నా జీవితంలోని బిగ్గెస్ట్ మిస్టరీల్లో ఇదొకటి! ప్రభుత్వాలపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్

విషయం ఏదైనా సరే కుండబద్దలు కొట్టాలంటే తర్వాతే ఎవరైనా. అను నిత్యం సమాజాన్ని పరిశీలిస్తూ జనం పోకడ, ప్రభుత్వాల తీరుపై ఓ కన్నేయడం ఆర్జీవీ నైజం. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో వార్తల్లో నిలవడమే కాదు సమాజ పరిస్థితులపై రియాక్ట్ అవుతూ పతాక శీర్షికల్లో పేరు రాయించుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలోనే తాజాగా పలు రాష్ట్రాల్లో విధించిన నైట్ కర్ఫ్యూపై రియాక్ట్ అవుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు రామ్ గోపాల్ వర్మ. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో విలవిల్లాడిపోయిన భారతదేశాన్ని మరోసారి రూపంలో వణికిస్తోంది కరోనా వైరస్. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు ప్రజల్లో ఆందోళన నింపుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ సూచనలతో పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. మహారాష్ట్ర సహా హర్యానా, గుజరాత్, యూపీ, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలు విధించాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఇదే ఇష్యూపై ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్ రియాక్షన్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ''రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విదిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతుందా? నా జీవితంలో బిగ్గెస్ట్ మిస్టరీ అంటే ఇదే'' అంటూ ప్రభుత్వాలపై పరోక్షంగా సెటైర్స్ వేశారు వర్మ. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్ 'వావ్.. గుడ్ లాజిక్ వర్మ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆయనపైనే తిరిగి కౌంటర్లు వేస్తున్నారు. ఇక దీనిపై ''వైరస్ నిద్రపోకుండా నైట్ మొత్తం పోలీసులు కాపు కాస్తారు.. కాబట్టి పగలు వైరస్ నిద్రపోయి స్ప్రెడ్ అవ్వకుండా పడుకుంటుందని ప్రభుత్వాల నమ్మకం. ఈ మాత్రం తె‌లీకుండా క్రియేటివ్ ఫీల్డులో ఎలా ఉన్నారండీ బాబు'' అంటూ వర్మ ట్వీట్‌పై ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ పలు చర్చలకు తెరలేపింది. అలా ఈ ఇష్యూకి ఆజ్యం పోసిన ఆర్జీవీ మరో ట్వీట్ పెట్టి దీన్ని హాట్ టాపిక్ చేసేశారు. ''ఇంతకుముందు నేను పెట్టిన ట్వీట్‌కి క్షమాపణలు కోరుతున్నాను. ఎందుకంటే ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల మధ్య వైరస్‌లు నిద్రపోతాయని రాజకీయ నాయకులకు దేవుడు చెప్పాడని నాకు ఇప్పుడే తెలిసింది'' అంటూ మరో పవర్‌ఫుల్ కౌంటర్ వేసేశారు వర్మ. ఎంతైనా ఆర్జీవీ రూటే సపరేటు లెండి!.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ