Sivakama Sundari: గొల్లపూడి సతీమణి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

దివంగత సినీ నటుడు, రచయిత సతీమణి శుక్రవారం కన్నుమూశారు. 81 ఏళ్ల శివకామ సుందరి చెన్నైలోని టి.నగర్‌లోని శారదాంబాళ్ వీధిలో ఉన్న తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో అదే రోజు అంత్యక్రియలను నిర్వహించారు. శివకామసుందరి మరణం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. వరంగల్‌లోని హన్మకొండలో జన్మించారు శివకామసుందరి. 1961లో గొల్లపూడి మారుతీ రావు()తో ఆమెకు వివాహం జరిగింది. అప్పటి నుంచి చెన్నైలోనే స్థిరపడ్డారు. రామభక్తురాలైన శివకామ సుందరి.. మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా 2019 డిసెంబరులో మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి శివకామసుందరి తన కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు. గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. ఐదుగురు మనవళ్లు ఉన్నారు. ఒక కుమారుడు వైజాగ్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment