తెలంగాణలో మగాళ్లు అలా చేసినా ఆడవాళ్లు మాత్రం!.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో అన్ని విషయాల మీద స్పందిస్తుంటుంది. ఈ మధ్యే నటిగా కూడా అవతారమెత్తింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో రాహుల్ రవీంద్రన్, చిన్మయి తమ నిజ జీవిత పాత్రలను పోషించారు. అలా మొత్తానికి చిన్మయి కూడా నటిగా మారింది. తాజాగా చిన్మయి తెలంగాణ సమాజం, తెలంగాణలోని మగాళ్ల తీరు గురించి వచ్చిన ఓ సర్వే గురించి స్పందించింది. భార్యను భర్తను తన్నడం అనేది గృహ హింస కిందకే వస్తుంది. అయితే కొందరు మాత్రం ఇది తమ మీద ప్రేమతోనే అలా చేస్తున్నారంటూ భార్యలు తమ భర్తలను వెనకేసుకుని వస్తుంటారు. తెలంగాణలో ఈ శాతం ఎక్కువగా ఉందట. తెలంగాణలో మహిళలను భర్తలు ఎక్కువగా కొట్టినా కూడా భార్యలు మాత్రం అది సమంజసమేనని అంటున్నారట. అలా భార్యలను కొట్టడం కరెక్టే అని కర్ణాటకలోని 81 శాతం మంది పురుషులు అంటే.. తెలంగాణలోని 83 శాతం మంది స్త్రీలు తమను భర్తలు కొట్టడం కరెక్టేనని అన్నారట. ఈ సర్వేలో భాగంగా ఏడు ప్రశ్నలు సంధించారట. భార్యలను భర్తలు కొట్టేందుకు ఏడు కారణాలున్నాయట. చెప్పకుండా బయటకు వెళ్లడం, భర్తతో వాదించినప్పుడు, శృంగారానికి ఒప్పుకోనప్పుడు, మంచిగా వండిపెట్టనప్పుడు, అబద్దాలు చెప్పినప్పుడు నమ్మకం కలగనప్పుడు, అత్తమామలను గౌరవించనప్పుడు వంటి సందర్భాల్లో కొడతారట. మీరు ఆ సర్వేను సరిగ్గా గమనిస్తే.. ఆడ, మగ మధ్య చదువులో ఎంత తేడా ఉందో తెలుస్తోంది. ఆడవాళ్లకు ఎంత త్వరగా పెళ్లి చేస్తున్నారు.. వారు ఎంత త్వరగా తల్లులు అవుతున్నారో అర్థమవుతోంది. ఇలా ఉన్నప్పుడు.. మా ఆయన ప్రేమతోనే కొట్టాడు అని అనడం మంచిది కాదు అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ