సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ మలయాళ నటి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 74సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 22) కేరళలోని త్రిపుణితురలో తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. దాదాపు 50 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఆమె 550కి పైగా సినిమాల్లో నటించారు. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించారు ఈ లెజండరీ నటి. చివరిగా కేరళకు చెందిన సంగీత నాటక అకాడమీకి ఆమె ఛైర్ పర్సన్‌గా ఆమె పనిచేశారు. లలిత నటనకు గాను రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర పురస్కారాలు లభించాయి. మలయాళ చిత్ర నిర్మాత భరతన్‌ను పెళ్లాడింది లలిత. వీరికి సిద్ధార్థ్ భరతన్ అనే కుమారుడు, శ్రీకుట్టి భరతన్ ఆమె కుమార్తె ఉన్నారు. లలిత మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లలిత మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు.
Comments
Post a Comment