HBD Brahmanandam: కింగ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ లైఫ్ జర్నీ.. దటీజ్ బ్రహ్మానందం!!
సిల్వర్ స్క్రీన్‌పై అనే పేరు పడిందంటే చాలు ప్రేక్షకులు హుషారెత్తిపోతారు. సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్లకు ఉండే ఈ క్రేజ్ అనేది కమెడియన్లలో ఒక్క బ్రహ్మానందంకి మాత్రమే సొంతం అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను తనదైన హావభావాలతో చక్కిలిగింతలు పెట్టారు ఈ నవ్వుల రారాజు. నేటికీ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుకున్న మెరుస్తూ థియేటర్లను నవ్వులతో ముంచెత్తుతున్న బ్రహ్మి పుట్టినరోజు ఈ రోజు (ఫిబ్రవరి 1). ఈ సందర్భంగా హాస్య బ్రహ్మకి 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఆ నవ్వుల ప్రయాణంపై ఓ లుక్కేద్దామా.. బ్రహ్మి పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. 1956 ఫిబ్రవరి 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సత్తెనపల్లిలో కన్నెగంటి నాగలింగాచారి- లక్ష్మీనరసమ్మ దంపతులకు ఆయన జన్మించారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చిన ఆయన.. భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో MA పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టారు ఈ ఎక్స్‌ప్రెషన్