Tollywood Drugs Case : దూకుడు పెంచిన ఈడీ.. పూరి వస్తాడా?

టాలీవుడ్ విచారణను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగా సిట్‌ అధికారి శ్రీనివాస్‌ నుంచి మరిన్ని వివరాలు సేకరించారని తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. టాలీవుడ్ సెలెబ్రిటీలకు నోటీసులను పంపించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి దఫాల వారిగా ఒక్కొక్కరినీ ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో రేపు దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రశ్నించనుంది. అయితే హాజరు అవుతారా? అన్నది ప్రశ్న. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండటం లేదు. గత ఏడాది కరోనా, లాక్డౌన్ నుంచి ముంబైలోనే ఉంటున్నారు. మరి ఆయన ఈడీ నోటీసుల మేరకు రేపు విచారణకు హాజరు అవుతారా? అన్నది అనుమానమే. మామూలుగా అయితే ఆగస్టు 31న ప్రారంభమయ్యే ఈ విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసాగనుంది. సినీ రంగానికి చెందిన 12మందికి ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న ఛార్మీ, సెప్టెంబర్ 6న రకుల్, సెప్టెంబర్ 8న రానా, సెప్టెంబర్ 9న రవితేజ, సెప్టెంబర్ 9న రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, సెప్టెంబర్ 13న నవదీప్, సెప్టెంబర్ 13న ఎఫ్ క్లబ్ జీఎం, సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 20న నందు, సెప్టెంబర్ 22న తరుణ్ హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 11 నేరాభియోగపత్రాలు దాఖలు చేశారు. అభియోగపత్రాల్లో ఆఫ్రికా దేశాలకు చెందిన మత్తు మందు సరఫరాదారులతో పాటు.. స్థానికంగా డ్రగ్స్ విక్రయించే వ్యక్తులున్నారు. ప్రస్తుతం మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి 12మంది సినీరంగానికి చెందిన వాళ్లను సాక్ష్యాలుగానే ప్రశ్నించే అవకాశం ఉంది. మనీలాండరింగ్ జరిగినట్లు తేలితే సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ