గర్భవతిగా అనుపమ.. అవాక్కైన లేడీ కమెడియన్

కేరళ బ్యూటీ () నెట్టింట్లో చేసే అల్లరి మామూలుగా ఉండదు. తెరపై ఎంత సరదాగా ఉంటుందో సోషల్ మీడియాలోనూ అంతే సరదాగా ఉంటుంది. సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా క్రేజ్ మాత్రం తగ్గదు. ఈ బ్యూటీకి శతమానం భవతి తరువాత ఒక్క హిట్ కూడా పడలేదు. కానీ ఆఫర్లు మాత్రం వచ్చేస్తుంటాయి. అదే అనుపమలోని మ్యాజిక్. అనుపమ అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఇక చివరగా అనుపమ రౌడీ బాయ్స్ అంటూ అందరినీ పలకరించింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అనుపమ అందాలు, పెట్టిన ముద్దులు మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక అనుపమలో నటిగానే సింగర్, డైరెక్టర్ ఇలా ఎన్నెన్నో కోణాలున్నాయి. ఈపాటికే అనుపమ పాటలు కూడా పాడేసింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసింది. గత ఏడాది ఓ షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించింది. అలా మొత్తానికి అనుపమ తనలోని టాలెంట్ అంతా చూపించేస్తోంది. తాజాగా అనుపమ కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసింది. సినిమా కోసం గర్భవతిగా మారింది అనుపమ. ఆ మూవీలోని స్టిల్స్‌ను ఇప్పుడు షేర్ చేసింది. అందులో తన తండ్రి కూడా ఉన్నాడు. అయితే ఈ ఫోటోలను సడెన్‌గా చూసిన లేడీ కమెడియన్ విద్యల్లేఖ రామన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందట. నిజంగానే గర్భవతి అని ఫీలైందట.. కంగ్రాట్స్ అని చెప్పబోయిందట. ఈ మేరకు చేసిన కామెంట్‌కు అనుపమ నవ్వేసింది. ఇక అనుపమ ఇప్పుడు నిఖిల్‌తో రెండు సినిమాల్లో నటిస్తోంది. మొత్తానికి అనుపమకు మాత్రం తెలుగులో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కానీ పెద్ద హీరోతో చాన్స్ గానీ, ఓ బ్లాక్ బస్టర్ హిట్ గానీ ఆమె ఖాతాలోకి రావడం లేదు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ