సినీ కార్మికులకు కోటి విరాళం ఇచ్చిన నాగార్జున

కరోనా వైరస్ ప్రభావం కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో ఏప్రిల్ 14 వరకు ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటికి రావడానికి వీళ్లేదు. కాబట్టి, అప్పటి వరకు షూటింగ్స్ అన్నీ బంద్. ఆ తరవాత కూడా ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేదు. సినిమా షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల ఆ ప్రభావం వాటి మీద ఆధారపడి బతికే సినీ కార్మికులపై పడింది. రోజువారీ వేతనానికి పనిచేసే చాలా మంది సినీ కార్మికులు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఇప్పటికే చాలా మంది సినీ పెద్దలు విరాళాలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సహాయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాటలోనే కింగ్ నాగార్జున నడిచారు. సినీ వర్కర్స్ సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ మనకి అత్యంత అవసమని, అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి డి.సురేష్ బాబు, వెంకటేష్, రానా సంయుక్తంగా కోటి రూపాయలు ప్రకటించారు. క‌రోనా వ్యాప్తి నిరోధంలో నిరంత‌రం శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద క‌ళాకారులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేశ్ ప్రొడ‌క్షన్స్‌ తరఫున కోటి రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంతకు ముందు, సినీ కార్మికుల సంక్షేమం కోసం మహేష్ బాబు రూ.25 లక్షలు ప్రకటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కూడా తమ వంతు సాయాన్ని అందించారు. హీరో రాజశేఖర్ తన ఫౌండేషన్ తరఫున పేద సినీ కళాకారులు, కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూరగాయలను అందిస్తున్నారు. ఇలా, ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు తమవారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ