Shiva Shankar Master Death : శివ శంకర్ మాస్టర్ కన్నుమూత

ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చివరకు కరోనాతో పోరాడి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. రియల్ హీరో సోనూ సూద్ సైతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితిపై ఆరా తీశారు. మంచు విష్ణు మా అధ్యక్షుడి హోదాలో హాస్పిటల్ బృందంతో మాట్లాడాడు. ఇక వీరందరికంటే ముందుగానే హీరో ధనుష్ ఎవ్వరికీ తెలియకుండా పది లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేశారట. కానీ ఇవేవీ కూడా శివ శంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోాయాయి. శివ శంకర్ మాస్టర్ మరణ విషయం తెలియడంతో గుండె బద్దలైందని రియల్ హీరో సోనూ సూద్ ఎమోషనల్ అయ్యాడు. కాపాడేందుకు శాయ శక్తులా ప్రయత్నించామని కానీ అవేవీ ఫలించలేదని కన్నీరుమున్నీరయ్యాడు. సినిమా పరిశ్రమ మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతుందని సోనూ సూద్ ట్వీట్ వేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరాడు. మెలోడీ పాటలకే కాదు కుర్రకారుకు మత్తెక్కించే హుషారు పాటలకు కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. మగధీర సినిమాలోని ధీర ధీర అనే పాటకు జాతీయ అవార్డు లభించింది. ఇక దొంగ దొంగది సినిమాలోని మన్మథ రాజా మన్మథ రాజా అనే పాటకు శివ శంకర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫాస్ట్ బీట్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి. కేవలం కొరియోగ్రఫర్‌గానే కాకుండా.. నటుడిగా ఎన్నో చిత్రాల్లో తన ప్రతిభను చూపించారు. పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ తన మార్క్ చూపించారు. జబర్దస్త్ వంటి కామెడీ షోల్లోనూ నవ్వించారు. అలా అన్ని రకాలుగా శివ శంకర్ మాస్టర్ దక్షిణాది సినీ ప్రేమికులను అలరించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ