇచ్చారట. అన్నయ్యా.. ఎప్పుడూ కొత్త పదాలతో ఏదో ఒకటి పాడుతున్నావు.. కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. సాహిత్యం దిశగా ప్రయత్నించు అని చెప్పి ప్రోత్సహించారట. దీంతో ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌ బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారట సీతారామ శాస్త్రి. అప్పట్

నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల... నంది అవార్డులు తెచ్చిపెట్టిన పాటలు

Image
పాట మూగ‌బోయింది.. స్నేహితుడిగా, ప్రేమికుడిగా, భ‌ర్త‌గా, భార్య‌గా, భ‌క్తుడిగా, దేవుడిగా, విమ‌ర్శ‌కుడిగా, ప్రేక్ష‌కుడిగా ప్ర‌తి పాట‌కు ఆయ‌న ఆలోచ‌న‌గా మారి పాట‌తో ప్రేక్ష‌కుడ్ని ప్ర‌శ్నించ‌డ‌మే కాదు.. ఉత్తేజాన్ని నింపిన పాట‌ల ఇంద్ర‌జాలీకుడు, మాంత్రికుడు, తాంత్రికుడు ఎవ‌రైనా ఉన్నారా? అంటే అందుకు స‌మాధానంగా క‌నిపించిన వ్య‌క్తి సీతారామ‌శాస్త్రి. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ఆయ‌న క‌లం ఎప్పుడూ ఆల‌పెర‌గ‌లేదు. వేలాది పాట‌లు రాసి ప్రేక్ష‌కుల గుండెల్లో తన ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌తో, స్పూర్తితో జ్వాల‌ను ర‌గిల్చిన నిత్య చిరంజీవి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. మ‌హా మ‌హులు పోటీ ప‌డుతున్న కాలంలో వ‌చ్చి రావడంతోనే హ్యాట్రిక్ నందుల‌ను సొంతం చేసుకుని సీనియ‌ర్ రైట‌ర్ వేటూరికి ప్ర‌త్యామ్నాయంగా నిలిచిన దిగ్గ‌జం మ‌న సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఈయ‌న ఇంటిపేరు సిరివెన్నెల అని చాలా మంది నేటి త‌రానికి చెందినవారు అనుకోవ‌చ్చు కానీ.. అది కాదు. సీతారామ‌శాస్త్రి ఇంటిపేరు చేంబోలు. కానీ తొలిచిత్రం సిరివెన్నెల‌. ఈ సినిమాను డైరెక్ట‌ర్ కె.విశ్వ‌నాథ్‌. ఆయ‌న పరిచ‌యం చేసిన రైట‌ర్ సీతారామ‌శాస్త్రి. తొలి చిత్రంతోనే త‌న పెన్

Sirivennela: అక్షరానికి అన్యాయం.. ఒంటరైన సాహిత్యం.. సిరివెన్నెల మరణంపై సెలబ్రిటీల స్పందన

Image
సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు రాసిన సిరివెన్నెల మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. అక్షరానికి అన్యాయం చేసి, సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంత దూరం వెళ్లిపోయిన మహాకవి, మహా మనీషి గురువు గారు సీతారామశాస్త్రి గారికి కన్నీటి వీడ్కోలు అంటూ ప్రముఖ రచయిత కోనా వెంకట్ ట్వీట్ చేస్తూ సానుభూతి తెలియజేశారు. ఆయనతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నారు.

మహానుభావా వీడుకోలు.. మరొకరు లేరు రాబోరు.. సిరివెన్నెల మృతిపై టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Image
సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతున్నాయి. రీసెంట్‌గా ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూయగా.. కొద్దిసేపటి క్రితం ప్రముఖ గేయ రచయిత తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల నవంబర్ 24వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకం విడిచి వెళ్లారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. క్రమంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు (మంగళవారం) సాయంత్రం ఆయన కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహానుభావా.. వీడుకోలు.. మరొకరు లేరు.. రాబోరు.. ఇక మీరు లేరనే వార్త జీర్ణించు కోలేకపోతున్నాం అంటూ వెన్నెల కిషోర్ తన సంతాపం తెలిపారు. ''అక్షరానికి అన్యాయం చేసి, సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంత దూరం వెళ్లిపోయిన మహాకవి, మహా మనిషి గురువు గారు సీతారామ శాస్త్రి గారికి కన్నీటి వీడ్కోలు'' అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశారు. సిరివెన్నెల మరణ వార్త విని షాకయ్యానంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ పెట్టారు.

సిరివెన్నెల ఇకలేరు.. శోకసంద్రంలో సినిమా ఇండస్ట్రీ

Image
సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేసిన సిరివెన్నెల కలం ఆగిపోయింది. న్యుమోనియాతో బాధపడుతున్న కన్నుమూశారు. నవంబర్ 24 నుంచి హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల ఆరోగ్యం.. గత రెండు రోజులుగా ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు సిరివెన్నెల. ‘నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని.. అగ్గి తోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని’.. ‘రామ బాణం ఆపింది రావణ కాష్టం ’’.. ‘‘కృష్ణ గీత ఆపింది నిత్య కురుక్షేత్రం ’’ ఇలాంటి ఎన్నో ఎన్నెన్నోస్ఫూర్తినిచ్చే గేయాలు రాసి.. తన సాహిత్యంతో ఉత్తేజాన్ని నింపిన సిరివెన్నెల సీతా రామశాస్త్రి మరణంతో సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. 1955 సంవత్సరం మే 20వ తేదీన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల.. బాలకృష్ణ హీరోగా కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయన అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. అయితే 1986లో కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘

83 Trailer: మైదానంలో ఎగిరిన భారత కీర్తిపతాకం.. భావోద్వేగ సన్నివేశాలతో వీడియో వైరల్

Image
1983లో టీమిండియా సాధించిన విక్టరీ ఎన్నటికీ మరువలేనిది. ఎలాంటి అంచనాలు లేని జట్టును నాయకుడిగా ముందుకు నడిపించి విశ్వవిజేతగా అందలమెక్కించారు. టీమిండియాకు సారథ్యం వహించి ప్రపంచకప్‌ను ముద్దాడారు . అయితే ఆ సమయంలో జరిగిన సంఘటనలు, భారత దేశం విశ్వ విజేతగా నిలిచిన విధానాన్ని '83' సినిమాలో చూపించబోతున్నారు. తాజా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి క్రీడాభిమానుల దృష్టిని లాగేశారు మేకర్స్. ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌బడింది. దేశం గర్వించేలా ప్రపంచ కప్ సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎల్లలు దాటించారు అప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్. ఆ రోజుతో ఇండియా చిరకాల స్వప్నం సాకారమైంది. ఈ అపూర్వ ఘ‌ట్టాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రిస్తూ `83` పేరుతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు బాలీవుడ్ డైరెక్టర్ క‌బీర్‌ ఖాన్. చిత్రంలో కపిల్‌ దేవ్ పాత్రను పోషించారు. ఆయన సతీమణి పాత్రలో దీపికా పదుకొణె నటించింది. ఈ మూవీ నిర్మాణంలో నాగార్జున భాగం కావడం విశేషం. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటూ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీని ఎట్టకేలకు డిసెంబర్‌ 24వ తేద

Sirivennela : సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విషమం

Image
టాలీవుడ్ సీనియ‌ర్ పాట‌ల ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉంది. కొన్నిరోజులు ముందు వ‌ర‌కు ఆయ‌న నిమోనియా బాధ‌ప‌డ్డారు. ఆ క్ర‌మంలో కాస్త సీరియ‌స్ కావ‌డంతో ఆయ‌న్ని న‌వంబ‌ర్ 24 సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్లో చేర్చారు. ఐసీయూలో ఉంచి చికిత్స‌ను అందిస్తూ వ‌చ్చారు. ప‌రిస్థితి ఇంకా విష‌మించింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కిమ్స్ డాక్ట‌ర్స్ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను పిలిచి ప‌రిస్థితిని వివ‌రిస్తున్నారు. 1986లో విడుద‌లైన ‘సిరివెన్నెల‌’ చిత్రంతో గేయ ర‌చ‌యిత సినీ ప్ర‌స్థానాన్ని సీతారామ‌శాస్త్రి ప్రారంభించారు. తొలి సినిమాతోనే ఆయ‌న‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆయ‌న పాటల ర‌చ‌యితగా వెనుదిరిగి చూసుకోలేదు. మూడున్న‌ర దశాబ్దాలుగా ఆయ‌న ఎన్నో వేల పాట‌ల‌ను రాశారు. పాట ఎలాంటిదైనా అందులో తెలియ‌ని ఓ స్ఫూర్తిని నింపి రాయ‌డం ఆయ‌న పెన్నుకున్న గొప్ప అల‌వాటు. అందుకనే తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ఆయ‌నెంతో ప్రీతిపాత్రుడ‌య్యారు. సిరివెన్నెల అద్భుత‌మైన క‌లం నుంచి జాలువారిన పాట‌ల‌కు నందులెన్నో ఆయ‌నింటికి క‌ద‌లి వ‌చ్చాయి. ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.

ఆలీపై బ్రహ్మానందం కామెంట్స్.. నా వల్లే హీరో అయ్యావంటూ సీక్రెట్ రివీల్ చేసిన కమెడియన్

Image
తెలుగు తెరపై ఎంతమంది కమెడియన్స్ వచ్చినా బ్రహ్మానందం, కామెడీకి డిమాండే వేరు అని చెప్పుకోవడంతో అతిశయోక్తి లేదు. వందలాది సినిమాల్లో ఈ కమెడియన్స్ వేసిన వేషాలు జనాన్ని ఓ రేంజ్‌లో నవ్వించాయి. అలాంటి ఈ ఇద్దరూ తాజాగా బుల్లితెరపై హంగామా చేశారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్న ‘’ కార్యక్రమానికి విచ్చేసిన తన సినీ జర్నీ తాలూకు ఎన్నో విశేషాలను పంచుకుంటూనే ఆలీ కెరీర్‌పై కామెంట్స్ చేశారు. మనం ఎక్కడ కలిశామో గుర్తుందా? అని ఆలీ వేసిన ప్రశ్నతో ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు బ్రహ్మానందం. చెన్నైలోని ఒక కాలేజ్‌ గ్రౌండ్‌లో ‘చంటబ్బాయి’ సినిమా షూటింగ్‌ సమయంలో మనం కలిశామని, అల్లు రామలింగయ్య గారితో కలిసి చేసే సీన్‌లో ఆయనే నిన్ను పరిచయం చేశారని చెప్పారు. ఇక అప్పట్లో జరిగిన 'మాయలోడు' సినిమా ఫంక్షన్‌లో నువ్వు చేసిన డాన్స్ చూసి ‘యమలీల’లో హీరోగా తీసుకుందామని కృష్ణారెడ్డి, దివాకర్‌ బాబు, అచ్చిరెడ్డి అనుకున్నారని చెప్పారు బ్రహ్మి. అయితే ఓసారి ఇదే విషయం తమ మధ్య చర్చకు రాగా.. ఆలీ మంచి డ్యాన్సర్‌ అని, అతనిలో హీరో మెటీరియల్‌ ఉందని వాళ్ళతో చెప్పానని బ్రహ్మానందం తెలిపారు. మా కమెడియన్స్‌ను హీరోగా చూపిస్తే, కచ్చితంగా

Sreemukhi : శ్రీముఖికి పెళ్లి అయిపోయిందా? షాకవుతున్న ఫ్యాన్స్..!

Image
క్యూట్‌, చ‌బ్బీ యాంక‌ర్‌గా పేరున్న శ్రీముఖికి పెళ్లి అయిపోందా? అదేంటి? అదెప్పుడు? అనే ప్ర‌శ్న‌లు ఫ్యాన్స్ మ‌న‌సుల్లో రాకుండా మాన‌దు. ఈ చ‌బ్బీ బ్యూటీ ఇప్పుడు బుల్లితెర‌, వెండితెర‌తో పాటు డిజిట‌ల్ మాధ్య‌మంలోకి రీసెంట్‌గా అడుగు పెట్టి హ‌ల్ చల్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏ మాత్రం ఖాలీ దొరికినా త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంటుందీ సొగ‌స‌రి. కొన్నాళ్లు ముందు త‌న స్నేహితుడు ముక్కు అవినాష్ పెళ్లిలోనూ, దావ‌త్‌లోనూ క‌లిసి హంగామా చేసిన మ‌న రాములమ్మ ఇప్పుడు నాగ‌బాబుతో చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తింది. అంతంటితో ఈ ముద్దుగుమ్మ ఆగ‌లేదండోయ్‌. సోష‌ల్ మీడియాలో గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసింది. అదేదో సైలెంట్‌గా పార్టిసిపేట్ చేయ‌లేదండోయ్ తెగ రచ్చ చేసింది. నాకు ఏ బాజ్ స‌రిపోతుందో చెప్ప‌మ‌ని ఓ గేమ్‌లో సింగ‌ర్ అనే స‌మాధానం రావ‌డంతో వెంట‌నే మైక్ ప‌ట్టేసుకుని నే తొలిసారిగా అనే పాట‌ను త‌న‌దైన స్టైల్లో పాడేసింది. మ‌రో గేమ్‌లో డిఫ‌రెంట్‌గా రాసిన దాన్ని స‌రైన తీరులో ప‌ల‌కింది. దానికి మీరు చెప్పిన దానికి మేం స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నామ‌ని కంప్యూట‌ర్

Pawan Kalyan : భీమ్లా నాయ‌క్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు.. ర‌చ్చ చేస్తున్న ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌

Image
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘’. సితార ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాట‌లు అందించ‌డంతో లాలా భీమ్లా.. అనే సాంగ్‌ను కూడా రాసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ‘భీమ్లా నాయ‌క్‌’ నుంచి మూడు పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు నాలుగో పాట‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ‘అడవి త‌ల్లి మాట‌...’ అంటూ సాగే నాలుగో లిరికల్ సాంగ్‌ను బుధ‌వారం అంటే డిసెంబ‌ర్ 1 ఉద‌యం 10 గంట‌ల 08 నిమిషాల‌కు విడుద‌ల‌వుతుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీక్ష‌ణంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు. అత‌నిలో అడవి క‌నిపిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా మేక‌ర్స్ మ‌రోసారి సినిమాను జ‌న‌వ‌రి 12నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఇందులో భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్, డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి

Samantha Ruth Prabhu : సమంత సంచలన నిర్ణయానికి ఆ హీరోనే కారణమా?

Image
స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం అంటే ఆమె నాగ‌చైత‌న్య‌తో ఎందుకు విడిపోయింద‌నే అంద‌రూ ఆలోచిస్తారు. అందులో సందేహం లేదు. నాగ‌చైత‌న్య‌తో స‌మంత విడిపోవ‌డం వెనుక గ‌ల కార‌ణాలేంట‌నేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. వాళ్లు చెప్ప‌డం లేదు. మ‌రి స‌మంత విడిపోవాల‌నుకున్న‌ది సంచ‌ల‌న నిర్ణ‌య‌మే. అయితే ఇక్క‌డ మ‌నం ప్ర‌స్తావించే సంచ‌ల‌న నిర్ణ‌యానికి, ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలోని సంచ‌ల‌న నిర్ణ‌యానికి సంబంధం లేదు. మ‌నం ఇక్క‌డ ఆమె ప్రొఫెష‌న‌ల్‌గా తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించే ప్ర‌స్తావించ‌బోతున్నాం. స‌మంత సినిమాల ఎంపిక త‌న వైవిధ్యాన్ని చూపిస్తూ చాలా వేగంగా దూసుకెళ్తుంది. ఎవ‌రూ ఊహించని విధంగా సినిమాల‌ను అనౌన్స్ చేస్తూ అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. రీసెంట్‌గా ఆమె ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ అనే అంత‌ర్జాతీయ సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. చిత్ర యూనిట్ కానీ, స‌మంత చెప్ప‌లేదు కానీ.. ఇందులో ఆమె ఎవ‌రూ ఊహించ‌ని రోల్‌ను చేస్తుంది. అదే బై సెక్సువ‌ల్ రోల్‌. ఓ స్టార్ హీరోయిన్ అలాంటి పాత్ర‌లో న‌టించ‌డ‌మంటే ఆమెను అప్రిషియేట్ చేయ‌కుండా ఉండ‌లేరు. ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ చిత్రాన్ని జాన్ పిలిప్ డైరెక్ట్ చేస్తున్నారు. గురు ఫిలింస్ పతా

Nagababu : పాట పాడిన శ్రీముఖి.. స్పృహ కోల్పోయిన నాగ‌బాబు.. వీడియో వైర‌ల్‌!

Image
అజానుబాహుడు, భారీ వ్య‌క్తి అయిన నాగ‌బాబుని కింద ప‌డేయ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. కానీ ఆ విష‌యాన్ని చాలా తేలిక‌గా ఎలాంటి క‌ష్టం ప‌డ‌కుండా సెక‌న్ల వ్య‌వ‌ధిలో పూర్తి చేసేసింది న‌టి, యాంక‌ర్ శ్రీముఖి. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకెళ్తే.. బుల్లితెర స్టార్ శ్రీముఖి, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. నాగ‌బాబు మిన్న‌కుండ‌కుండా.. శ్రీముఖిని ఓ పాట పాడ‌మ‌ని రిక్వెస్ట్ చేశాడు. నాగ‌బాబు త‌న‌కు అలాంటి ఆఫ‌ర్ ఎప్ప‌టి నుంచి ఇస్తాడా? అని ఎదురు చూస్తున్న ఒక్క‌సారిగా రెచ్చిపోయింది. ఇంకేముంది.. నాగ‌బాబు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడు. త‌ట్టి లేపిన లేవ‌లేదు. నిజ‌మేనండి బాబు.. ఈ వీడియో చూస్తే మీరు ఔన‌న‌కుండా ఉండ‌లేరు. ఇక నెటిజన్స్ కూడా అదే రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. ఓ మనిషిని ఇలా కూడా వేసేయొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత‌కీ ఈ వీడియోను పోస్ట్ చేసిందెవ‌ర‌నుకుంటున్నారు? శ్రీముఖి. ఆమె త‌న ఇన్‌స్టాలో నాగ‌బాబుతో క‌లిసి చిన్న వీడియో చేసింది. నాగబాబు: శ్రీముఖి నిన్ను ఎప్ప‌ట్నుంచో ఒక‌టి అడ‌గాల‌ని అనుకుంటున్నా శ్రీముఖి : అడ‌గండి బాబుగారు నాగ‌బాబు: నీ నోటి నుంచి చ‌క్క‌టి పాట వినాల‌నుంది శ్రీముఖి

రాజ్ తరుణ్‌తో రెండు సార్లు ఆ అనుభవం.. యాక్సిడెంట్‌ అవ్వాలని కోరుకున్నా.. అరియానా శాడిజం!

Image
బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే కంటే ముందు యాంకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలా యాంకరింగ్ చేసుకుంటూ ఆర్జీవీ కంట్లో పడటం, ఆయన అరియానా తొడల మీద కామెంట్లు చేయడంతో దశ తిరిగింది. అలా ఆర్జీవీ కామెంట్లతో వైరల్ అయిన అరియానా బిగ్ బాస్ షో చాన్స్ వచ్చింది. అలా మొత్తానికి బోల్డ్ బ్యూటీగా అరియానా బిగ్ బాస్ షోలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అతికి అంబాసిడర్‌లా అనిపించినా కూడా టాప్ 5 వరకు అరియానా చేరుకుంది. ఇప్పుడు సినిమాల్లోనూ అరియానా రచ్చ చేస్తోంది. అనుభవించు రాజా సినిమాలో ఓ పాత్రలో అరియానా కనిపించింది. తాజాగా అరియానా ఈ మూవీ షూటింగ్ విశేషాలు, రాజ్ తరుణ్‌తో తనకున్న అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఒకప్పుడు రాజ్‌ తరుణ్‌ అంటే తనకు అస్సలు నచ్చదని అరియానా తెలిపింది. కానీ తనతో సినిమాకు ఎలా చేశానో అర్థం కావట్లేదని అంది. టీవీలో ఆయన సినిమాలు వస్తే అవి తీసేయ్‌మని చెప్పేదాన్ని. ఒకరోజు రాజ్‌ కారులో వెళుతుంటే తనకి యాక్సిడెంట్‌ అవ్వాలని కోరుకున్నానంటూ అరియానా తన శాడిజాన్ని బయటపెట్టేసింది. ఓ సారి ఇంటర్వ్యూకి పిలిచి వెయింట్ చేయించారంటూ.. చివరకు రాకుండా డబ్బింగ్ పని ఉందని వెళ్లిపోయాడట. అంతకు ముందు కూడా ఇల

Shiva Shankar Master : శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన యాంకర్‌ ఓంకార్‌

Image
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కరోనాతో గత కొన్ని రోజులుగా పోరాడుతూ వచ్చిన మాస్టర్.. ఆదివారం కన్నుమూశారు. కరోనా నెగెటివ్ వచ్చినా కూడా ఇతర సమస్యలు, ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకడంతో మృతి చెందారు. శివ శంకర్ మాస్టర్ మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. మాస్టర్ మరణంపై టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులే కాకుండా దక్షిణాది సినీ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని ప్రకటించారు. సోమవారం సాయంత్రానికి శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్‌ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు పంచవటి కాలనీలోని నివాసానికి పలువురు నటీనటులు, కళాకారులు హాజరై శివశంకర్ మాస్టర్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. యాంకర్, నిర్మాత, దర్శకుడు తోపాటు ఆయన సోదరుడు అశ్విన్ బాబు, శివశంకర్ మాస్టర్ పాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓంకార్ షోలతో శివ శంకర్ మాస్టర్ క్రియేట్ చేసిన మార్క్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఓంకార్ షోలు అందులో శివ శంకర్ మాస్టర్

Sirivennela Sitaramasastri : ఆస్పత్రిలో సిరివెన్నెల.. హెల్త్ బులిటెన్ విడుదల

Image
ప్రస్తుతం టాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లెజెండరీ సెలెబ్రిటీలు అనారోగ్యాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. మొన్నటి వరకు కైకాల సత్యనారాణ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నారు. గత ఐదు రోజుల క్రితమే సిరివెన్నెలను ఆస్పత్రిలో చేర్పించారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్డేట్‌ను ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న ఆస్పత్రిలో చేరారు. నిపుణులైన వైద్యులతో సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైద్యం అందిస్తున్నాం. ప్రస్తుతం సిరివెన్నెల ఐసీయూలో ఉన్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని కిమ్స్ వైద్యులు తెలిపారు. గత రెండ్రోజుల క్రితం సిరివెన్నెల ఆరోగ్యం గురించి రకరకాల వార్తలను రావడంలో కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. సీతారామాశాస్త్రి కేవలం న్యుమోనియాతోనే బాధపడుతున్నారని.. కిమ్స్ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేసామని, కంగారు పడాల్సినదేమీ లేదని కుటుంబ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆస్పత్రిలో సిరివెన్నెల.. హెల్త్ బులిటెన్ విడుదల

Image
ప్రస్తుతం టాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లెజెండరీ సెలెబ్రిటీలు అనారోగ్యాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. మొన్నటి వరకు కైకాల సత్యనారాణ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నారు. గత ఐదు రోజుల క్రితమే సిరివెన్నెలను ఆస్పత్రిలో చేర్పించారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్డేట్‌ను ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న ఆస్పత్రిలో చేరారు. నిపుణులైన వైద్యులతో సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైద్యం అందిస్తున్నాం. ప్రస్తుతం సిరివెన్నెల ఐసీయూలో ఉన్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని కిమ్స్ వైద్యులు తెలిపారు. గత రెండ్రోజుల క్రితం గురించి రకరకాల వార్తలను రావడంలో కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. సీతారామాశాస్త్రి కేవలం న్యుమోనియాతోనే బాధపడుతున్నారని.. కిమ్స్ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేసామని, కంగారు పడాల్సినదేమీ లేదని కుటుంబ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

టికెట్ రేట్లపై ఇక నేను మాట్లాడను!.. నాని సంచలన కామెంట్స్

Image
నిత్యా మీనన్ నటించి నిర్మిస్తున్న మీద అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి. సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చాడు. కాంట్రవర్సీ చేయనంటూనే కాంట్రవర్సీలకు తెరలేపాడు. ఇది వరకు ఓ సారి సత్యదేవ్ సినిమా తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. థియేటర్ల సమస్య, టికెట్ల రేట్ల వివాదాలపై మొదటిసారిగా నాని స్పందించాడు. అయితే ఆ సమయంలో నాని ఒక్కడే ముందుకు వచ్చి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంత మాట్లాడిన నాని చివరకు తన టక్ జగదీష్ సినిమాను ఓటీటీకే అమ్ముకున్నాడు. ఆ విషయంలోనూ నాని మీద ట్రోలింగ్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు నానిని ఓ రేంజ్‌లో తిట్టేశారు. అయితే ఇప్పుడు మళ్లీ నాని.. అలాంటి కామెంట్లే చేశాడు. సత్యదేవ్ హీరోగా రాబోతోన్న స్కైలాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఫంక్షన్‌లో టికెట్ల రేట్లు, థియేుటర్ల సమస్య గురించి నేనేమీ మాట్లాడను భయపడకు సత్యదేవ్.. ఇక పెద్దవాళ్లు మాట్లాడాలి అని ఓ మాట వదిలేశాడు. దీంతో నాని ఈ విషయాన్ని ప్రస్థావించినట్టు అయింది. పెద్ద వాళ్లు ఇంకా నోరు విప్పడం ల

అందుకే బాలీవుడ్ నుంచి పారిపోయి వచ్చా.. అసలు విషయం చెప్పిన తమన్

Image
ప్రస్తుతం సౌత్‌లో హవా బాగానే కొనసాగుతోంది. తమన్ ఇటు తెలుగు అటు తమిళ పరిశ్రమంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక తెలుగులో అయితే టాప్ హీరోల ప్రాజెక్ట్‌లన్నీ కూడా తమన్ ఖాతాలోనే ఉన్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా స్టార్లందరికీ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పది సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంటే.. అందులో ఆరేడు చిత్రాలు తమన్ కొట్టినవే ఉంటున్నాయి. అలాంటి తమన్ ఈ మధ్య నాని టక్ జగదీష్ విషయంలో కాస్త బాధపడ్డాడట. తాను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నానికి నచ్చలేదట. అందుకే గోపీ సుందర్‌తో చేయించుకున్నారట. అయితే తమన్ బాలీవుడ్‌లోని కొన్ని పాటలు కొట్టాడు. కానీ బాలీవుడ్ పని తీరు.. మన సౌత్ పనితీరు చాలా వేరు. మన స్టైల్లో పని చేస్తే అక్కడి వాళ్లకు నచ్చదు. ఇక్కడ ఒక్క సినిమాకు ఒకే సంగీత దర్శకుడు ఉంటాడు. కానీ అక్కడి చిత్రానికి ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులుంటారు పాటలు చాలా మంది కంపోజ్ చేస్తారు.. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొకరు ఇస్తారు.. అలాంటివి చూడలేక.. తట్టుకోలేక పారిపోయి వచ్చాను. సినిమా అంత మన చేతుల్లో పెడితే చేయగలం. కానీ అలా పని చేయడం నా వల్ల కాదు. అందుకే బాలీవుడ్‌లో ఎక్కువ

Shiva Shankar Master Death : గుండె బద్దలైంది.. దారుణమైన వార్త.. ఉదయ భాను ఎమోషనల్

Image
తెలుగు సినీ రంగంలో నృత్య దర్శకుడిగా చెరగని ముద్ర వేశారు. అలాంటి లెజెండరీ కొరియోగ్రఫర్ ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనా బాధపడుతున్న ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో మంది సాయం చేశారు. సోనూ సూద్, చిరంజీవి, ధనుష్ ఇలా ఎంతో మంది సాయం చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. శివ శంకర్ మాస్టర్ కన్నుమూశారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్క సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. రాజమౌళి అయితే మగధీర నాటి రోజులను గుర్తుకు చేసుకున్నాడు. ధీర ధీర సాంగ్‌కు శివ శంకర్ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నుంచి ప్రతీ ఒక్క హీరో శివ శంకర్ మాస్టర్ మృతికి సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తాజాగా ఆయన మరణ వార్తపై స్పందించింది. ఢీ షోలకు వ్యాఖ్యాతగా ఉదయ భాను వ్యవహరించిన రోజుల్లో శివ శంకర్ మాస్టర్‌ న్యాయ నిర్ణేతగా ఉండేవారు. అలా అక్కడ ఏర్పడిన బంధాన్ని ఉదయభాను పంచుకుంది. బుల్లితెరపై కామెడీ, పలు ఇత

RRR ట్రైల‌ర్ డేట్ ఫిక్స్.. ఆనందంలో మెగా, నందమూరి ఫ్యాన్స్‌..!

Image
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ RRR. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ సినిమా విడుల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అధికారికంగా చెప్ప‌లేదు కానీ.. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింద‌ట‌. సినిమా వ్య‌వ‌ధి 3 గంట‌ల 6 నిమిషాల‌ని కూడా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. టాలీవుడ్‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్‌కి చెందిన ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రో వైపు హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ వంటి స్టార్స్ కూడా నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో అప్‌డేట్‌ను తెలియ‌జేశారు జ‌క్క‌న్న‌. RRR ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. దీంతో ఇటు మెగాభిమానులు, అటు నంద‌మూరి అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

దారుణమైన వీడియో.. అందాలన్నీ బట్టబయలు.. వెంటనే డిలీట్ చేసిన పాయల్

Image
ఆర్ఎక్స్ 100 బ్యూటీ రాజ్ పుత్ కాస్త ఆవేశపడింది. అందాలను ప్రదర్శించాలనే ఉద్దేశ్యంతో కాస్త హద్దులు దాటింది. ఆ దాటడంలో తొందరపడింది. టాప్ లెస్ అంటూ ఓ బ్లేజర్ మాత్రమే ధరించింది. లోపల ఏమీ ధరించలేదు. దీంతో వెరైటీగా ఫోటో షూట్ చేద్దామని తెగ ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు. పాయల్ అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. పాయల్ ఎద అందాలు బయటపడ్డాయి. దీంతో తప్పు తెలుసుకుని వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. కానీ ఏం లాభం. అసలే ఇది సోషల్ మీడియా కాలం క్షణంలో ఏదైనా వైరల్ అవుతుంది. అలా పాయల్ తన వీడియోను డిలీట్ చేసే లోపు నెట్టింట్లో అందరికీ చేరింది. నిజం అడుగు బయటపెట్టే లోపు అబద్దం ప్రపంచం చుట్టి తిరిగి వస్తుందనే సామెత లెక్క.. ఇలాంటి వీడియోలు క్షణాల్లో ప్రపంచమంతా పాకిపోతుంది. ఇక ఇప్పుడు పాయల్ అందాలన్నీ ఫ్రీగా చూసేస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పాయల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు, వీడియోలే కనిపిస్తున్నాయి. అలా పాయల్ హద్దులు దాటి చేసిన అందాల విందుతో ఇప్పుడు తలనొప్పులు వచ్చేశాయి. అందుకే ఏది పోస్ట్ చేస్తున్నాం.. అందులో అసభ్యకరంగా ఏమున్నాయ్ అని ముందే చూసుకోవాలి. ఇలా చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం ఏ

Radhe Shyam second Song promo : రాధే శ్యామ్ సెకండ్ సాంగ్ ప్రోమో వ‌చ్చేసింది.. పూజా హెగ్డేతో బీచ్‌లో ప్ర‌భాస్ రొమాన్స్‌

Image
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం రాధే శ్యామ్‌. హీరోయిన్‌. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రీసెంట్‌గా ‘ఈ రాత‌లే..’ అంటూ లిరికల్ సాంగ్ విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను రాబ‌ట్టుకున్న‌సంగ‌తి తెలిసిందే. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఓ సినిమాకు సంబంధించి ఒకే పాట‌ను రెండు ర‌కాలుగా వినొచ్చ‌ని రాధే శ్యామ్‌ను రూపొందించిన నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ తెలియ‌జేసింది. రాధే శ్యామ్‌లోని రెండో సాంగ్ ప్రోమోను హిందీలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం అన్న‌మాట ప్ర‌కారం ఆన్ టైమ్‌లో విడుద‌ల చేశారు. ఇక తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు సంబంధించిన సాంగ్ ప్రోమోను ఈరోజు రాత్రి విడుద‌ల చేయ‌బోతున్నారు. ‘ఆషికీ ఆగ‌యా ...’ అంటూ సాగే హిందీ సాంగ్ ప్రోమో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌నే కాదు.. సినీ అభిమానులను కూడా అల‌రిస్తుంది. బీచ్‌లో లైట్ బ్లూ అండ్ వైట్ క‌ల‌ర్ కాంబినేష‌న్ ఉన్న డ్రెస్‌లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డే మ‌ధ్య రొమాంటిక్‌గా పాట సాగుతుంది. విజువ‌ల్స్ క‌ల‌ర్‌ఫుల్‌గా, బ్యూటీపుల్‌గా ఉన్నాయి. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేమికుల‌ను మెస్మరైజ్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదని

Pushpa : అల్లు అర్జున్ Pushpa The Riseలో స్పెషల్ సాంగ్ షురూ చేసిన సమంత..!

Image
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. ఓ సాంగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఆ సాంగ్ కూడా స్పెష‌ల్ సాంగ్‌. ఇలాంటి సాంగ్స్ తెర‌కెక్కించ‌డంలో సుక‌మార్‌కంటూ ఓ స్టైల్ ఉంది. ఆయ‌న సినిమాలు చూస్తే ఆ విష‌యం అంద‌రికీ అవ‌గ‌త‌మ‌వుతుంది. అదే పంథాను ‘ ది రైజ్‌’ కోసం ఆయ‌న ఫాలో అవ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. స్పెష‌ల్ పాట‌పై చాలా ఫోక‌స్ పెట్టారు. బ‌న్నీతో ఓ సాంగ్‌లో ఎవ‌రినీ తీసుకుంటే ఆడియెన్స్‌లో క్రేజ్ పీక్స్‌లో ఉంటుందా? అని సుక్కు తెగ ఆలోచించాడు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న ఊహించ‌ని స్టార్‌ హీరోయిన్ స‌ద‌రు సాంగ్‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పింది. ఇంత‌కీ ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో కాదు.. స‌మంత‌. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించేసింది కూడా. స‌మంత ఎందుకంత స్పెష‌ల్ అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఇలాంటి సాంగ్‌లో ఏ హీరోతోనూ డాన్స్ చేయ‌లేదు. తొలిసారి బ‌న్నీతోనే న‌టిస్తుంది. స‌మంత ప‌ర్టికుల‌ర్‌గా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డం అల్లు అర్జున్‌, సుకుమార్‌ల‌నే కాదు. ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గానే మారింది. ఏదేతైనేం ఎట్ట‌కేల‌కు సోమ‌వారం హైద‌రాబాద్ ర

పుష్ప ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ఫైనల్ కట్ రెడీ చేసిన సుకుమార్.. తగ్గేదే లే!!

Image
మోస్ట్ ఎవైటెడ్ మూవీ '' విషయంలో తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది చిత్రయూనిట్. ఇప్పటికే పలు అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ పెంచేసిన డైరెక్టర్ .. చిత్ర ట్రైలర్ కూడా రెడీ చేశారు. ఈ మూవీ డిసెంబర్ 17న రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు సుకుమార్. గత పోస్టర్స్ లాగే మాస్ లుక్ ప్రెజెంట్ చేస్తూ డిసెంబర్ 6వ తేదీన ట్రైలర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దృష్టి డిసెంబర్ 6పై పడింది. ఇప్పటికే విడుదలైన అన్ని వీడియోస్, ఫొటోస్ ఓ రేంజ్‌లో ఉన్నాయి కాబట్టి 'పుష్ప' ట్రైలర్ అంతకుమించి అనేలా అంటుందని భావిస్తున్నారు ఆడియన్స్. మరోవైపు సుకుమార్ కూడా ట్రైలర్ కట్ చేయడంపై స్పెషల్ కేర్ తీసుకున్నారని సమాచారం. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఓ రకమైన వైబ్రేషన్స్ క్రియేట్ చేసి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టేలా ఉంటుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ కా

Bimbisara Teaser: రాచరికం నుంచి మోడ్రన్ యుగం.. బింబిసారుడిగా నందమూరి వారసుడి నెత్తుటి సంతకం

Image
హీరోగా, నిర్మాతగా తనదైన దారిలో వెళుతున్న '' రూపంలో మరో ప్రయోగాత్మక సినిమాను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తుండగా.. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతూనే ఈ మూవీ ప్రమోషన్స్‌ చేపడుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. ''ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బిబిసారుడి ఏకచక్రాధిపత్యం'' అనే పవర్ ఫుల్ డైలాగ్ బ్యాక్ గ్రౌండ్‌లో వస్తుండగా రణరంగంలో శివమెత్తాడు కళ్యాణ్ రామ్. అదిరిపోయే విజువల్స్, అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ టీజర్‌లో హైలైట్ అయ్యాయి. టీజర్ చివరలో కళ్యాణ్ రామ్‌ను రాచరికం నుంచి నేటి మోడ్రన్ యుగంలోకి తీసుకొచ్చారు. విడుదలైన కాసేపట్లోనే ఈ టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన బింబిసార పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై హై

శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి.. ఎమోషనల్ కామెంట్స్

Image
ఫేమస్ సినీ కొరియోగ్రాఫర్ కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి 8 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ , నందమూరి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించిన శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి తుది శ్వాస విడిచారనే వార్త మనసును కలచివేసింది. ఆయనతో నా అనుబంధం సుదీర్ఘమైనది. ఖైదీ చిత్రానికి సలీం మాస్టర్ నృత్య దర్శకత్వం చేసినా ఆయన అసిస్టెంట్‌గా వెనకుండి డాన్సులు కంపోజ్ చేసింది శివ శంకర్ మాస్టర్. ఆ రోజు మొదలుకొని మగధీర వరకు అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు మరపురాని డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. ఆయన్ను చివరిసారిగా 'ఆచార్య' సెట్స్ మీద కలిశాను. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఆయన మరణం కేవలం ఒక నృత్య రంగానికే కాదు యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు'&#

శివ శంకర్‌ మాస్టర్‌ జాతకం అలాంటిది! ఇంట్లో అందరూ ఒకటే తిట్లు.. ఆయన జర్నీలో ఆసక్తికర విషయాలు

Image
ప్రముఖ కొరియోగ్రఫర్, డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ (72) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన.. ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివ శంకర్ మాస్టర్ ఇకలేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు అని పేర్కొంటున్నారు. మరి శివ శంకర్‌.. డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎలా మారారు? ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఆయన పట్టుదల ఏంటి? లాంటి విషయాలను పరిశీలిస్తే ఆయన జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకమని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై మమకారం పెంచుకున్న ఆయన ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరేమనుకున్నా తన టార్గెట్ రీచ్ అయ్యారు. అప్పట్లో ‘సభ’ అనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివ శంకర్‌ తండ్రి ఓ సభ్యుడు కావడంతో నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్‌ చేసి తీరాలనే పట్టుదల పెరిగింది. దాంతో ఆయనంతట ఆయనే డాన్స్ నేర

Shiva Shankar Master Death : శివ శంకర్ మాస్టర్ కన్నుమూత

Image
ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చివరకు కరోనాతో పోరాడి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. రియల్ హీరో సోనూ సూద్ సైతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితిపై ఆరా తీశారు. మంచు విష్ణు మా అధ్యక్షుడి హోదాలో హాస్పిటల్ బృందంతో మాట్లాడాడు. ఇక వీరందరికంటే ముందుగానే హీరో ధనుష్ ఎవ్వరికీ తెలియకుండా పది లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేశారట. కానీ ఇవేవీ కూడా శివ శంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోాయాయి. శివ శంకర్ మాస్టర్ మరణ విషయం తెలియడంతో గుండె బద్దలైందని రియల్ హీరో సోనూ సూద్ ఎమోషనల్ అయ్యాడు. కాపాడేందుకు శాయ శక్తులా ప్రయత్నించామని కానీ అవేవీ ఫలించలేదని కన్నీరుమున్నీరయ్యాడు. సినిమా పరిశ్రమ మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతుందని సోనూ సూద్ ట్వీట్ వేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూ

మళ్ళీ ఇన్నేళ్లకు అదే భయం.. నాగ చైతన్యతో ఫస్ట్ మూవీ సమయంలో! షాకింగ్ విషయం బయటపెట్టిన సమంత

Image
ఈ రోజుల్లో సినిమా ఛాన్స్ రావడమే గొప్ప. అలాంటి ఛాన్స్ ఒడిసిపట్టుకుని స్టార్ స్టేటస్ పట్టేయడమంటే మామూలు విషయం కాదు. ఈ ఫీట్ అలవోకగా అధిగమించిన .. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ నాగ చైతన్యతో ఫస్ట్ మూవీ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. అంతేకాదు ఆనాటి భయాన్ని గుర్తుచేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏ మాయ చేశావే అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత.. అదే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడింది. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్న ఈ జోడీ ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువకాలం నిలువలేదు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల నడుమ మరోసారి తన తొలి సినిమా 'ఏ మాయ చేశావే'ను గుర్తు చేసుకుంది సమంత. తెలుగు, తమిళ భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్న సమంత.. తొలిసారి ఓ హాలీవుడ్ మూవీలో నటించబోతోంది. '' పేరుతో అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ పిలిప్ జాన్ ఈ

బండ్ల గణేష్‌ మంచి మనసు.. నిన్ను నిందించే స్థాయి ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికీ లేదు!!

Image
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌ది ప్రత్యేకమైన స్థానం. కమెడియన్‌‌గా కెరీర్ ఆరంభించి నిర్మాతగా సెట్టయి ఇప్పుడు హీరోగా అవతారమెత్తిన బండ్ల గణేష్ ఏది చేసిన అది సెట్టర్ కావడం ఖాయం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాలు, రాజకీయాలే కాదు సామజిక దృక్పథం దానికి తోడు దైవ భక్తి మెండుగా ఉన్న ఈ కమెడియన్ తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఆయన మంచి మనసు. ఇంతకీ విషయం ఏంటంటారా..? తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు బండ్లన్న. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ నేపాలీ పాపను పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటి కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారని చెప్పిన బండ్ల గణేష్.. తాను మాత్రం ఈ పాపను పెంచుకొని గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపారు. తన భార్య చెప్పిందని ఈ నేపాలీ పాపను దత్తత తీసుకున్నానని చెప్పిన బండ్లన్న.. ఇప్పుడీపాప తమ ఇంట్లో మెంబర్‌ అయిపోయిందని, తమ ఇంట్లో వాళ్లందరినీ బెదిరించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో బండ్లన్నపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ద

Ravi Teja : రవితేజ, కృష్ణవంశీలను నేను మోసం చేయలేదు : బండ్ల గణేష్

Image
న‌టుడు నుంచి నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేశ్‌కు మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. త‌న ఇష్టాన్ని ఆయ‌న బాహాటంగానే చెబుతుంటారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు దేవ‌ర అని ప‌లు సంద‌ర్భాల్లో బండ్ల గ‌ణేశ్ చెప్పారు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చాలా విష‌యాల‌ను మాట్లాడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీకు సినిమా ఇవ్వ‌లేదా? అని ప్ర‌శ్నిస్తే నేనే ఆయ‌న్ని అడ‌గ‌లేదు. ఆయ‌న న‌న్ను సినిమా చేయ‌మంటే త‌ప్ప‌కుండా చేస్తాను. ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ చేయాల‌నుకోవ‌డం లేదు. న‌టుడిగా మ‌రో జ‌ర్నీని స్టార్ట్ చేశాన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంలో త‌ను హీరోగా చేసిన డేగ‌ట బాబ్జీ సినిమా గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. సినిమా చూసిన అంద‌రూ ఎమోష‌న‌ల్ అయ్యేలా సినిమా ఉంటుంద‌ని అన్నారు బండ్ల గ‌ణేశ్‌. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ ‘‘నేను మనసులో ఉన్నది ఉన్న‌ట్లుగా మాట్లాడుతాను. సినిమా అనేది నా జీవితంలోఓ భాగం మాత్ర‌మే. అదే జీవితం అయితే కాదు. సినిమాలు ఉంటే చేస్తాను. లేక‌పోతే నా వ్యాపారాలు నేను చేసుకుంటాను. నాకు సినీ రంగంలోనే కాదు. రాజ‌కీయ రంగంలోనూ స్నేహితులున్నారు’’ అని తెలిపారు. మీరు హీరో ర‌వితేజ‌, కృష్ణ‌వంశీల‌ను మోసం చేశార‌ని, త‌ప్పుడు డాక్యుమెంట్స్‌తో

నీకు మాటిస్తున్నా.. నువ్వు ఒంటరివి కావు!! అతనితో దిగిన ఫొటో షేర్ చేస్తూ జెనీలియా ఎమోషనల్‌ పోస్ట్‌

Image
తెలుగుతో పాటు ఇతర దక్షిణ ఇండస్ట్రీలో నటించి ఎంతో మందిని అలరించింది జెనిలియా. ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా ఆమె నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు. పక్కింటి అమ్మాయిలా ఆమె చూపిన ఎక్స్‌ప్రెషన్స్ ఇండస్ట్రీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయని చెపుకోవచ్చు. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ.. అప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. సిల్వర్ స్క్రీన్‌పై అలరించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులను పలకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 2012 ఫిబ్రవరిలో రితేష్‌ని పెళ్లాడిన ఈ బ్యూటీకి ఇద్దరు సంతానం. ఆ ఇద్దరు బిడ్డల ఫొటోలు, వీడియోలను నెటిజన్లతో పంచుకునే ఆమె తాజాగా తన పెద్ద కుమారుడు రియాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'నీకు మాటిస్తున్నా' అంటూ కుమారుడిపై ప్రేమ కురిపిస్తూ ఆమె పోస్ట్ చేసిన సందేశం వైరల్‌గా మారింది. ''మై డియరెస్ట్ బాయ్ రియాన్‌.. నీ పుట్టినరోజు సందర్భంగా ఓ మాటిస్తున్నా. నీ చిట్టి బుర్రలో ఉన్న ఎన్నో కోరికలు, ఆశలు నెరవ

SiddhasSaga : ‘ఆచార్య’కు ధీటుగా ‘సిద్ద’.. లాస్ట్ షాట్ మాత్రం కేక!

Image
కొరటాల శివ సినిమాగా మొదలైన చిత్రంలో వచ్చి చేశారు. అది చివరకు రామ్ చరణ్ చిరంజీవి మల్టీస్టారర్‌గా మారిపోయింది. ఇధి వరకు చిరంజీవి పాత్రకు సంబంధించిన టీజర్ వచ్చేసింది. ఇక తాజాగా రామ్ చరణ్‌ను సిద్ద పాత్రలో చూపిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. రామ్ చరణ్ మాస్ యాంగిల్, ధర్మస్థలి విజువల్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ ఒక్క అంశం అదిరిపోయింది. ఇక ఈ చిన్నపాటి టీజర్‌తోనే అంచనాలు ఆకాశన్నంటిపోయేలా ఉన్నాయి. సిద్ద పాత్ర ఎలా ఉంటుందో చిన్న టీజర్‌లోనే చూపించేశాడు కొరటాల శివ. టీజర్ అంతా ఒకెత్తు అయితే.. లాస్ట్ షాట్ మాత్రం నెవ్వర్ బిఫోరో అనేలా ఉంది. చిరుత పులి, పులి బిడ్డ రెండు అలా కొలను పక్కన దప్పిక తీర్చుకుంటాయి. మరో పక్కనే చిరంజీవి, రామ్ చరణ్‌లు కూడా కనిపిస్తారు. ఇక అంతకు మించిన వర్ణణ ఏదీ అవసరం లేదు. ఒక్క డైలాగ్ చెప్పకుండా.. ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించి కొరటాల తన టాలెంట్ ఏంటో చూపించాడు. మొత్తంగా సిద్దకు ఈ చిత్రం ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది అర్థమవుతోంది. సిద్ద పాత్రలో రొమాన్స్, రౌద్రం అన్నీ ఉన్నాయని చూపించాడు. ఇక సోనూ సూద్‌తో రామ్ చరణ్ చేసిన ఆ పోరాట దృశ్యం అదిరిపోయింది. పూజా హెగ్డేతో రామ్ చరణ్ క

తెలంగాణలో మగాళ్లు అలా చేసినా ఆడవాళ్లు మాత్రం!.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్

Image
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో అన్ని విషయాల మీద స్పందిస్తుంటుంది. ఈ మధ్యే నటిగా కూడా అవతారమెత్తింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో రాహుల్ రవీంద్రన్, చిన్మయి తమ నిజ జీవిత పాత్రలను పోషించారు. అలా మొత్తానికి చిన్మయి కూడా నటిగా మారింది. తాజాగా చిన్మయి తెలంగాణ సమాజం, తెలంగాణలోని మగాళ్ల తీరు గురించి వచ్చిన ఓ సర్వే గురించి స్పందించింది. భార్యను భర్తను తన్నడం అనేది గృహ హింస కిందకే వస్తుంది. అయితే కొందరు మాత్రం ఇది తమ మీద ప్రేమతోనే అలా చేస్తున్నారంటూ భార్యలు తమ భర్తలను వెనకేసుకుని వస్తుంటారు. తెలంగాణలో ఈ శాతం ఎక్కువగా ఉందట. తెలంగాణలో మహిళలను భర్తలు ఎక్కువగా కొట్టినా కూడా భార్యలు మాత్రం అది సమంజసమేనని అంటున్నారట. అలా భార్యలను కొట్టడం కరెక్టే అని కర్ణాటకలోని 81 శాతం మంది పురుషులు అంటే.. తెలంగాణలోని 83 శాతం మంది స్త్రీలు తమను భర్తలు కొట్టడం కరెక్టేనని అన్నారట. ఈ సర్వేలో భాగంగా ఏడు ప్రశ్నలు సంధించారట. భార్యలను భర్తలు కొట్టేందుకు ఏడు కారణాలున్నాయట. చెప్పకుండా బయటకు వెళ్లడం, భర్తతో వాదించినప్పుడు, శృంగారానికి ఒప్పుకోనప్పుడు, మంచిగా వండిపెట్టనప్పుడు, అబద్దాలు చెప్పినప్పుడు నమ్మకం కల

డైరెక్టర్ బాపుతో మరిచిపోలేని అనుభవం!.. నాటి సంగతులు పంచుకున్న సునీత

Image
ఇప్పుడు సెల్ఫీలు, ఫోటోగ్రాఫుల ట్రెండ్ వచ్చింది. కానీ ఒకప్పుడు మాత్రం తమ అభిమాన తారల ఆటోగ్రాఫుల కోసం ఫ్యాన్స్ చచ్చిపోయేవారు. జీవితంలో ఎలాగైనా సరే వాటిని సంపాదించాల్సిందేనని అనుకునేవారు. అలా ఇప్పుడు ఆటోగ్రాఫుల ట్రెండ్ పోయింది. సెల్ఫీల ట్రెండ్ వచ్చింది. తాజాగా సింగర్ తన జీవితంలో దర్శకుడు బాపుతో ఉన్న అనుబంధం, ఆయనతో ఉన్న మెమోరీస్‌ను గుర్తు చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు బాపు రమణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పడెప్పుడో వచ్చిన ముత్యాల ముగ్గు నుంచి బాలయ్య నటించిన శ్రీరామరాజ్యం వరకు తెలుగు ప్రేక్షకుల మీద చెరగని ముద్ర వేశారు. ఆయన సినిమాల్లో అచ్చమైన తెలుగు కనిపిస్తుంది. తెలుగు అందాలు కనిపిస్తాయి. బాపు గారి బొమ్మలా ఉన్నావ్ అంటూ అమ్మాయిలను పొగడటం వెనుకున్న నేపథ్యం కూడా అదే. బాపు గారు బొమ్మ గీశారంటే.. ప్రపంచంలోని అందమంతా అందులోకి వస్తుంది. అలాంటి గొప్ప దర్శకుడితో సునీత తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. బాపు తెరకెక్కించిన రాధా గోపాలం, శ్రీరామరాజ్యం సినిమాలకు సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీత పని చేశారు. అయితే సునీత ఓ సారి బాపు గారిని ఆటోగ్రాఫ్ అడిగిందట. కానీ బాపు గారు మాత్ర