మొత్తం రూ. 6.2 కోట్లు.. ఛారిటీ లెక్కలు చెప్పిన చిరంజీవి

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. వీటిలో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పెద్దలందరూ కలిసి ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేశారు. దీనికి విరాళాలు అందించాల్సిందిగా సినీ ప్రముఖులను స్వయంగా చిరంజీవి అభ్యర్థించారు. చిరంజీవి స్వయంగా ఈ ఛారిటీకి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు తెలుగు సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చారు. ఎవరి శక్తిమేర వారు విరాళాలు అందజేశారు. మార్చి 28న ఈ ఛారిటీని ఏర్పాటు చేయగా నాలుగు రోజుల్లో రూ.6.2 కోట్ల విరాళాలు అందాయి. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా రూ.6.2 కోట్లు సేకరించాం. ఈ నిధికి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నా’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎవరైనా విరాళాలు ఇవ్వాలని భావిస్తే తమ కరోనా క్రైసిస్ ఛారిటీ స్పెషల్ సేవింగ్ అకౌంట్‌కు పంపొచ్చన్నారు. ఈ మేరకు విరాళాలు పంపాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలు వెల్లడించారు. బ్యాంక్: ఐసీఐసీఐ, బంజారాహిల్స్ బ్రాంచ్, అకౌంట్ నంబర్: 0076 01 019951, ఐఎఫ్ఎస్‌సీ కోడ్: ICIC0000076. కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ఇచ్చినవారి వివరాలు ✦ చిరంజీవి - కోటి రూపాయలు ✦ నాగార్జున - కోటి రూపాయలు ✦ ప్రభాస్ - రూ.50 లక్షలు ✦ రామ్ చరణ్ - రూ. 30 లక్షలు ✦ నాని - రూ. 30 లక్షలు ✦ ఎన్టీఆర్ - రూ. 25 లక్షలు ✦ నాగచైతన్య - రూ. 25 లక్షలు ✦ అల్లు అర్జున్ - రూ. 20 లక్షలు ✦ వరుణ్ తేజ్ - రూ. 20 లక్షలు ✦ రవితేజ - రూ. 20 లక్షలు ✦ శర్వానంద్ - రూ. 15 లక్షలు ✦ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - రూ. 10 లక్షలు ✦ యూవీ క్రియేషన్స్ - రూ. 10 లక్షలు ✦ సాయిధరమ్ తేజ్ - రూ. 10 లక్షలు ✦ విశ్వక్ సేన్ - రూ. 5 లక్షలు ✦ శ్రీకాంత్ - రూ. 5 లక్షలు ✦ శ్రీమిత్ర చౌదరి - రూ. 5 లక్షలు ✦ సుశాంత్ - రూ. 2 లక్షలు ✦ కార్తికేయ - రూ. 2 లక్షలు ✦ వెన్నెల కిషోర్ - రూ. 2 లక్షలు ✦ సప్తగిరి - రూ. 2 లక్షలు ✦ లావణ్య త్రిపాఠి - రూ. 1 లక్ష ✦ సంపూర్ణేష్ బాబు - రూ. 1 లక్ష ✦ బ్రహ్మాజీ - రూ. 70వేలు గమనిక: చిరంజీవి ట్వీట్ చేసిన వివరాల ఆధారంగా విరాళాలు ఇచ్చినవారి పేర్లను పేర్కొన్నాం. ఇంకా విరాళాలు ఇచ్చినవాళ్లు ఉండొచ్చు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ