కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ గౌతమ్... లైవ్‌లో మాట్లాడుతూ ఏడ్చేసిన జబర్దస్త్ బ్యూటీ

కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపత్యంలో సెలబ్రిటీలంతా స్పందిస్తున్నారు. ప్రజలంతా క్షేమంగా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పలువురు టీవీ నటులు, ప్రముఖ యాంకర్లు కూడా ప్రస్తుతమున్న పరిస్థితులపై స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమ్... లాక్ డౌన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికి కొన్ని ప్లేసుల్లో పేదలకు ఎలాంటి సహాయం అందడం లేదు. దీంతో ఈ విషయమై రష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది పేదలకు తినడానికి సరిగా ఫుడ్ కూడా దొరకడం లేదని పేర్కొంది. దయచేసి అందరూ విరాళాలు ఇవ్వాలని కోరింది. ఎవరికి చేతనైనంత సాయం వారు చేయాలని కోరింది. కనీసం ఒక్క రూపాయి ఇచ్చినా చాలు అని రష్మీ వేడుకోంది. విరాళాలు అంటే పెద్ద మొత్తంలో మాత్రమే చెల్లించాల్సిన అవసరం లేదని, చాలా మంది కలిసి ఒక్కో రూపాయి సాయం చేసినా చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. పేదవారు తిండికి దూరమవుతున్నారంటూ రష్మీ ఫేస్ బుక్‌లో లైవ్‌‌లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్లీజ్ ప్రీజ్ అంటూ అందర్నీ బతిమాలింది. మన ఇంటి పరిసరాల్లో ఉండే పేదలకు కూడా సాయం చేద్దామని పిలుపునిచ్చింది. పేదలతో పాటు మూగజీవాల పట్ల మానవత్వంగా ఉండాలని ఈ సందర్భంగా రష్మీ కోరింది. మూగజీవాల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు తోచిన సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. తాజాగా రష్మీ శునకాల కోసం కొంత ఆహారాన్ని సిద్ధం చేసింది. తన దగ్గర్లో ఉన్న ప్రాంతాలకు కుక్కల కోసం ఆహారాన్ని అందించింది. అంతే కాకుండా పీఎం కేర్స్ ఫండ్‌కు రష్మీ రూ. 25వేలు విరాళంగా ఇచ్చింది సమాజంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితులను తాను ఎన్నడూ చూడలేదంది ఈ జబర్దస్త్ భామ. కానీ ఇలాంటి ఆపద సమయంలో మానవత్వాన్ని చాటుకొని విరాళాలు ప్రకటిస్తోన్న వారికి కృతజ్ఞతలు చెప్పింది. రష్మీ చేస్తున్న ఈ పని పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ