సినీ కార్మికులకు నాని, బన్నీ విరాళం.. ప్రభుత్వాలకు నారా రోహిత్ రూ.30 లక్షల సాయం

కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో తన వంతుగా రూ. 30 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అందరూ తప్పకుండా పాటించాలని ప్రజలను ఆయన కోరారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీ రామరక్ష అన్నారు. అందరం సమష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. మరోవైపు, ఈ లాక్‌డౌన్ కాలంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఛారిటీకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.20 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రా ముఖ్యమంత్రుల సహాయ నిధులకు మొత్తం రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు సీసీసీకి మరో రూ.20 లక్షలు అందజేశారు. దీంతో ఆయన విరాళం మొత్తం రూ.1.45 కోట్లకు చేరింది. Also Read: ఇదిలా ఉంటే.. పేద సినీ కళాకారులు, కార్మికులను ఆదుకోవడంలో యువ కథానాయకుడు సందీప్ కిషన్ భాగస్వాములయ్యారు. కరోనా క్రైసిస్ చారిటీకి తన వంతు సాయంగా సందీప్ కిషన్ రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో పాటు ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్లలో పనిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగులను సైతం ఆయన చూసుకుంటున్నారు. మరో హీరో సుశాంత్ కరోనా క్రైసిస్ చారిటీకి రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే, షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది సీసీసీకి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. ఇక వెన్నెల కిషోర్ రూ.2 లక్షలు, సంపూర్ణేష్ బాబు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
Comments
Post a Comment