సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రతిష్టాత్మక వరించింది. సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా రజనీకాంత్ నిలిచారు. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. "సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కిందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించ దగినవి. రజనీకాంత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు" అని ప్రకాశ్ జావడేకర్ ట్వీట్ చేశారు. రజనీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. Also Read: భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందిస్తుంటారు. గతంలో దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి,