Drugs Case: ఈడీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్.. అనుకున్న సమయం కంటే ముందుగానే..
నాలుగు సంవత్సరాల క్రితం టాలీవుడ్‌ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీలను ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ చేసింది. ఇందులో ప్రధానంగా దర్శకుడు , రవితేజ, నవదీప్, హీరోయిన్ ఛార్మి తదితరులు అప్పుడు విచారణకు హాజరు అయ్యారు. పలువురు టెక్నిషన్ల కూడా ఈ విచారణకు హాజరయ్యారు. ఇందులో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అప్పుడు ఆరోపణలు ఎదురుకున్న సెలబ్రిటీలు అందరికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరక్టరేట్(ఈడీ) రీసెంట్‌గా సమన్లు పంపించింది. ఈ కేసుపై నేటి(ఆగస్టు 31) నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటులు రానా, రవితేజ తదితరులకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారణకు అహ్వానించింది ఈడీ. ఆయన్ని 10.30కు విచారణకు రావాలని ఆహ్వానించగా.. పూరీ కాస్త ముందుగానే 10.05కే విచారణకు వచ్చారు. ఇక ఈడీ కార్యాలయం ముందు ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఈ విచారణ దాదాపు మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసాగతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్-క్లబ్ పబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్‌ఖాన్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి సెలబ్రెటీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు పెద్దమొత్తంలో నిధులు మళ్లించినట్టు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. మరి ఈడీ విచారణలో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయో.. వేచి చూడాల్సిందే మరి.
Comments
Post a Comment