Posts

Showing posts from March, 2020

కరోనా కంటే ప్రమాదంగా వర్మ సాంగ్.. వైరస్‌కి బాంబు పెడతావా? కత్తితో పొడుస్తావా? వార్నీ!

Image
సమయం తనది కాకపోవచ్చు.. సందర్భం రాకపోవచ్చు.. కాని పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకుని ప్రమోషన్స్ పొందటంలో వర్మకు వర్మే సాటి. ప్రపంచంలో ఎక్కడ ఏమూల చిన్న ఇష్యూ జరిగిన దానిపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలిచే వర్మ.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో మొదటి నుంచి కూడా తన మార్క్ ట్వీట్లతో వైరల్ అవుతున్నారు. కరోనాపై వర్మ చేసిన ట్వీట్లు ఆలోచింపచేసే విధంగా.. మరికొన్ని ఫన్నీగా.. ఇంకొన్ని కొన్ని వర్గాలలకు ఎప్పటిలాగే మంట పుట్టించే విధంగా ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. కరోనాపై పాటరాసి ఎవడితోనే ఎందుకు నేనే పాడేస్తే పోలా అనుకున్నాడో ఏమో కాని తన గొంతుకు పనిచెప్పి ఈ పాట ప్రోమో వదిలాడు. పూర్తి పాట వినడానికి సాయంత్రం వరకూ టైం ఉందిలే కాని.. ఈలోపు ఈ ప్రోమో వదులుతున్నా.. ఇది కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన "కనిపించని పురుగు" అనే పాట ప్రోమో..చెవులకు మాస్క్ తొడుక్కొని వినండి. మొత్తం పాట రేపు సాయంత్రం (ఏప్రిల్ 01) సాయంత్రం 5.30 కి స్ప్రే చేయబోతున్నాను’ అంటూ సోమవారం అర్థరాత్రి ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో పోస్ట్ పెట్టాడు వర్మ. ఇక వర్మ అర్థరాత్రి పూట పెట్టిన పోస్ట్‌లు ఎలాగు

కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ గౌతమ్... లైవ్‌లో మాట్లాడుతూ ఏడ్చేసిన జబర్దస్త్ బ్యూటీ

Image
కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపత్యంలో సెలబ్రిటీలంతా స్పందిస్తున్నారు. ప్రజలంతా క్షేమంగా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పలువురు టీవీ నటులు, ప్రముఖ యాంకర్లు కూడా ప్రస్తుతమున్న పరిస్థితులపై స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమ్... లాక్ డౌన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికి కొన్ని ప్లేసుల్లో పేదలకు ఎలాంటి సహాయం అందడం లేదు. దీంతో ఈ విషయమై రష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది పేదలకు తినడానికి సరిగా ఫుడ్ కూడా దొరకడం లేదని పేర్కొంది. దయచేసి అందరూ విరాళాలు ఇవ్వాలని కోరింది. ఎవరికి చేతనైనంత సాయం వారు చేయాలని కోరింది. కనీసం ఒక్క రూపాయి ఇచ్చినా చాలు అని రష్మీ వేడుకోంది. విరాళాలు అంటే పెద్ద మొత్తంలో మాత్రమే చెల్లించాల్సిన అవసరం లేదని, చాలా మంది కలిసి ఒక్కో రూపాయి సాయం చేసినా చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. పేదవారు తిండికి దూరమవుతున్నారంటూ రష్మీ ఫేస్ బుక్‌లో లైవ్‌‌లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్లీజ్ ప్రీజ్ అంటూ అందర్నీ బతిమాలింది. మన

కరోనా వైరస్‌తో ప్రముఖ నటుడు మృతి

Image
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ప్రముఖ నటుడు, స్టార్‌ వార్స్‌ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ మృతిచెందారు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావటంతో ఆయన సర్రేలోని ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్‌ మెకలాగ్‌ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఆయన మృతి తీరని లోటన్నారు. 76 ఏళ్ల జాక్‌ స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ 7,8లలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. హాలీవుడ్ స్టార్ హీరోలు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌ వర్త్‌ లకు డయలెక్ట్‌ కోచ్‌ గానూ ఆయన వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ నటులు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు డయలెక్ట్‌ కోచ్‌( భాషకు సంబంధించిన మెలుకువలు నేర్పేవారు)గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న జాక్‌ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ కూడా ఆయన మృతిపై స్పందిచారు. రెండు రోజుల క్రితం జాక్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. మంగళవారం ఎటువంటి బాధలేకుండా ప్రశాంతంగా కన్నుమూశారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9 లక్షల మంది కరోనా బారిన పడగా, 42వేల మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో ప్ర

హరీశ్ శంకర్‌కు సర్‌ప్రైజ్... పెళ్లైన హీరోయిన్ నుంచి మెసేజ్

Image
మంగళవారం ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలంతా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయనకు తన సినిమాల్లో నటించిన హీరోయిన్ నుంచి ఓ సర్ ప్రైజ్ మెసేజ్ వచ్చింది. ఆ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఆ భామ ఇంకెవరో కాదు... బొద్దుగుమ్మ . మిర్చీ, మిరపకాయ వంటి సినిమాలతో హాట్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా రిచా ... సందర్భంగా శుభాకాంక్షలు తెలపింది. మంగళవారం రోజున తన ట్విట్టర్‌ ద్వారా విషెస్ చెప్పింది. ‘ హాయ్ హరీశ్. మీరు నాకిచ్చిన మంచి క్యారెక్టర్ ఎప్పుటికీ మరిచిపోలేను. ఇప్పటికీ గుర్తుంది. ఈ స్పెషల్ డేన మీరు మీ ఫ్యామిలీతో బాగా గడుపుతున్నారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను చూసిన హరీశ్ శంకర్ సర్ ప్రైజ్ అయ్యాడు. నిజంగా సర్ ప్రైజ్.. చాలా రోజుల తర్వాత కలిసావు ఎలా ఉన్నావు. శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు. రిచా గంగోపాధ్యయ, హరీశ్ డైరెక్షన్‌లో రవితేజకు జంటగా మరిపకాయ్ సినిమాలో నటించింది. ఇందలో దీక్షా సేథ్ మరో హీరోయిన్. 2011ల

Coronavirus Song: కరోనాపై పాట పాడిన వర్మ.. ఇవాళ సాయంత్రం రిలీజ్

Image
వివాదాస్పద దర్శకుడు మరోసారి పాట పాడేందుకు సిద్ధమవుతున్నాడు. ఎప్పటికప్పుడ జరిగే పరిణామలపై వర్మ స్పందిస్తూ ఉంటాడు. తాజాగా పై కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అనుభవాల్ని పంచుకుంటున్నాడు. అయితే తాజాగా కరోనాపై కూడా పాట విడుదల చేస్తానని ప్రకటించాడు వర్మ. ఈ వైరస్ పై సొంతంగా పాట పాడానని ట్విట్టర్లో తెలిపాడు. ఆ పాటను బుధవారం సాయంత్రం 5:30లకు విడుదల చేస్తాననన్నాడు. ఇది కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన “కనిపించని పురుగు” అనే పాట ప్రోమో...చెవులకి మాస్క్ తొడుక్కొని వినండి. మొత్తం పాట రేపు సాయంత్రం 5.30 కి స్ప్రే చేయబోతున్నాను. అని మంగళవారం వర్మ ట్వీట్ చేశారు. ‘ కనిపించని పురుగు.. కరోనా అనే ఒక పురుగు. నలిపేద్దామంటే అంత సైజ్ లేదు దానికి... పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి. అదే దాని బలం. అదే దాని దమ్ము. ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పేల్చోచ్చు. but it is just పురుగు అంటూ వర్మ పాట పాడి పోస్టుచేశారు. మొత్తం పాట ఇవాళ సాయత్రం 5:30లకు విడుదల చేస్తానన్నారు. కరోనా వైరస్‌ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుంటే... వర్మ మాత్రం దీనిపై ఎప్పటికప్పుడు తనదైన స్టయిల్లో కామెంట్స్ చేస్తూ నెటిజన్ల ద

మొత్తం రూ. 6.2 కోట్లు.. ఛారిటీ లెక్కలు చెప్పిన చిరంజీవి

Image
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. వీటిలో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పెద్దలందరూ కలిసి ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేశారు. దీనికి విరాళాలు అందించాల్సిందిగా సినీ ప్రముఖులను స్వయంగా చిరంజీవి అభ్యర్థించారు. చిరంజీవి స్వయంగా ఈ ఛారిటీకి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు తెలుగు సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చారు. ఎవరి శక్తిమేర వారు విరాళాలు అందజేశారు. మార్చి 28న ఈ ఛారిటీని ఏర్పాటు చేయగా నాలుగు రోజుల్లో రూ.6.2 కోట్ల విరాళాలు అందాయి. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా రూ.6.2 కోట్లు సేకరించాం. ఈ నిధికి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సాయం

అనాథ పిల్లలకు అండగా హరీష్ శంకర్.. సినీ కార్మికులకు శ్రీకాంత్, సప్తగిరి విరాళం

Image
డైరెక్టర్ హరీష్ శంకర్ తన మంచి మనసును చాటుకున్నారు. తన పుట్టినరోజు నాడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో అనాథ పిల్లలకు రెండు నెలలపాటు వారికి ఆహారాన్ని అందించనున్నారు. హరీష్ శంకర్ మంగళవారం (మార్చి 31న) తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా 45 మంది అనాథ పిల్లలకు రెండు నెలలకు సరిపడే స్వీట్స్, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కేక్స్, తదితర ఆహార పదార్థాలను అందజేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు, సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలంతా విరాళాలు అందజేయగా.. ఇప్పుడు చిన్న నటులు కూడా తమ వంతు సాయం అందజేస్తున్నారు. హీరో, సహాయ నటుడు శ్రీకాంత్ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే, కమెడియన్ సప్తగిరి రూ.2 లక్షల సహాయాన్ని ప్రకటించారు. Also Read: కాగా, కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ దాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. షూటింగ్‌లు లేకపోవడం వల్ల సినీ పరిశ్రమల రోజువారీ

ముంబై నుంచి వస్తారు.. కోట్లు తీసుకుంటారు: హీరోయిన్లపై బ్రహ్మాజీ ఫైర్

Image
కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రోజువారీ వేతన కార్మికులను ఆదుకోవడానికి హీరోయిన్లు ముందుకు రాకపోవడంపై నటుడు బ్రహ్మాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఈ ప్రభావం సినిమా పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఇండస్ట్రీలో రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయాలు. వారందరినీ ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పరిశ్రమ పెద్దలంతా కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్ హీరోల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. అయితే, లావణ్య త్రిపాఠి మినహా ఏ హీరోయిన్ విరాళాలు ప్రకటించలేదు. లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బ్రహ్మాజీ హీరోయిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముంబై నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లుగా కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. కానీ, వారెవ్వరూ కార్మికుల సంక్షేమం గురించి స్పందించడం లేదు. లావణ్య త్రిపాఠి ఒక్కరే విరాళం ఇచ్చారు. మిగిలిన వారు ఛారిటీకి విరాళం ఎందుక

ఛారిటీ అంటే రౌడీ మామూలు కాదు: డైరెక్టర్ ఘాటు వ్యాఖ్యలు

Image
కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. వీటిలో మన దేశం ఉన్నప్పటికీ ఆ దేశాలతో పోలిస్తే మన దగ్గర కరోనా ప్రభావం కాస్త తక్కువనే చెప్పాలి. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న సంచలన నిర్ణయాలు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. అంతేకాకుండా కరోనా నివారణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న పేద ప్రజలను ఆదుకోవడానికి, ప్రభుత్వానికి మద్దతుగా సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మన సినీ తారలు విరాళాలు ప్రకటించారు. అలాగే, లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో తెలుగు సినీ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్లను ఆదుకోవడం కోసం తెలుగు సినీ పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.)ని ప్రారంభించింది. ఈ ఛారిటీ విరాళాలు ఇవ్వాల్సిందిగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రముఖులను అభ్యర్థించారు. ఆయన వంతుగా కోటి రూపాయలు ఇచ్చారు. చిరంజీవి పిలుపు మేరకు చాలా మం

55 ఏళ్ల ‘తేనెమనసులు’.. కృష్ణ సినిమాపై మహేష్ ఆసక్తికర పోస్ట్

Image
దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ‘తేనెమనసులు’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా విడుదలై నేటికి 55 ఏళ్లు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా ద్వారా నటీనటులు రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కృష్ణ.. టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా ఎదిగారు. ఐదు దశాబ్దాలపాటు అద్భుతమైన కెరీర్‌ను చూసిన ఈ 75 ఏళ్ల నటుడు 350కి పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు, తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో కొత్త జానర్లు, టెక్నికల్ అంశాలను పరిచయం చేసిన ఘనత కృష్ణది. ఇదిలా ఉంటే, ఈరోజు (మార్చి 31న) ‘తేనెమనసులు’ సినిమా 55వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ సినిమాను ప్రేక్షకులకు గుర్తుచేశారు. ఈ సినిమా తనకు ఆల్‌టైమ్ ఫేవరేట్ అని చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘‘నాకు ఎప్పటికీ ఇష్టమైన సినిమా. మరిచిపోలేని క్లాసిక్. మన ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రయాణం 55 ఏళ్ల క్రితం ఇదే రోజు ‘తేనెమనసులు’తో మొదలైంది. బ్లాక

Akira Nandan: అకిరా నా ప్రాణం.. ఒక తల్లితో అలా చెప్తారా?: రేణు దేశాయ్ దిమ్మతిరిగే ఆన్సర్

Image
వదినా మా నెక్స్ట్ హీరో, జూనియర్ పవర్ స్టార్ అకిరానందన్‌ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని రేణూ దేశాయ్ లైవ్ చాట్‌లో సలహా ఇవ్వగా ఎప్పటిలాగే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది పవన్ మాజీ భార్య . ‘అన్నా.. అకిరా మీకు హీరో కావొచ్చేమో.. వాడు నా కొడుకు. మీ కంటే కూడా నా ప్రాణం వాడు. ఒక తల్లికి అలా చెప్పకూడదు.. వాడు హీరో అయితేనే జాగ్రత్తగా చూసుకుంటాం అని కాదు.. వాడిని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత’ అంటూ నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చారు రేణు దేశాయ్. ఇక ఒక్కసారి అకిరాని చూపించండి వదినా అంటే.. వాడికి చాలా సిగ్గు. నా ఇన్ స్టాగ్రామ్‌కి రాడు. అందుకే వాడి ఫొటో కూడా పెట్టడం లేదు’ అని సమాధానం ఇచ్చింది. ఇక ‘అలవైకుంఠపురములో’ సాంగ్స్ విన్నారా? అంటే.. యా.. సూపర్బ్ సాంగ్స్.. అన్నీ పాటలు విన్నాను. అందులోని సామజవరగమన సాంగ్ అకిరా ఎన్నిసార్లు విన్నాడో.. వాడి వల్ల నేను ఎన్నిసార్లు విన్నానో. అద్భుతమైన సాంగ్ అది’ అని అన్నారు రేణు. చిగురాకు చాటు చిలకా.. ఇక మరో నెటిజన్ లైవ్‌లోకి వచ్చి రేణు దేశాయ్ పాపులర్ హిట్ సాంగ్‌ ‘చిగురాకు చాటు చిలకా’ అనే పాట పాడమనగా.. ఆ పాటను గుర్తుతెచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడింది రేణు.

Chiranjeevi: శ్రీరామనవమికి చిరు ట్రీట్.. ట్విట్టర్ హీటెక్కడం ఖాయమే బాసూ!

Image
మెగాస్టార్ చిరంజీవి శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకులకు ఏప్రిల్ 2న అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారంటే అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొరటాల దర్శకత్వంలో చిరు 152 మూవీకి సంబంధించిన ‘ఆచార్య’ టైటిల్‌‌ను మెగాస్టార్ ‘పిట్టకథ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రివీల్ చేసేశారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ మూవీ టైటిల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మెగా ట్వీట్స్‌తో ట్విట్టర్ హీటెక్కిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. మెగాస్టార్ ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత నిరంతరం ఇండస్ట్రీతో టచ్‌లో ఉంటూ అప్డేట్స్ అందిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలకమైన సూచనలు చూస్తూ.. కష్టల్లో ఉన్న ఇండస్ట్రీని ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)ని ఏర్పాటు చేసి విరాళాలను సేకరిస్తున్నారు. ఈ వివరాలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ మరి కొంతమంది స్టార్లలో సాయం చేయలనే ప్రేరణ కలిగిస్తున్నారు. ఇక వీటితో పాటు హీరోలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం.. మోహన్ బాబు లాంటి మిత్రులతో సరదాగా సంభాషిస్తూ ట్విట్టర్‌లోనూ మెగాస్టార్ సత్తా చూపిస్తున్నారు. కాగా గురువారం నాడు ‘ఆచార్య’ చిత్రానికి

మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. అక్కడ థియేటర్స్ తిరిగి ప్రారంభం

Image
కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. సినిమాలు విడుదల కాక.. షూటింగ్‌లు నిలిచిపోవడంతో వేలది మంది కళాకారులు, కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని సినీ కార్మికుల ఆకలి కేకలతో ఇండస్ట్రీ క్షీణదశలో ఉంది. సుమారు ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రూ. 2000లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. ఇక థియేటర్ యజమానులు అందులో పనిచేసే వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బొమ్మ పడితేనే వాళ్లకు బువ్వ.. కరోనా మహమ్మారి కాటు వేయడంతో వాళ్లకు కూడు లేకుండా పోయింది. దీంతో వాళ్లను ఆదుకునేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి సాయం చేస్తూ సినీ కార్మికుల ఆకలి తీర్చుతున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలంతా పెద్ద మనసు చాటుకుంటూ సినిమా వర్కర్స్‌కి సాయం చేస్తూ విరాళాలు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ కరోనాను మోసుకువచ్చిన చైనా దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగౌతున్నాయి. అక్కడ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సినిమా ఇండస్ట్రీ‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది. చాలా సినిమాలు విడుదలకు వాయిదా పడ్డాయి. దీంతో ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుకావడంతో తిరిగి థియేటర్స్ ప్

సినీ కార్మికులకు నాని, బన్నీ విరాళం.. ప్రభుత్వాలకు నారా రోహిత్ రూ.30 లక్షల సాయం

Image
కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో త‌న వంతుగా రూ. 30 ల‌క్షల విరాళాన్ని ప్రక‌టించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల సహాయ నిధుల‌కు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అంద‌రూ త‌ప్పకుండా పాటించాలని ప్రజ‌ల‌ను ఆయ‌న కోరారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీ రామరక్ష అన్నారు. అందరం సమష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. మరోవైపు, ఈ లాక్‌డౌన్ కాలంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఛారిటీకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.20 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రా ముఖ్యమంత్రుల సహాయ నిధులకు మొత్తం రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు సీసీసీకి మరో రూ.20 లక్షలు అందజేశారు. దీంతో ఆయన విరాళం మొత్తం రూ.1.45 కోట్లక

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... మరో మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ పోస్టర్

Image
మెగాస్టార్ అభిమానులకు మరో శుభవార్త రానుంది. మరో మూడు రోజుల్లో చిరంజీవి సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ‘ఆచార్య’ పేరుతో కొరటాల శివ దర్శకత్వంతో మెగా స్టార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ్రీరామ‌న‌వి సంద‌ర్భంగా ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఉగాది సందర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుదల చేద్దామని భావించినప్పటికీ అదే రోజున చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే కూడా రావడం. ఆ తర్వాత చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ కూడా విడదుల కావడంతో... ఆచార్య పోస్టర్ రిలీజ్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో మూడు రోజుల్లో శ్రీరామినవమి వస్తుండంతో ఫస్ట్ లుక్‌తో మెగాస్టార్‌ సంద‌డి చేస్తారనేది టాలీవుడ్ టాక్. ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగ‌స్టులో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్స్ అన్ని ఆగిన సంగతి తెలిసింది. దీంతో మూవీ విడుదల కూడా ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా విశేష

Nithiin Birthday: నితిన్‌కి ‘మెగా’ సర్ ప్రైజ్.. బర్త్ డే బాయ్ ఆనందానికి అవధుల్లేవ్

Image
ఈ మధ్యనే ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ‘రాననుకున్నావా?? రాలేననుకున్నావా’? అంటూ వరుస ట్వీట్‌లతో చెలరేగిపోతున్నారు. ఇప్పటికే 282 K ఫాలోవర్స్‌ చిరుని ఫాలో అవుతున్నారు. తాజాగా నేడు హీరో నితిన్ పుట్టిన రోజు కావడంతో విషెష్ అందిస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. హ్యాపీ బర్త్ డే నితిన్.. మీరు ప్రజాక్షేమం కోసం మీ పర్శనల్ లైఫ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నారు. కరోనాపై పోరాడుతున్నయోధుడు అని అనిపించారు. ఇలాంటి పోరాటం ఉంటే కరోనా మన దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. మీకు మీకు కాబోయే భార్య షాలిలికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక కరోనాకు తన వంతుగా అందరికంటే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందించిన నితిన్‌కి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. కాగా మెగాస్టార్ నుంచి తనకు మెగా బర్త్ డే విషెష్ అందడంతో నితిన్ ఆనందానికి అవధులు లేవు.. ‘థాంక్యూ సోమచ్ సార్.. వెరీ స్వీట్ ఆఫ్ యు సార్’ అంటూ రిప్లై ఇచ్చి తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు నితిన్. ఇక నితిన్‌తోనే కాకుండా నితిన్‌కి కాబోయే భార్య షాలిని ఫ్యామిలీతో చ

నితిన్ బర్త్ డే గిఫ్ట్.. కొత్త సినిమాల పోస్టర్స్ సందడి

Image
నేడు (మార్చి 30) హీరో బర్త్ డే కావడంతో తన అప్ కమింగ్ మూవీస్ పోస్టర్స్‌తో సందడి చేస్తున్నారు నితిన్. ఆదివారం నాడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ‘రంగ్ దే’ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో నితిన్‌ని జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో నితిన్, కీర్తి సురేష్‌లు అను అర్జున్‌లుగా కనిపించబోతున్నారు. కాగా భవ్యా క్రియేషన్స్ టీమ్ ప్రొడక్షన్ నెం. 12లో నితిన్ మరో సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కగా.. నితిన్‌కి బర్త్ డే విషెష్ అందిస్తూ బర్త్ డే పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా కన్ను కొట్టుడుతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ప్రియా వారియర్ నటిస్తోంది. ఎం.ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధంచిన పోస్టర్‌లో నితిన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇదిలా

ఇంకెవరు మన లచ్చక్కే... వర్మ ట్వీట్‌కు మంచు మనోజ్ రిప్లై

Image
ఆదివారం ఓ ట్వట్ చేశారు. ఓ చిన్నపాప చేసిన టిక్ టాక్ వీడియోను ఆయన తన పేజీలో పోస్టు చేశారు. అందులో ఆ అమ్మాయి తల్లి మిలుకు తాగుతావా మిలుకు అంటూ చిన్నారిని అడుగుతుంది. దానికి ఆ చిన్నారి మిలుకు కాదది మిల్క్. అంటూ ఆ పదాన్ని ఎలా పలకాలో వివరిస్తాది. అయితే ఆ వీడియోలో లిటిల్ గర్ల్ ఎవరిని ఇమిటేట్ చేస్తుంది అని వర్మ నెటిజన్లకు ప్రశ్నించాడు. దీనిపై స్పందించని ఇవాళ బదులిచ్చాడు. ట్విట్టర్ ‌లో ‘ ఇంకెవరు మన లచ్చక్క. అమ్మో నేను అయిపోయాను. ఎటూ పారిపోలేను కూడా’ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వర్మ పెట్టిన ట్వీట్‌కు నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. అంటూ ట్వీట్ చేశారు. మరికొందరు అయితే అదే టిక్ టాక్ వీడియోను కూడా పోస్టు చేశారు. ఇంకొందరు మంచు లక్ష్మీ డైలాగ్స్‌ను ఇమిటేట్ చేసిన వీడియోలను పెట్టారు. ఇక మంచు మనోజ్ పెట్టిన పోస్టుకు కూడా ఆయన అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. నువ్వు సూపర్ అన్న అంటూ కితాబిస్తున్నారు. మనోజ్ చాలా స్పోర్టివ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకొందరు అయితే ఎక్కడికి పారిపోలేవు అన్నా ఇప్పటికే దేశంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ

మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన బన్నీ పోస్ట్.. అది అవసరమా అంటూ ట్రోల్స్

Image
‘చెప్పను బ్రదర్’.. అంటూ ఆ రోజుల్లో మెగా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూశారు స్టైలిష్ స్టార్ . పనికట్టుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘డీజే’ సమయంలో అల్లు అర్జున్‌ని ట్రోల్ చేశారు. మెగా హీరోగా మెగా ఆశీస్సులతో మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే.. కానీసం వాళ్ల పేరుని కూడా చెప్పడానికి ఇష్టం లేదు బ్రదర్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కాలింది. అసలే పవన్ ఫ్యాన్ పైగా ఇగో హర్ట్ అయితే రచ్చ మామూలుగా ఉండదుగా.. అల్లు అర్జున్‌కి సంబంధించిన ఏది వచ్చినా దాన్ని పనికట్టుకుని డిస్ లైక్స్ చేసేవారు. అప్పట్లో దువ్వాడ జగన్నాథం టీజర్, ట్రైలర్‌లు డిస్ లైక్స్‌తో రికార్డుల కెక్కాయి అంటే అది పవన్ ఫ్యాన్స్ చేసిన పనే అని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అయితే ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది కదా.. ప్రతి హీరో సినిమాకి వెళ్లి పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరవడం కరెక్ట్ కాదని నాగబాబుతో సహా అందరూ చురకలేశారు. అరే ఇదంతా అయిపోయి ముచ్చట. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తో బన్నీ కలవడం. ఇద్దరి మధ్య సమస్యసమసిపోవడం జరిగిపోయింది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంటే బన్నీ కూడా. మెగా హీరోల్లో బన్నీ కూడా టాప్ స్టార్. పలు

‘మహానుభావుడు’గా మారండి: శర్వానంద్ ‘ఓసీడీ’ టిప్స్

Image
శర్వానంద్ హీరోగా మూడేళ్ల క్రితం ‘మహానుభావుడు’ అనే సినిమా వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ ఓసీడీతో బాధపడే వ్యక్తిగా నటించారు. ఓసీడీ ఫుల్ ఫాం ‘అబ్సెషన్‌ కంపల్షన్‌ డిసీజ్’. ఓసీడీ ఉన్నవాళ్లు కడిగిన చేతులే కడుగుతుంటారు.. వేసిన తాళాలు మళ్లీ మళ్లీ చెక్‌ చేస్తుంటారు.. కట్టేసిన గ్యాస్‌ సిలెండర్‌ను మాటిమాటికీ చూస్తుంటారు.. అంతేకాదు, ఎదుటివాళ్లు కూడా శుభ్రంగా ఉన్నారా లేదా అనే అనుమానంతో సతమతమవుతూ ఉంటారు. ‘మహానుభావుడు’ సినిమాలో శర్వానంద్ కూడా అతి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. శానిటైజర్ జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు. ఇప్పుడు మనందరినీ అలాగే ఉండమంటున్నారు శర్వానంద్. శర్వానంద్ నిన్నటి వరకు ట్విట్టర్‌లో లేరు. అయితే, ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పాటు ప్రజలతో టచ్‌లో ఉండాలని నిర్ణయించకుని ఆదివారం అకౌంట్ ఓపెన్ చేశారు. ఉద‌యం 11 గంట‌ల‌కు తొలి ట్వీట్ చేశారు. దిన‌స‌రి వేతనంతో ప‌నిచేసే కార్మికులు సినిమా సెట్లపై అంద‌రికంటే ఎక్కువ‌గా క‌ష్టప‌డుతుంటార‌ని ట్వీట్‌లో పేర్కొన్న ఆయ‌న‌.. షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు సినీ కార

బర్త్‌డే రేపు.. ఫ్రెండ్ అంటావ్ మళ్లీ: కీర్తి సురేష్ గాలి తీసేసిన నితిన్

Image
హీరో నితిన్ సినిమాల్లో చాలా క్యూట్‌గా, లవర్ బోయ్‌లా కనిపిస్తారు కానీ.. బయట మాత్రం చాలా అల్లరి. అవతలవాళ్లని ఆటపట్టిస్తూ ఉంటారు. ‘భీష్మ’ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో రష్మిక మందనను ఎలా ఆటపట్టించారో మనం చూశాం. రష్మిక కుక్క బిస్కెట్లు తింటారంటూ ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పేశారు. ఇది కాస్త బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కీర్తి సురేష్ గాలి తీసేశారు నితిన్. దీనికి కారణం ఆమె ఒక్కరోజు ముందు నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం. నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా ‘రంగ్ దే’ అనే సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘తొలిప్రేమ’, ‘మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం (మార్చి 30న) నితిన్ పుట్టినరోజును పురష్కరించుకుని ఒక్కరోజు ముందు.. అంటే ఆదివారం ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అర్జున్‌గా నితిన్, అనుగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. Also Read: అయితే, ఈ మోషన్ పోస్టర్‌ను ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విషింగ్ యు ఎ హ్య

కరోనా కష్టాలు.. బుద్ధిగా భార్య చెప్పింది చేస్తోన్న ఆలీ

Image
కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడేందుకు 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూ కరోనాపై పోరాడుతున్నారు. అయితే, ఈ లాక్‌డౌన్‌ను సెలబ్రిటీలు కష్టంగా భావించడంలేదు. తమ కుటుంబ సభ్యులతో గడపడానికి దొరికిన క్షణాలుగా భావిస్తున్నారు. అందుకే, తమకు ఇష్టమైన పనులు చేస్తూ ఇన్నాళ్లు తమకోసం పనిచేసినవాళ్లకు కాస్త విశ్రాంతిని ఇస్తున్నారు. కమెడియన్ ఆలీ అయితే తన భార్య చెప్పిన పనులన్నింటినీ బుద్ధిగా చేసేస్తున్నారు. ఈ మేరకు ఒక ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలో ఇల్లు శుభ్రంచేసే ఆలీ మాప్ స్టిక్ పట్టుకుని ఉన్నారు. ఆయన భార్య సుల్తానా బేగం ఇల్లు శుభ్రంచేసే లిక్విడ్‌ను మాప్ బాక్స్‌లో పోస్తుండగా.. స్టిక్ పట్టుకుని ఇళ్లు ఒత్తగానికి సిద్ధంగా ఉన్నారు ఆలీ. తాను రోజూ కార్లు కడుగుతున్నానని, ఇంట్లో పని చేస్తున్నానని ఆలీ చెప్పారు. కూరగాయలు కట్ చేస్తున్నానని, ఇల్లంతా శుభ్రపరుస్తున్నానని వెల్లడించారు. అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నానన్నారు. తన భార్య ఏ పని చెబితే అది బుద్ధిగా చేసేస్తున్నానని.. వంట కూడా చేస్తున్నాన

Nithiin: ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్.. ఊపిరి తగిలే శ్వాసల్లో నితిన్, కీర్తి సురేష్

Image
‘భీష్మ’ చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న హీరో జోరు మీద ఉన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ క్వీన్, జూ. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రేపు (మార్చి 30) నితిన్ బర్త్ డే కావడంతో ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్‌లుక్‌లో నితిన్, కీర్తి సురేష్‌లు ఊపిరి తగిలేటంత శ్వాసల్లో బందీలు అవుతూ చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ఈ చిత్రంలో అను, అర్జున్‌లుగా కనిపించబోతున్నారు నితిన్, కీర్తి సురేష్‌లు. తొలిసారి ఈ ఇద్దరూ కలిసినటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీష్మ చిత్రం హిట్ కావడంతో నితిన్‌-నాగవంశీ కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మారుమూల గ్రామంలో వ్యవసాయం చేసుకుంటా: రేణు దేశాయ్

Image
రేణు దేశాయ్.. పరిచయం అవసరంలేని పేరు. ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. ఆ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు భార్యగా మారారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. కొన్నేళ్ల వైవాహిక జీవితం తరవాత పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి తన ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే ముద్రను పోగొట్టాలని చూస్తున్నారు. రేణు. అందుకే, తానేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్లపాటు పిల్లలతో పూణేలో ఉన్న రేణు అక్కడ మరాఠీ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే, కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తన టీమ్‌తో కలిసి వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అయితే, అది సినిమా షూటింగా లేదంటే ఏదైనా డాక్యుమెంటరీనా అనే విషయం తెలీదు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆపేశారు. అప్పుడు షూటింగ్ చేసే సమయంలో వికారాబాద్‌లోని మారుమూల గ్రామాలను రేణు దేశాయ్ సందర్శించారు. అక్కడ తీసుకున్న ఫొటోలను ఇప్పటికే రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ గ్రామాల్లో తిరగడం, అక్కడి వాతావరణాన్ని దగ్గరగా చూడటంతో రేణు దేశాయ్‌లో ఒక ఆలోచన వచ్చింది. తాను కూడా వ్యవసాయం

అమేజాన్ ప్రైమ్‌లో ఆ సినిమా ఉంది... మీరిద్దరూ చూడండి: వర్మ

Image
ివివాదాస్పద దర్శకుడు మరో ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఆయన రకరకాల ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేస పనిలో పడ్డారు. కరోనా వైరస్‌తో లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు , కూడా క్వారంటైన్‌లో ఉన్నారన్నారు వర్మ. అందుకే వాళిద్దరు అమేజన్ ప్రైమ్‌లో ఉన్న ‘’ సినిమా చూడాలని కోరారు. అంతేకాదు ఆ సినిమా చూసి వారిద్దరు తనకు ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వాలన్నారు వర్మ. మరసారి వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ మారుతోంది. అప్పుడు పై నెటిజన్స్ స్పందించడం కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్లను ఎందుకు కదుపుతున్నావని ప్రశ్నిస్తున్నారు. కొందరు లోకేష్‌కు ట్యాగ్ చేసే దమ్ములేదా అని కూడా అడుగుతున్నారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ.. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తాజాగా జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించినట్టు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమా విషయంలో టీడీపీ వర్మప

చిరంజీవిని అప్పుడూ ఏరా అనేవాడిని ఇప్పుడూ ఏరా అనే పిలుస్తా: భాను చందర్

Image
1978 నుంచి 2020 వరకూ హీరో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. 80 నాటి హీరోల్లో ఇతనూ ఒకరు. మన ఊరి పాండవులు, ఆడవాళ్లు మీకు మా జోహార్లు, సత్యం శివం, గూడచారి నెం.1, తరంగిణి ఇలా వందకు పైగా చిత్రాల్లో నటించిన భానుచందర్.. ఇటీవల హిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవికి మంచి మిత్రుడు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో వివరిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. గారు నేను ఒకే రూంలో ఉండేవాళ్లం. మన ఊరి పాండవులు మూవీ షూటింగ్‌ టైంలో మేం ఒకే రూంలో ఉన్నాం. అసలు వాడే నాకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ డ్రైవ్ చేయడం నేర్పించాడు దోయకాయల పల్లిలో. రేయ్.. నీకు బైక్ తోలడం వచ్చా? అని అడిగాడు.. నాకు టూ వీలర్ రాదురా.. కారు తోలుతా అంటే.. ఛా!! రారా అని ఆ దగ్గర్లో ఎవరో రాజుగారో రెడ్డిగారో ఉండేవారు ఆయన బైక్ తీసుకుని నాకు డ్రైవింగ్ నేర్పించాడు. మేం ఇద్దరం చాలా సరదాసరదాగా ఉండేవాళ్లం. రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే.. గంట గంటకు వర్షం వచ్చేది. ఆ టైంలో బాపు గారు పిలిచి.. భాను నువ్ కరాటే చేస్తావ్ అంట కదా.. చేయి అంటే చిరంజీవి, నేను స్లోమోషన్‌లో కరాటే చేసేవాళ్లం.

హ్యాపీ బర్త్‌డేరా జున్ను.. కొడుకుతో నాని ఆటలు

Image
సాధారణంగా సినిమా హీరోలకు కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది. రాత్రింబవళ్లు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరోలు.. ఒక సినిమాకు మరో సినిమాకు మధ్యలో వచ్చే విరామంలో ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌లు వేస్తుంటారు. కానీ, ఇంట్లోనే భార్య, పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేరు. అయితే, కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ సినిమా హీరోలను తమ ఫ్యామిలీకి బాగా దగ్గర చేసిందని చెప్పుకోవాలి. ఈ 21 రోజులూ ఇంట్లోనే ఖాళీగా ఉండే హీరోలు భార్య, పిల్లలతో సమయాన్ని గడుపుతున్నారు. నేచురల్ స్టార్ నాని తన కుమారుడు జున్ను (అర్జున్)తో ఆడుకుంటూ మధుర క్షణాలను గడుపుతున్నారు. ఈరోజు (మార్చి 29)న జున్ను మూడో పుట్టినరోజు. ఈ సందర్భంగా జున్నుకి నాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డేరా జున్ను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో జున్నును ముద్దాడుతున్న ఫొటోను కూడా పొందుపరిచారు. ఆ తరవాత కాసేపటికి ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు నాని. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. కొడుకుతో పాటు మంచం మీద పడుకుని ఐరన్ మ్యాన్ కోసం ఊసులాడుతున్నారు. వచ్చీరాని మాటలతో జున్ను నాన్

నితిన్ పెళ్లి వాయిదా.. ఎమోషనల్ పోస్ట్‌తో అఫీషియల్ ప్రకటన

Image
కరోనా ప్రభావ పరిస్థితుల దృష్ట్యా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు హీరో నితిన్. తన స్నేహితురాలు, డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 15న పెళ్లి, 16న దుబాయ్‌లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్‌లో ఈ పెళ్లి వేడుకను అంగరంగవైభవంగా జరిపేందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ డెస్టినేషన్ మ్యారేజ్‌కు 100 మంది గెస్ట్‌లను కూడా ఆహ్వానించారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో దుబాయ్‌తో పాటు అన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ డెస్టినేషన్ పెళ్లి దుబాయ్‌లో జరిపించమే ప్రధాన సమస్యగా మారడంతో హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియా ద్వారా చేశారు. ‘‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడిఉన్నాయో మీకు తెలుసు. అత్యవరస పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని లాక్ డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని మిమ్మిల్ని ప్

సినీ కార్మికులకు అండగా మాస్ మహారాజ్... రూ. 20లక్షలు అందించిన రవితేజ

Image
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కూడా మూతపడింది. షూటింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో పేద సినీ కార్మికుల కోసం ప్రముఖ సినీ స్టార్స్ తమ వంతు సాయాన్నిఅందిస్తున్నారు. వారి కోసం భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అగ్రహీరోల నుంచి కుర్ర హీరోల వరకు అంతా తమవంతు సాయంగా తోచినంత విరాళం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ రూ20 లక్షలు సాయం ప్రకటించారు. సినీ కార్మికుల కోసం తనవంతు సాయం చేస్తున్నానన్నాడు. పనుల్లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు రవితేజ. లాక్ డౌన్ తో రోజు వారీ సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థం కోసం ఇప్పటివరకు చిరంజీవి, నాగార్జున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దగ్గుబాటి ఫ్యామిలీ తరపున రాణా, వెంకటేష్, సురేష్ బాబు కోటి రూపాయాలు విరాళం అందించారు. ఇక సూపర్ స్టార్ మహేష్, తారక్ రూ. 25 లక్షలు ఇచ్చారు. 21 రోజుల లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం తన వంతు బాధ్యతగా విరాళాలు ఇస్తున్నారు. లాక్ డౌన్ మనకి అత్యంత అవసరమని… అందరూ ఇంటిలో

Corona Crisis Charity: వరుణ్ తేజ్ 20లక్షలు, శర్వా 15, దిల్ రాజు 10 ఇంకా..

Image
కరోనా కష్టానికి టాలీవుడ్ ఆపన్న హస్తం అందిస్తోంది. కరోనా వైరస్ విజృంభనతో షూటింగ్‌లు లేక సినిమాలు విడుదల కాక వేల మంది సినీ కార్మికులు, కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని చాలా మంది కార్మికులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి సాయం చేయడానికి టాలీవుడ్ స్టార్‌లు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి విరాళాలను ప్రకటిస్తూ వాళ్ల ఆకలి తీర్చుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా తమకు తోచిన సాయాన్ని చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ కరోనా

మళ్లీ మిడిల్ ఫింగర్ ఎత్తిందండోయ్.. బూతుల వరద బాబోయ్

Image
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మనందరం వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. చేతులకు గ్లౌజ్, శానిటైజర్స్ ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా వైరస్ ఉన్న వ్యక్తి నోటి నుండి వచ్చే తుపర్లు, తుమ్ములు, దగ్గు కారణంగా కారణంగా ఒకర్నుంచి ఒకరికి ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుండటంతో ముక్కు, నోరు కవర్ అయ్యేలా ధరించే వాటిని మాస్క్‌లు అని పిలుస్తున్నాం. అయితే వీటికి కూడా తన మార్క్ నామకరణం చేసుకుంది వివాదాస్పద నటి . బూతుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వల్గారిటీ లేనిదే పోస్ట్ పెట్టినా కిక్ ఉండదని అనుకుంటారో ఏమో కాని.. ఈ మాస్క్‌కి ‘మై నోస్ డ్రాయర్’ అంటూ పేరుపెట్టి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. అంతటితో ఆగిందా... ఏమైందో ఏమో కాని తనకు అలవాటుగా మారిన మిడిల్ ఫింగర్‌ని మళ్లీ లేపింది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను బండబూతులు తిడుతూ మీడియా ముందే మిడిల్ ఫింగర్‌ని చూపించింది శ్రీరెడ్డి. ఆ తరువాత పలు సందర్భాల్లోనూ వేలికి పనిచెప్పింది. తాజాగా మరోసారి తన మిడిల్ ఫింగర్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ మిడిల్ ఫింగర్ పోస్ట్‌పై నెటిజన్లు రెచ్చిపోయారు.. బూతుల పంచాంగం విప

మరో సినీనటికి కరోనా పాజిటివ్.. మూలికలు తీసుకుంటూ వీడియో

Image
కరోనా మహమ్మారి విజృంభనకు మరో నటి బలైంది. ఇతర దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలబ్రిటీలు, దేశ ప్రధానుల్ని సైతం కబలిస్తోంది ఈ భయంకర వైరస్. రోజుకి వందలాది మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు.. వేలాదిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో ప్రముఖ అమెరికన్ నటి, జుమాంటీ ఫేమ్ లారా బెల్ బండీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వివరించింది బెల్ బండీ. ఈమె వయసు 38 ఏళ్లు కాగా.. గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, తలనొప్పి, చాతి నొప్పి, జ్వరంతో బాధపడుతున్నతాను.. అంతకంతకూ వ్యాధి తీవ్రత పెరగడంతో శ్వాసకోస సంబంధమైన సమస్యలు సైతం వచ్చాయని.. ఈ తరుణంలో కరోనా వైరస్‌పై సరైన అవగాహన లేక వ్యాధి నిర్థారణకు ఆలస్యం అయ్యిందని చెప్పారు. అయితే కరోనా పాజిటివ్ అని తేలినతరువాత స్వీయ గృహనిర్బంధంలో ఉన్నాను. ప్రస్తుతం స్వీయ నిర్భందంలో ఉన్నాను.. పరిస్థితి అదుపులోనే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.. వారి వైద్యంతో పాటు మూలికలను తీసుకుంటున్నా. భయపడాల్సిన అవసరం లేదు.. దయచేసి ఎవరూ బయటకు రాకండి.. పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించండి. క

డాక్టర్లకు అండగా నిఖిల్.. భారీగా ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్ కిట్స్ అందించిన హీరో

Image
క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ర‌కాల చ‌ర్యలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలాగే, తెలుగు చిత్ర ప‌రిశ్రమలో ప్రముఖులు సైతం త‌మ వంతుగా ఆర్థిక స‌హ‌కారం అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా నివార‌ణ చ‌ర్యల‌కు యంగ్ హీరో నిఖిల్ ముందుకొచ్చారు. క‌రోనాని అరిక‌ట్టేందుకు ముందు వ‌ర‌స‌లో ఉండి ప్రాణాలకు తెగించి పనిచేస్తోన్న డాక్టర్స్‌, మెడిక‌ల్ సిబ్బందికి చేయూత‌గా వారి ర‌క్షణ‌కి ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్స్ కిట్స్ భారీగా అందించారు. 2000 ఎన్ 95 రెస్పిరేట‌ర్లు, 2000 రీ-యూజ‌బుల్ గ్లోవ్స్, 2000 ఐ-ప్రొట‌క్షన్ గ్లాసులు, శానిటైజ‌ర్లు, 10000 ఫేస్ మాస్కులు.. ఈ కిట్స్ అన్నింటినీ గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్టెంట్ అధికారుల‌కి స్వయంగా నిఖిల్ తీసుకెళ్లి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘క‌రోనా నివార‌ణ మ‌నంద‌రికీ ఎంత ముఖ్యమో, డాక్టర్లును సైతం ఆ క‌రోనా భారిన ప‌డ‌కుండా, వారికి శ్రమ క‌ల‌గ‌కుండా చూసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. డాక్టర్లతో పాటు మిగిలిన హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మున్సిప‌ల్ క

కమల్‌పై కరోనా వదంతులు.. కారణం గౌతమీనా!!

Image
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకిందని, ఆయన తన ఇంట్లోనే నిర్బంధంలోనే ఉన్నారని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దానికి కారణం చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లోని ఆయన ఇంటికి చెన్నై కార్పోరేషన్ వాళ్లు అతికించిన ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్. కమల్ హాసన్ ఇంటికి ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్ అతికించగానే వదంతలు మొదలైపోయాయి. దీంతో కమల్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కమల్‌కు కరోనా పాజిటివ్ అనే వదంతలు రావడంతో వెంటనే ఆ స్టిక్కర్‌ను కార్పోరేషన్ వాళ్లు తొలగించారు. అభిమానులు ఆందోళనకు గురవుతోన్న విషయం తెలిసి కమల్ హాసన్ కూడా స్పందించారు. తనకు కరోనా సోకింది అనే వదంతులో నిజం లేదని స్పష్టం చేశారు. అసలు ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్ అతికించిన ఇంటిలో కొన్నేళ్లుగా తాను ఉండటం లేదని చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీసుగా వినియోగిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ పేర్కొన్నారు. Also Read: అయితే, కమల్ ఇచ్చిన వివరణ తర్వాత చాలా మందిలో ఒక అనుమానం తలెత్తింది. అసలు కమల్ ఇంటికి ‘హోం క్వారంట

పనిమనిషిని రేప్ చేసిన రచయిత.. మండిపడ్డ సింగర్ చిన్మయి

Image
ఆ దేశంలో అతనో ప్రముఖ రచయిత.. అలాంటి ఇలాంటి రచయిత కాదు.. ‘మమైర్స్ ఆఫ్ పాబ్లో నెరుడా’ అనే పుస్తకంతో దేశ వ్యాప్తంగా పేరుగడించారు. ఈ పుస్తకం అతని ఆత్మకథే.. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారాయన. ఒకసారి శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఓ తమిళ పని మనిషిపై అత్యాచారం చేసి పాడుచేశానని స్వయంగా ఆయనకు ఆయనే పుస్తకంలో రాసుకున్నారు. వారెవ్వా.. ఇలాంటివి కూడా వదలకుండా రాసుకున్న ఆ ప్రముఖుడు ఎవరు అంటే.. చీలీ దేశపు ప్రముఖ రచయితల్లో ఒకరైన పాబ్లో నెరుడా ఈ ఘనకార్యం చేసిన వ్యక్తి. ఇంతవరకూ బాగానే ఉంది.. కాని మరి ఆ పుస్తకం మన వివాదస్పద శ్రీపాద కంటపడటంతో తుక్కురేగ్గొడుతూ ట్వీట్ పెట్టింది. ఇటీవల ప్రముఖ రచయిత, దౌత్య వేత్త హోదాలో ఉన్న పాబ్లో నేరుడా తమిళ పనిమనిషిని రేప్ చేశా అంటూ తన ఆత్మకథలో రాసుకున్న విషయం నాదృష్టికి వచ్చింది.. అంతా అయిపోయిన తరువాత ఆ ఘటనతో పశ్చాత్తాపం పడుతున్నానని అనడం సమజసమేనా.. ఇలాంటి వాళ్లను మహానుభావులుగా అభివర్ణించడం మన కర్మ’ అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ వదిలింది సింగర్ చిన్మయి. Read Also:

చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ.. భారీగా విరాళాలు

Image
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. వీటిలో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ సీసీసీ మ‌న‌కోసంకు సంబంధించిన వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు.. దర్శకుల సంఘం అద్యక్షుడు ఎన్. శంకర్ వెల్లడించారు. నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. ‘‘మ‌న సోద‌ర కార్మికుల‌కి మ‌నం ఏం చేయ‌గ‌లం అని చిరంజీవి త‌న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చారు. చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు, నేను, ఎన్‌.శంక‌ర్, క‌ల్యాణ్, దాము అంద‌రం క‌లిసి చిన్న క‌మిటీగా ఏర్పాట‌య్యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్రమ కార

మిత్రమా.. మార్పు రావాలి: మోహన్ బాబుకు చిరు మరో పంచ్

Image
చిరంజీవికి చమత్కారం బాగా ఎక్కువైందని ఈ మధ్య వినిపిస్తోన్న మాట. నిజానికి ఈ మధ్య కాలంలో ఆయన హాజరైన వేడుకలు, కార్యక్రమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి.. ఇక రాజకీయాలకు టాటా చెప్పి తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించారు. ఇండస్ట్రీకి పెద్దన్న పాత్రను పోషిస్తూ చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. వాటికి ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే, స్టార్ హీరోలు నటించిన సినిమాల వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో మాట్లాడుతూ తన చమత్కారంతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్‌టైన్మెంట్‌ను పంచుతున్నారు. కేవలం ఇలాంటి వేడుకల్లో అందించే ఎంటర్‌టైన్మెంట్ సరిపోదని ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరంజీవి ఉగాది నాడు (మార్చి 25న) సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచిన విషయం తెలిసిందే. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన అభిమానులు, ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. అయితే, ట్విట్టర్‌లో కూడా తన చమత్కారంతో అభిమానులను కట్టిపడేస్తున్నారు చిరంజీవి. ముఖ్యంగా తన మిత్రుడు, సహ నటుడు మంచు మోహన్ బాబుతో ఆయన చేస్తోన్న కామెడీ బ

సినీ కార్మికులకు కోటి విరాళం ఇచ్చిన నాగార్జున

Image
కరోనా వైరస్ ప్రభావం కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో ఏప్రిల్ 14 వరకు ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటికి రావడానికి వీళ్లేదు. కాబట్టి, అప్పటి వరకు షూటింగ్స్ అన్నీ బంద్. ఆ తరవాత కూడా ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేదు. సినిమా షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల ఆ ప్రభావం వాటి మీద ఆధారపడి బతికే సినీ కార్మికులపై పడింది. రోజువారీ వేతనానికి పనిచేసే చాలా మంది సినీ కార్మికులు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఇప్పటికే చాలా మంది సినీ పెద్దలు విరాళాలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సహాయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాటలోనే కింగ్ నాగార్జున నడిచారు. సినీ వర్కర్స్ సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ మనకి అత్యంత అవసమని, అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి డి.సురేష్ బాబు, వెంకటేష్, రానా సంయుక్తంగా కోటి రూపాయలు ప్రకటించారు. క‌రోనా వ్యాప్తి నిరోధంలో నిరంత‌రం శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కో

ఇద్దరు హీరోల కొంటె ట్వీట్లు... పవర్ ఫుల్ పంచ్‌లు వైరల్

Image
మెగాస్టార్ మెగా ఎంట్రీతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అందరూ చేస్తున్న ట్వీట్లకు స్పందిస్తూ... చిరంజీవి సరద సరదాగా సమాధానాలు ఇస్తున్నారు. దీంతో చిరు సోషల్ మీడియాలోకి వచ్చిన కానుంచి ఆయన అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మీడియా చీరు పెట్టిన ప్రతీ పోస్టును కూడా వదలకుండా కవర్ చేస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మధ్య ట్విట్టర్ వేదికగా సరద సరదా సంభాషణ కొనసాగుతోంది. ఇద్దరూ నేనంటే నేనంటూ పోటీ పడుతూ పోస్టులు పెడుతున్నారు. ఉగాది రోజున సోషల్ మీడియాలోకి వచ్చిన చిరుకు ప్రముఖ సినీ తారలు, దర్శక, నిర్మాతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్ బాబు కూడా మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ రాననుకున్నావా, రాలేననుకున్నావా అని మోహన్ బాబుకు రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన మోహన్ బాబు .. ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను అని అన్నారు. దీంతో ఆ ట్వీట్‌కు చిరంజీవి కౌంటర్ ఇస్తూ.. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే హగ్స్, షేక్ హాండ్స్ ఇచ్చుకోకూడదు, సోషల్ డిస్టెన్స్ అవసరం అంటూ అదరగొట్టారు. అంతేకాదు ఆయన ట్వీట్‌‌లో రాస్తూ.. కరోనా పై అవగాహన కోసమే కాకుండా మన

సరిలేరు నీకెవ్వరూ... సీనీ కార్మికులకు మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం

Image
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు... మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. శ్రీమంతుడు సినిమాలో లాగా నలుగురికి అండగా నిలబడ్డాడు. మహర్షిలా ఆపద సమయంలో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచాడు. తాజాగా సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల కోసం రూ. 25లక్షలు విరాళం ప్రకటించాడు మహేష్. లాక్ డౌన్ ప్రభావం రోజువారి ఆదాయం సంపాదించే సినీ కార్మికులపై ఎక్కువగా ఉంటుందన్నారు మహేష్. అందుకే... వాళ్ల కోసం రూ.25లక్షలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న పరిస్థితులుల్లో సినీ ఇండస్ట్రీకి చెందినవారంతా సీనీ పరిశ్రమలోని కార్మికుల్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మహేష్ రూ. కోటి సాయం అందించారు. ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షల చొప్పున ఆయన విరాళం ప్రకటించారు. కోవిడ్ 19పై కలిసికట్టుగా పోరాడదామని మహేష్ పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను పాటిద్దామన్నారు. ప్రధాన మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వం పెరుగుతుంది, మనం ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని అంతకుముందు మహేష్

క్వారంటైన్‌లో కమల్ హాసన్: షాక్‌లో ఫ్యాన్స్.. ఇదో గందరగోళం!

Image
తమ అభిమాన హీరో గృహ నిర్బంధం(హోం క్వారంటైన్)లో ఉన్నానే వార్త బయటికి రావడంతో లోకనాయకుడు కమల్ హాసన్ ఫ్యాన్స్ శనివారం ఉదయం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, అలాంటిదేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లో ఉన్న కమల్ హాసన్ ఇంటికి చెన్నై కార్పోరేషన్ ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్‌ను అతికించింది. కొంత సేపటి తరవాత ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఈ లోపలే ఆ సమాచారం అభిమానుల దగ్గరికి వెళ్లిపోయింది. దీంతో తమ హీరోకు ఏమైందనే భయంతో ఎంక్వైరీలు మొదలుపెట్టారు. విషయం కమల్ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. అభిమానులనుద్దేశించి ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘నా ఇంటి బయట గోడకు నోటీస్ అంటించడం వల్ల నేను క్వారంటైన్‌లో ఉన్నానని ఒక వార్త వ్యాపించింది. కానీ, నేను కొన్నేళ్లుగా ఆ ఇంట్లో ఉండటం లేదని మీలో చాలా మందికి తెలుసు. ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీసుగా వినియోగిస్తున్నాం. కాబట్టి, నేను క్వారంటైన్‌లో ఉన్నాను అని వచ్చిన వార్తలు అవాస్తవం’’ అని తన ప్రకటనలో కమల్ హాసన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగాంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ పేర్కొన్నారు. ప

Daggubati Family Corona Donation కరోనా కష్టం.. భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి ఫ్యామిలీ

Image
కరోనా వైరస్ నిర్మూలనకు, తిండిలేక ఇబ్బందుల పడుతున్న వారికి సాయం చేసేందుకు టాలీవుడ్ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొండంత కష్టంలో తమకు చేతనైన సాయం చేస్తూ చేయూతగా నిలుస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు మిగిలిన హీరోలు దర్శకులు, నిర్మాతలు తమకు తోచిన సాయం చేస్తూ ఆపదలో మేం ఉన్నాం అంటూ అండగా నిలుస్తున్నారు. తాజాగా దగ్గుబాటు ఫ్యామిలీకి చెందిన వెంకటేష్, సురేష్ బాబు, రానాలు తమ వంతుగా కోటి రూపాయిల సాయం ప్రకటించారు. సినీ కార్మికులు, హెల్త్ కేర్ విభాగాలకు సంబంధించిన కోటి రూపాయల సాయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విరాళంగా ప్రకటించారు. కరోనా ప్రభావంతో సినిమా పరిశ్రమలోని కార్మికులు రోజువారి అవసరాలకోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సాయాన్ని ప్రకటించింది సురేష్ ప్రొడక్షన్స్. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు.. లాక్ డౌన్‌తో థియేటర్స్ అన్నీ మూతబడ్డాయి దీంతో వేలాది మంది కార్మికులు, కళాకారులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకు అండగా న

కరోనా కష్టం.. సూపర్ మార్కెట్‌లో అల్లు అర్జున్.. అవసరం అలాంటిది మరి

Image
కరోనా వైరస్‌ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇంట్లో వాళ్లు ఉండటం కంటే మరో మార్గం లేదని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. మొత్తంగా గత రెండు వారాలుగా కరోనా భయంతో చాలామంది జనం ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉంటున్నారు. సాధారణ జనంతో పాటు.. సెలబ్రిటీలు సైతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. షూటింగ్‌లు అన్నీ బంద్ కావడంతో ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. వంటచేసేవాళ్లు కొందరైతే.. ఇళ్లను శుభ్రం చేసుకునే వాళ్లు మరికొందరు పిల్లలతో ఆడుకుంటూ స్టార్ హీరోలు సోషల్ మీడియాలో సెల్ఫ్ క్వారంటైన్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం సడలింపు ఇచ్చాయి ప్రభుత్వాలు. ఈ సమయంలో జాగ్రత్తలు పాటిస్తు తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కునే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ తన ఫ్యామిలీకి కావాల్సిన సరుకులు కోసం సాధారణ వ్యక్తిగా జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.45లో ఉన్న సూపర్ మార్కెట్‌కి వచ్చారు. ముఖానికి మాస్క్ కట్టుకుని, చేతులకు గ్లౌజ్ ధర

బాలయ్య హీరోయిన్‌కు కరోనా పరీక్షలు... నిజం కాదంటున్న హాట్ బ్యూటీ

Image
తాజాగా శుక్రవారం రోజున టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌కు కరోనా వచ్చిందని టాక్ వచ్చింది. మీడియాలో ఆ వార్తలు గుప్పు మన్నాయి. సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో ఇవాళ తాజాగా టాలీవుడ్ హీరోయిన్ స్పందించింది. తనకు ఎలాంటి కరోనా లేదని క్లారిటీ ఇచ్చింది. లెజెండ్ సినిమాలో బాలయ్యతో నటించిన హీరోయిన్ . తాజాగా ఈ భామ ఆస్పత్రిలో మాస్క్‌తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీంతో ఆమెకు కరోనా వచ్చిందంటూ పుకార్లు పుట్టించారు. నిమిషాల్లో వార్తను వైరల్ చేసి పడేశారు. దీంతో ఇప్పుడు లెజెండ్ భామ ఆ విషయంపై స్పష్టత ఇచ్చింది. తాను ఎలాంటి కరోనా పరీక్షలు చేయించు కోలేదని తెలిపింది. తనకు కరోనా లక్షణాలేవీ లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేసింది. ముఖానికి మాస్కు ధరించి ఓ ఆసుపత్రిలో ఉన్న ఫొటోను రాధిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. తాను ఆసుపత్రికి వచ్చానని, అయితే, కరోనా పరీక్షల కోసం కాదని తెలిపింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా బాగానే ఉందని హాష్ ట్యాగ్స్ జత చేసింది. ఇంట్లోనే ఉండి, భద్రంగా ఉండాలంటూ తన అభిమానుల్ని, నెటిజన్స్‌ను కోరింది రాధిక. అయితే.. ఆస్పత్రికి ఎందుకు వ

యువ నటుడు సేతురామన్ హఠాన్మరణం.. షాక్‌లో ఇండస్ట్రీ

Image
త‌మిళ యువ న‌టుడు, డాక్టర్ సేతురామ‌న్ క‌న్నుమూశారు. ఆయన వయస్సు 37 ఏళ్లు. గురువారం గుండెపోటు రావ‌డంతో రాత్రి 8 గంట‌ల 45 నిమిషాల‌కు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సేతురామ‌న్ న‌టుడే కాక వృత్తిరిత్యా స్కిన్ డాక్టర్. చెన్నైలో స్కిన్ కేర్ క్లినిక్‌ ఏర్పాటు చేసి వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. సేతురామ‌న్‌ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవలే సేతురామన్‌కు ఉమయాల్‌తో వివాహం అయ్యింది. ఆయనకు ఏడాది వయసున్న కూతురు ఉంది. చిన్న వయసులోనే సేతురామ‌న్‌ గుండె పోటుతో మరణించడం పట్ల షాక్‌లో ఉంది తమిళ ఇండస్ట్రీ. అనేక మంది నటులు, దర్శకులు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. సేతురామ‌న్ త‌మిళ హాస్య‌ న‌టుడు సంతానానికి అత్యంత స‌న్నిహితుడు. ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించిన .. రజినీకాంత్, శింబు చిత్రాల్లో నటించారు. ఆయన హఠాన్మరణం పట్ల తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విశాల్, ఖుష్బు, అర్చన, శిబిరాజ్, విష్ణు దర్శక నిర్మాత వెంకట్ ప్రభు, ధనంజయన్ తదితరులు సేతురామ‌న్ ఆత్మ‌కి శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. మంచి మిత్రుడ్ని కోల్పోయాం అంటూ ఆవేదన చెందుతున్నారు. సేతురామన్ 2013లో ‘కన్న

చరణ్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన... ఎంత స్పెషల్ అంటే...

Image
కరోనా ఎఫెక్ట్‌తో అన్నిరకాల సెలబ్రేషన్‌కు బ్రేకులు పడ్డాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు అంతా వాయిదా వేసుకున్నారు. కానీ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఎవరూ వాయిదా వేసుకోలేరు కదా. దీంతో ఎవరికి వారు తోచినట్లుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ వేడుకలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో ఈ ఏడాది మెగా పవర్ స్టార్ తన పుట్టినరోజు వేడుకలను సాధారణంగా చేసుకున్నాడు. ఉదయం నుంచే కు సినీ సెలబ్రిటీలు అంతా పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు. సోషల్ మీడియాలో చెర్రీకి శుభాకాంక్షలతో హోరెత్తించారు. రామ్ చరణ్ తాజాగా చేస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా డైరక్టర్ బర్త్ డే బాయ్ కు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన చేస్తోన్న రౌద్రం రణం రుథిరం సినిమాలో చెర్రీ లుక్ విడుదల చేశాడు. దీంతో రామ్ చరణ్ పుట్టిన రోజునా రాజమౌళి గిఫ్ట్‌తో అభిమానులంతా పండగ చేసుకున్నారు. అందులో అల్లూరిగా రామ్ చరణ్ నిప్పులు పుట్టించాడు. అయితే ఏడాది లాక్ డౌన్‌తో బర్త్ డే రోజున రోజున ఇంటికే పరిమితమైయ్యాడు రామ్ చరణ్. ప్రతి పుట్టిన రోజున తన తండ్రి చిరంజీవి ఇంటికెళ్ళి ఆశీర్వాదం తీసుకునే వాడు రామ్ చరణ్. కానీ ఈ ఏడాది మాత్రం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి. ద

వెల్లువెత్తుతున్న విరాళాలు: అశ్వినీదత్ 20 లక్షలు.. సుధీర్ బాబు రూ.2 లక్షలు

Image
కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే క‌రోనా నివార‌ణ‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్యల‌కు త‌మ వంతుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. హీరో నితిన్‌తో ప్రారంభమైన ఈ విరాళాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం ప్రముఖ నిర్మాత, వైజ‌యంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీద‌త్ రూ. 20 ల‌క్షలు విరాళం ప్రక‌టించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స‌హాయ నిధికి రూ. 10 ల‌క్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్షలు అంద‌జేస్తున్నట్లు తెలిపారు. క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాయ‌ని ప్రశంసించిన అశ్వినీద‌త్‌.. ప్రభుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్రజ‌లంద‌రూ త‌ప్పకుండా పాటించాల‌ని కోరారు. కుటుంబాల‌ను ప‌క్కన‌పెట్టి మ‌రీ పోలీసులు, వైద్య సిబ్బంది అలుప‌నేది లేకుండా ప్రజ‌లకు సేవ చేస్తున్నార‌ని కొనియాడారు. వాళ్ల శ్రమ వృథా కాకుండా ఉండాలంటే.. ఈ విప‌త్కర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాల‌ని, అంద‌రూ ఇళ్లల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశారు. మరోవైపు హీరో సుధీర్ బాబు కూడా వి

‘మోస‌గాళ్లు’ షూటింగ్ నిలిపివేసిన మంచు విష్ణు.. కాస్త ఆలస్యమైనట్టుంది!

Image
మంచు విష్ణు ప్రస్తుతం ‘మోస‌గాళ్లు’ అనే హాలీవుడ్‌-ఇండియ‌న్ సినిమా చేస్తున్న విష‌యం విదిత‌మే. ఈ చిత్రం కోసం ఆయ‌న కూక‌ట్‌ప‌ల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ను నిర్మించారు. ఇప్పుడ‌క్కడ ఎడారి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంతో రూపొందుతున్న ‘మోస‌గాళ్లు’ సినిమా షూటింగ్ 2019 మొద‌ట్లో ఆరంభ‌మైంది. లాస్ ఏంజెల్స్‌, హైద‌రాబాద్ ప్రాంతాల మ‌ధ్య వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటూ వ‌స్తున్న ‘మోసగాళ్లు’ చిత్రం.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధ చ‌ర్యల్లో భాగంగా లాక్‌డౌన్ ప్రక‌టించ‌డంతో పూర్తిగా ఆగిపోయింది. ఈ షెడ్యూల్‌లో విష్ణుతో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి త‌దిత‌రులు పాల్గొన‌గా ప్రధాన స‌న్నివేశాలు, క్లైమాక్స్ యాక్షన్ సీన్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే, చిత్రానికి అతి కీల‌క‌మైన ఐటీ ఆఫీస్ సన్నివేశాల చిత్రీకరణ లాక్‌డౌన్ కార‌ణంగా నిర‌వ‌ధికంగా ఆగిపోయింది. ‘మోస‌గాళ్లు’ చిత్రీక‌ర‌ణ ఆగిపోయిన విష‌యం చిత్ర బృందం ధ్రువీక‌రిస్తూ, ప్రతి యూనిట్ మెంబ‌ర్ క్షేమం దృష్ట్యా చిత్రీక‌ర‌ణ నిలిపివేశామ‌ని, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న విప‌త్

రోజులో వందసార్లు నన్ను లం** అంటున్నారు తెలుగువాళ్లు: సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్

Image
శ్రావ్యమైన గొంతుతో పాటలు వినిపించడమే కాదు.. సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సింగర్స్‌ . 2002 నుంచి 2020 వరకూ తెలుగులో ఎన్నో మధుర గీతాలను ఆలపించిన చిన్మయి.. తెలుగు ప్రేక్షకులు తనను బూతులు తిడుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘తెలుగు వాళ్లు సోషల్ మీడియాలో నాపై చేసే కామెంట్స్ చూస్తే తెలుస్తుంది కదా.. నాకు తెలుగు చదవడం వచ్చింది ఈ బూతులు వల్ల.. అవన్నీ నాకు అర్థమయ్యాయి. నన్ను లం**** అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. చాలా టిపికల్ పదాలు అవి. ఛీ.. అయ్యయ్యో అంటున్నారు కాని రోజులో యాభై, వందకి పైగా నన్ను లం**** అంటున్నారు. రోజూ వందకు పైగా నన్ను అదే చేస్తున్నారు. దీన్ని బట్టి తెలుగు సోషల్ మీడియా జనరల్ డీఫాల్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అబ్బాయిలు అంతా మాట్లాడితే ఈ వర్డ్ యూజ్ చేస్తారు. ల***ము** అనే మాట తప్ప ఇంకేం రాదు. ఇక తెలుగు తమిళ్‌కి పెద్దగా తేడా లేదు.. అక్కడా అదే అంటారు.. ఇక్కడా అదే అంటారు. ఓవరాల్ ఇండియా మొత్తం కామన్ అయిపోయింది ఈ పదం. హిందీలో దానికి పదాలు ఉన్నాయి. సేమ్ తెలుగులో కూడా అంతే. బట్ ఐ డోన్ట్ కేర్. వాళ్లు వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అంతే అని వదిలేస్తున్న

RRR రామరాజు వచ్చాడహో.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో

Image
ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటాది.. కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టు ఉంటుంది. ఎదురు బడితే చావుకైనా చెమట దారబడతది.. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెందొర అల్లూరి సీతా రామరాజు’ అంటూ ఎన్టీఆర్ డైలాగ్‌లో ప్రారంభమైన ఈవీడియోలో తేజ్.. అల్లూరిగా అదరగొట్టాడు. ఇలాంటి వీడియో కోసం గంటలు కాదు.. ఎన్ని రోజులు అయినా వేచి చూడొచ్చనేంతగా ఔట్ పుట్ ఇచ్చి దటీజ్ జక్కన్న అనిపించారు. అల్లూరిని చూడని వాళ్లకు అల్లూరి అంటే ఇలాగే ఉండేవారా అన్నంతగా అద్భుతంగా చూపించారు. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడుకునేట్టు ఉన్నాయి. గురువారం రాత్రి 7.18 నిమిషాలౌతోంది.. ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ‘సోదర రామ్ చరణ్, మంచి పరిస్థితుల్లో నీ పుట్టినరోజును జరుపుకోవాలని నేను భావించాను. కానీ, ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఎందుకంటే, ఇంటిలో ఉండటమే ఇప్పుడు ముఖ్యం. రేపు ఉదయం 10 గంటలకు నీకొక డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము, ఇది నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప అనుభూతి అవుతుంది. రామరాజు కోసం భీమ్’ అంటూ ట్వీట్ చేయడంతో ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ట్వీట్ పెట్టగానే ట్విట్టర్‌లో RRR మోత మొదలైంది. ఈ సీతార