చై-సామ్ డివోర్స్ ఇష్యూ: సమంతనే విడాకులు కావాలందంటూ నాగార్జున ఓపెన్

సమంత- విడాకుల ఇష్యూ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. గతేడాది అక్టోబర్‌ 2న తమ డివోర్స్ విషయాన్ని అధికారికంగా బయటపెట్టారు చై- సామ్. దీంతో ఈ ఇష్యూపై అప్పుడు మొదలైన చర్చలు నేటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. విడాకులకు కారణం ఏంటనేది ఇప్పటికీ బయటకు రాలేదు కానీ జనాల్లో ఎన్నో రకాలుగా చర్చలు నడిచాయి. నాలుగేళ్ల వివాహ బంధం తెంచుకోవడం వెనుక రీజన్స్ ఏమై ఉంటాయనే కోణంలో ఎన్నో రూమర్స్ బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చైసామ్ డివోర్స్ ఇష్యూపై ఓపెన్ అయ్యారు . ప్రేమించి పెళ్లి చేసుకున్న చై- సామ్‌ జోడీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని నాగార్జున అన్నారు. అయితే నాలుగేళ్ల వివాహ‌ బంధంలో వాళ్లకు విడిపోయేటంత పెద్ద స‌మస్య ఎందుకొచ్చింది అనేది త‌న‌కు ఇప్ప‌టికీ తెలియ‌ద‌ని అన్నారు. గతేడాది (2021) న్యూ ఇయర్ వేడుకలు ఇద్దరూ కలిసి సంతోషంగా నిర్వహించుకున్నారని చెప్పిన నాగ్.. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చిందని, కాకపోతే కచ్చితంగా ఏంటనేది తనకు మాత్రం తెలియదని తెలిపారు. సమంతనే మొదట విడాకులు కావాలని కోరిందని, ఆమె కోరిక మేరకే చైతూ ఒప్పుకున్నాడని నాగార్జున అన్నారు. అయితే విడాకులు తీసుకునే సమయంలో తాను కంగారు పడతానేనని చైతూ తనను చాలా ఓదార్చాడని చెప్పారు నాగ్. అలాగే కుటుంబ పరువు, మర్యాద ఏమైపోతుందని చైతూ ఆవేదన చెందాడని తెలిపారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య- విడాకుల ప్రకటన తర్వాత తమ కుటుంబంపై వచ్చిన నెగెటివ్ వార్తలు తమను ఎంతగానో బాధించాయని నాగార్జున పేర్కొన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా చైసామ్ డివోర్స్ ప్రకటన వచ్చి నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ ఈ ఇష్యూ చర్చల్లో నిలుస్తుండడం విశేషం.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ