డైరెక్టర్ బాపుతో మరిచిపోలేని అనుభవం!.. నాటి సంగతులు పంచుకున్న సునీత

ఇప్పుడు సెల్ఫీలు, ఫోటోగ్రాఫుల ట్రెండ్ వచ్చింది. కానీ ఒకప్పుడు మాత్రం తమ అభిమాన తారల ఆటోగ్రాఫుల కోసం ఫ్యాన్స్ చచ్చిపోయేవారు. జీవితంలో ఎలాగైనా సరే వాటిని సంపాదించాల్సిందేనని అనుకునేవారు. అలా ఇప్పుడు ఆటోగ్రాఫుల ట్రెండ్ పోయింది. సెల్ఫీల ట్రెండ్ వచ్చింది. తాజాగా సింగర్ తన జీవితంలో దర్శకుడు బాపుతో ఉన్న అనుబంధం, ఆయనతో ఉన్న మెమోరీస్‌ను గుర్తు చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు బాపు రమణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పడెప్పుడో వచ్చిన ముత్యాల ముగ్గు నుంచి బాలయ్య నటించిన శ్రీరామరాజ్యం వరకు తెలుగు ప్రేక్షకుల మీద చెరగని ముద్ర వేశారు. ఆయన సినిమాల్లో అచ్చమైన తెలుగు కనిపిస్తుంది. తెలుగు అందాలు కనిపిస్తాయి. బాపు గారి బొమ్మలా ఉన్నావ్ అంటూ అమ్మాయిలను పొగడటం వెనుకున్న నేపథ్యం కూడా అదే. బాపు గారు బొమ్మ గీశారంటే.. ప్రపంచంలోని అందమంతా అందులోకి వస్తుంది. అలాంటి గొప్ప దర్శకుడితో సునీత తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. బాపు తెరకెక్కించిన రాధా గోపాలం, శ్రీరామరాజ్యం సినిమాలకు సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీత పని చేశారు. అయితే సునీత ఓ సారి బాపు గారిని ఆటోగ్రాఫ్ అడిగిందట. కానీ బాపు గారు మాత్రం నో అన్నారట. ఇదంతా కూడా రాధాగోపాలం సినిమాలో స్నేహ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు జరిగిందట. నేను నీకు అభిమానిని.. మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని బాపు గారే సునీతను అడిగారట. కానీ అలాంటి పెద్దవారు అలా అడగడంతో కాస్త ఇబ్బంది పడి ఒప్పుకోలేదట. తన కళ్లలో నీళ్లు తిరిగాయట. ఆ సమయంలో ఆయన ఇలా రాసి ఇచ్చారట. కింద సంతకం పెట్టేశారట. సరస్వతీ పుత్రిక చి సౌ సునీతకు అమ్మవారి అనుగ్రహం సదా ఉండాలని కోరుకుంటూ.. వీరాభిమాని బాపు అని రాసి ఇచ్చారట. ఇంత కంటే ఏం కావాలని సునీత ఎమోషనల్ అవుతోంది. నా పనికి సరైన గుర్తింపు దొరికిందని అనిపించింది. ఆయన మరో రెండు చిత్రాలు కూడా పని చేశాను. సుందరాకాండ, శ్రీరామ రాజ్యం చిత్రాల్లో పని చేశాను. రాష్ట్ర స్థాయిలో అవార్డు కూడా అందుకున్నాను. ఇవన్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. సంతోషాన్ని ఇస్తాయి అని సునీత తలుచుకుంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ