కొడాలి నానిని హీరోగా పెట్టి సినిమా తీయండి.. వైసీపీ ప్రభుత్వంపై నాగబాబు ఫైర్

రీసెంట్‌గా విడుదలైన 'భీమ్లా నాయక్' సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. తెలంగాణ సహా ఓవర్‌సీస్ మార్కెట్‌లో దుమ్ముదులుపుతోంది. అయితే ఒక్క ఆంధ్ర ఏరియాలో మాత్రం చెప్పుకోదగిన కలెక్షన్స్ రావడం లేదు. దీనికి ప్రధాన కారణం టికెట్ల రేట్ల తగ్గింపు. తాజాగా ఈ విషయమై మరోసారి భగ్గుమన్నారు. ‘భీమ్లా నాయక్’పై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తప్పుపడుతూ ఓ వీడియో ద్వారా నిప్పులు చెరిగారు. కొడాలి నానిని హీరోగా పెట్టి సినిమా తీయండి అంటూ సెటైర్స్ వేశారు. వైసీపీ ప్రభుత్వానికి, ఆ మంత్రులకు సినిమా వాళ్ళ ఆపరేషన్స్ గురించి తెలియదని.. సామాన్యుడికి టిక్కెట్ ధర అందుబాటులో ఉండాలనే విషయాన్ని తాను కూడా ఏకీభవిస్తున్నానని అన్నారు. టోటల్ సినిమా బడ్జెట్‌లో హీరోల రెమ్యునరేషన్‌లు 10 లేదా 12 పర్సెంట్ ఉంటుంది. అజ్ఞానపు మాటలు మాట్లాడే వాళ్లకు సినిమా మేకింగ్ గురించి ఏం అర్థమవుతుందంటూ ఫైర్ అయ్యారు నాగబాబు. సినిమాకు నష్టం వాటిల్లితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళు కూడా రెమ్యునరేషన్ తగ్గించడమో వెనక్కి ఇవ్వడమో జరిగింది. అలా అని అందరూ మెడలో బోర్డులు వేసుకొని తిరగరు. ఏ హిరో అయినా సినిమా బాగా బిజినెస్ అయితేనే రెమ్యునరేషన్ తీసుకుంటారు. హీరోని బట్టే సినిమా వ్యాపారం జరుగుతుంది కానీ హీరోయిన్ వల్లో మిగతా క్యాస్టింగ్ వల్ల కాదు. ఒక సినిమా ప్లాప్ అయితే హిరోదే హైయెస్ట్ రిస్క్. హిరో ఒక సినిమాకీ హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటే, నెక్స్ట్ సినిమా ప్లాప్ అయితే 50పర్సంట్ కూడా ఇవ్వరు. కేవలం డిమాండ్‌ను బట్టే వ్యాపారం అని చెబుతూ జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు నాగబాబు. పవన్ కళ్యాణ్‌ని అణగ దొక్కేయాలనేదే మీ పర్సనల్ ఎజెండా. మీకు పడని వర్గం వాళ్ల హీరోల ఆర్థిక మూలాలను కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారు. ఆంధ్రలో ఎవ్వరూ ఏ వ్యాపారం చేసుకున్నా కూడా ఆ వ్యాపారాన్ని మీరే తీసేసుకుంటున్నారు. మీరే వెల్లంపల్లి శ్రీను, లాంటి వాళ్ళను హీరోలుగా పెట్టి సినిమాలు తీయండి మరి. దాని వల్ల ఆంధ్రలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. మీ ఎమ్మెల్యేలు, ఎంపీల నటన కంటే మేమేమీ పెద్ద నటులం కాదు. తెలుగు సినిమాని ఆంధ్రలో బ్యాన్ చెయ్యండి. మాకు నష్టం లేదు. టెక్నాలజీ డెవలప్ అయ్యింది కాబట్టి యూట్యూబ్ లో, ఓటిటిలతో డిజిటల్ లోనో మాకు డబ్బులు వస్తాయి. చిరంజీవిగారు కొంతమంది హీరోలతో వెళ్లి జగన్ గారితో మాట్లాడారు. మరి జీవో ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు? జీవో ఇవ్వకుండా పాత జీవోనే కంటిన్యూ చేయడం వల్ల.. అయ్యా అంటూ పవన్ కళ్యాణ్, మేమందరం వస్తామనుకున్నారా? అది జరగని పని అంటూ తనదైన కోణంలో ఏపీ ప్రభుత్వ తీరుపై సెటైర్స్ వేశారు నాగబాబు. వైసీపీ ప్రభుత్వం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఇప్పటిదాకా ఒరిగిందేమీ లేదని అన్నారు. చిరంజీవి గారు తన హుందా తనాన్ని పక్కన పెట్టి ఆత్మ గౌరవాన్ని తగ్గించుకొని ఇండస్ట్రీనీ నమ్ముకున్న లక్షలాది కార్మికుల కోసం సీఎం దగ్గరకు వెళ్లారు. కానీ వైసీపీ వారు ఓ భ్రమలో బతుకుతున్నారు. మీరు కేవలం 5 సంవత్సరాల మాత్రమే ఉండే ప్రజా ప్రతినిధులు. మీలాంటి వాళ్ళు ఉంటారనే అంబేద్కర్ గారు అయిదు సంవత్సరాల కొకసారి ఎలక్షన్స్ పెట్టమన్నది. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా బాగుపడలేదు. సినిమా వాళ్లకు ఒకటే నా రిక్వెస్ట్.. నిర్మాతలెవరూ భయపడకండి. అవసరమైతే ఆంధ్రాలో సినిమా రిలీజ్ కట్ చేసుకొని జియోగ్రాఫికల్ రిలీజ్ చేద్దాం. అది కూడా అయితే ఈ వైసీపీ వాళ్ళు ఆపలేరుగా అన్నారు నాగబాబు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ