ఆవేశంతో ఊగిపోయిన సాయి ధరమ్ తేజ్.. మమ్మల్ని ఆపాలని చూశారు.. రామ్ చరణ్ బర్త్ డే వేడుకలో షాకింగ్ కామెంట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఒకరోజు ముందుగానే హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మెగా అభిమానులు. రేపు (మార్చి 27) రామ్ చరణ్ బర్త్ డే కావడంతో హైదరాబాద్ శిల్పకళావేదికలో మెగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా మేనల్లుళ్లు , వైష్ణవ్ తేజ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ కాస్త ఆవేశంగా మాట్లాడారు. ఎప్పుడూ శాంతంగా వివాదాల జోలికిపోకుండా తన పని తాను చూసుకునిపోయే సాయి ధరమ్ తేజ్ తొలిసారి మెగాఫ్యామిలీ హీరోలపై వస్తున్న కామెంట్లపై సీరియస్‌గా స్పందించారు. ‘2004-2005’ టైంలో మెగాస్టార్ బర్త్ డే వేడుకలను తాను చూసినప్పుడు ఈ రేంజ్‌లో మళ్లీ ఏ హీరోకి అయినా బర్త్ డే వేడుకలు జరుగుతాయా? అని అనుకునేవాడిని. కానీ 2021లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మా బావకి జరిగింది. ఇది ఫ్యాన్స్ వల్లే సాధ్యం అయ్యింది. మా మామయ్య తరువాత ఆ ప్లేస్‌లో అంత ప్రేమను మా చరణ్‌కి ఇస్తున్నారు. చాలా థాంక్స్.. అని మాట్లాడారు. అయితే ఎప్పుడైతే మెగాస్టార్ తరువాత మెగాస్టార్ పవర్ స్టార్ అని సాయి ధరమ్ తేజ్ అన్నారో.. ఇక పవన్ స్టార్ అభిమానులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. సాయి ధరమ్‌ తేజ్‌ని మాట్లాడకుండా చేసి ఎప్పటిలాగే రచ్చ రచ్చ చేశారు. పవర్ స్టార్ పవర్ స్టార్ అని నినాదాలు చేయడంతో.. మెగాస్టార్, పవర్ స్టార్ బ్లెస్సింగ్స్ వల్లే రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అయ్యారు అని సర్ధిచెప్పడంతో కాస్త శాంతించారు. ఆ తరువాత స్పీచ్ కంటిన్యూ చేసినా పవన్ అభిమానుల రచ్చ మాత్రం ఆపలేదు. అయితే ‘మీరు ఇలా గోల చేస్తే మొత్తం మర్చిపోతా.. వెళ్లిపోతా ఇలా అయితే అని చాలాసార్లు చెప్పారు సాయి ధరమ్ తేజ్.. అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ మానకపోవడంతో.. సాయి ధరమ్ తేజ్ మాట్లాడటం మానేసి కాసేపు సైలెంట్‌గా ఉండిపోయారు. తన కథను చెప్పుకుంటూ పోయారు సాయి ధరమ్ తేజ్. ‘ఒక మారుమూల గ్రామం.. దూరంలో ఒక చెట్టు ఉంది.. దానికి మామిడి కాయలు పండి ఉన్నాయి.. ఒక స్కూల్ టీచర్.. కొంతమంది పిల్లలు కొంతదూరంలో ఉన్నారు.. ఆ చెట్టు దగ్గరకు ఒక దారి ఉంది.. ఆ స్కూల్ టీచర్.. ఎవరైతే ఆ చెట్టు దగ్గరకు వెళ్తారో ఆ చెట్టు కాయలు మీకే అని దశనిర్ధేశం చేస్తారు. ఆ పిల్లల్లో ఒకరు ఫాస్ట్‌గా వెళ్తున్నారు మరికొంతమంది స్లోగా వెళ్తున్నారు. వాళ్లలో ఎవరు ఆ చెట్టుదగ్గరకు చేరుకుంటారని ఆ గ్రామంలో ఉన్న వాళ్లు ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్లలో చాలా మంది వీళ్లెక్కడి పోతారులే అనుకుంటున్నారు. వీళ్ల దగ్గర ఏముందిలే అని అనుకుంటున్నారు. వాళ్ల మీద బెట్‌లు కడుతున్నారు. కానీ ఆ పిల్లలు సర్ ప్రైజ్‌గా ఏం చేశారంటే ఒకరి చేయి ఒకరు పట్టుకుని చెట్టుదగ్గరకు వెళ్లి కాయల్ని అందరూ షేర్ చేసుకున్నారు. ఆ పిల్లలు ఎవరూ కాదు.. మెగా హీరోలం.. మమ్మల్ని ఆపాలని చూశారో.. మాపైన మా ఫ్యామిలీపైన నెగిటివ్‌గా మాట్లాడారో వాళ్లు ఎవరో మీకు తెలుసు.. ఆ మహావృక్షం చిరంజీవి గారు. మాకు దారి వేసింది చిరంజీవి గారు. మమ్మల్ని నడిపించేది ఆయనే. ఎంతమంది మమ్మల్ని ద్వేషించినా తిట్టినా.. ఏం చేసినా మేం వాటిని పట్టించుకోకుండా మేం ఇచ్చేది ప్రేమ ఒక్కటే.. ప్రేమిస్తూనే ఉంటాము. మెగా ఫ్యామిలీ ఎప్పుడూ అభిమానుల్ని ప్రేమిస్తూనే ఉంటుంది.. వాళ్లకి ప్రేమను ఇవ్వడం కోసమే ఉంది.. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్‌గా జరగడానికి కారణం మెగా ఫ్యాన్స్.. మీకు ఎప్పటికీ దాసులుగా ఉంటా.. జైహింద్’ అంటూ పవన్ తరహాలో ఊగిపోతూ తన శైలికి విరుద్ధంగా స్పీచ్ ఇచ్చి అభిమానుల్ని ఉత్సాహపరిచారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ