కమల్‌పై కరోనా వదంతులు.. కారణం గౌతమీనా!!

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకిందని, ఆయన తన ఇంట్లోనే నిర్బంధంలోనే ఉన్నారని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దానికి కారణం చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లోని ఆయన ఇంటికి చెన్నై కార్పోరేషన్ వాళ్లు అతికించిన ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్. కమల్ హాసన్ ఇంటికి ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్ అతికించగానే వదంతలు మొదలైపోయాయి. దీంతో కమల్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కమల్‌కు కరోనా పాజిటివ్ అనే వదంతలు రావడంతో వెంటనే ఆ స్టిక్కర్‌ను కార్పోరేషన్ వాళ్లు తొలగించారు. అభిమానులు ఆందోళనకు గురవుతోన్న విషయం తెలిసి కమల్ హాసన్ కూడా స్పందించారు. తనకు కరోనా సోకింది అనే వదంతులో నిజం లేదని స్పష్టం చేశారు. అసలు ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్ అతికించిన ఇంటిలో కొన్నేళ్లుగా తాను ఉండటం లేదని చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీసుగా వినియోగిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ పేర్కొన్నారు. Also Read: అయితే, కమల్ ఇచ్చిన వివరణ తర్వాత చాలా మందిలో ఒక అనుమానం తలెత్తింది. అసలు కమల్ ఇంటికి ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్ ఎందకు అతికించారనే ప్రశ్న తలెత్తింది. దీనికి చెన్నై కార్పోరేషన్ వివరణ ఇచ్చింది. దీనికి కారణం కమల్ మాజీ భార్య గౌతమి. నటి గౌతమితో ఆల్వార్‌పేట్ ఇంట్లోనే కమల్ ఉండేవారు. 13 ఏళ్లపాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2016లో విడిపోయారు. ఆ తరవాత ఆమె ఆ ఇంటిని ఖాళీ చేశారు. కానీ, గౌతమి పాస్ పోర్ట్‌పై ఇప్పటికే అదే ఇంటి అడ్రస్ ఉంది. ఇటీవల గౌతమి దుబాయ్ నుంచి చెన్నైకు తిరిగొచ్చారు. దీంతో ఆమె పాస్‌ పోర్ట్‌పై ఉన్న అడ్రస్ ఆధారంగా కమల్ ఇంటికి కార్పోరేషన్ వాళ్లు స్టిక్కర్ అతికించేశారు. పొరపాటు జరిగిందని తెలిసి కాసేపటి తరవాత తొలగించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ