బంగార్రాజు 13 డేస్ కలెక్షన్స్.. అలా కలిసొచ్చిన సెలవుదినం

'సోగ్గాడే చిన్ననాయనా' సినిమాకు సీక్వల్‌గా వచ్చిన '' సినిమాకు తొలి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య తెరపంచుకున్న ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా 13 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మరి ఈ 13 రోజుల్లో ఏ మేర వసూళ్లు రాబట్టిందో చూద్దామా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు డే వైజ్ కలెక్షన్స్ చూస్తే.. డే 1: 9.06 కోట్లు డే 2: 7.79 కోట్లు డే 3: 6.72 కోట్లు డే 4: 3.55 కోట్లు డే 5: 1.94 కోట్లు డే 6: 91 లక్షలు డే 7: 51 లక్షలు డే 8: 46 లక్షలు డే 9: 64 లక్షలు డే 10: 81 లక్షలు డే 11: 36 లక్షలు డే 12: 26 లక్షలు డే 13: 51 లక్షలు మొత్తంగా చూస్తే ఈ 13 రోజుల్లో కలిపి 33.52 కోట్ల నెట్, 54.30 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. జనవరి 26 సెలవు దినం కలిసి రావడంతో 12వ రోజుతో పోల్చితే 13వ రోజు కలెక్షన్స్ పుంజుకున్నాయి. 13వ రోజు ఏరియాల వారిగా రిపోర్ట్ చూస్తే.. నైజాం: 9 లక్షలు సీడెడ్‌: 10 లక్షలు ఉత్తరాంధ్ర: 10 లక్షలు ఈస్ట్ గోదావరి: 7 లక్షలు వెస్ట్ గోదావరి: 4 లక్షలు గుంటూరు: 5 లక్షలు కృష్ణా: 4 లక్షలు నెల్లూరు: 2 లక్షలు మొత్తంగా చూస్తే అన్ని ఏరియాల్లో కలిపి 13వ రోజు బంగార్రాజుకు 51 లక్షల నెట్, 85 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ 13 రోజుల్లో మరో మూడున్నర కోట్లు వసూలయ్యాయి. విడుదలకు ముందు 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు సినిమా 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చూస్తే 36.70 కోట్లు వసూలయ్యాయి. అంటే మరో 2.30 కోట్లు రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్ అయినట్లే అని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ