SiddhasSaga : ‘ఆచార్య’కు ధీటుగా ‘సిద్ద’.. లాస్ట్ షాట్ మాత్రం కేక!

కొరటాల శివ సినిమాగా మొదలైన చిత్రంలో వచ్చి చేశారు. అది చివరకు రామ్ చరణ్ చిరంజీవి మల్టీస్టారర్‌గా మారిపోయింది. ఇధి వరకు చిరంజీవి పాత్రకు సంబంధించిన టీజర్ వచ్చేసింది. ఇక తాజాగా రామ్ చరణ్‌ను సిద్ద పాత్రలో చూపిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. రామ్ చరణ్ మాస్ యాంగిల్, ధర్మస్థలి విజువల్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ ఒక్క అంశం అదిరిపోయింది. ఇక ఈ చిన్నపాటి టీజర్‌తోనే అంచనాలు ఆకాశన్నంటిపోయేలా ఉన్నాయి. సిద్ద పాత్ర ఎలా ఉంటుందో చిన్న టీజర్‌లోనే చూపించేశాడు కొరటాల శివ. టీజర్ అంతా ఒకెత్తు అయితే.. లాస్ట్ షాట్ మాత్రం నెవ్వర్ బిఫోరో అనేలా ఉంది. చిరుత పులి, పులి బిడ్డ రెండు అలా కొలను పక్కన దప్పిక తీర్చుకుంటాయి. మరో పక్కనే చిరంజీవి, రామ్ చరణ్‌లు కూడా కనిపిస్తారు. ఇక అంతకు మించిన వర్ణణ ఏదీ అవసరం లేదు. ఒక్క డైలాగ్ చెప్పకుండా.. ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించి కొరటాల తన టాలెంట్ ఏంటో చూపించాడు. మొత్తంగా సిద్దకు ఈ చిత్రం ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది అర్థమవుతోంది. సిద్ద పాత్రలో రొమాన్స్, రౌద్రం అన్నీ ఉన్నాయని చూపించాడు. ఇక సోనూ సూద్‌తో రామ్ చరణ్ చేసిన ఆ పోరాట దృశ్యం అదిరిపోయింది. పూజా హెగ్డేతో రామ్ చరణ్ కెమిస్ట్రీ హైలెట్ అయ్యేలాా ఉంది. మొత్తానికి ఫిబ్రవరి 4న రికార్డులు బద్దలవ్వాల్సిందే.
Comments
Post a Comment