ట్విట్టర్‌లో పేరు మార్చిన విజయ్ దేవరకొండ.. లోలోపల జరుగుతోంది?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ తమ సామజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాల పేర్లు మార్చడం, తద్వారా ఏదో హింట్ ఇవ్వడం అనేది చూస్తూనే ఉన్నాం. ఇటీవల సమంత తన డివోర్స్‌కి ముందు ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ నుంచి 'అక్కినేని' అనే పదాన్ని తొలగించడంతో మొదలైన అనుమానాలు చివరకు నిజమయ్యాయి. ఇకపోతే రీసెంట్‌గా శ్రీజ కూడా అలాగే ట్విట్టర్‌లో పేరు మార్చేసి పలు చర్చలకు తెరలేపగా.. ఇప్పుడు రౌడీ స్టార్ కూడా అదే పని చేశాడు. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ పక్కన 'తుఫాన్' అనే పదాన్ని యాడ్ చేశాడు. ఇంకేముంది ఇది చూసి జనాల్లో డౌట్స్ షురూ అయ్యాయి. ఉన్నట్టుండి విజయ్ దేవరకొండ ఇలా పేరు మార్చడం వెనుక రీజన్ ఏంటని ఆరా దీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. లోలోపల అసలేం జరుగుతోంది? అనే కోణంలో అన్వేషణ చేయగా చిన్న హింట్ లభించింది. అదే విజయ్ దేవరకొండ యాడ్ షూట్. ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ కోసం విజయ్ దేవరకొండ ఇచ్చిన ఓ పోజ్‌కి తుఫాన్ ట్యాగ్ కనిపించింది. దీంతో అసలు విషయం ఇదని అంతా అర్థం చేసుకున్నారు. సినిమాలే కాదు బిజినెస్ పరంగా విజయ్ దేవరకొండ ఐడియాలజీ చాలా మందికి నచ్చుతుంది. కెరీర్ పరంగా డిఫరెంట్ వేస్ ఎంచుకుంటూ ముందుకెళ్లడం, కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలో దూసుకెళ్లడం విజయ్ స్టైల్. ఇందులో భాగంగానే యాడ్ షూట్స్ చేయడంలోనూ ప్రత్యేకత చూపిస్తుంటాడు విజయ్ దేవరకొండ. అయితే ఇక్కడ ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ ప్రమోషన్ కోసం ఇలా ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ మార్చేయడం అనేది మరింత ప్రత్యేకమని చెప్పుకోవాలి. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు 'సాలా క్రాస్ బ్రీడ్' అనే పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్ పెట్టారు. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అతిత్వరలో విడుదల కానుంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ