సేవ్ సినిమా.. రివ్యూ రైటర్స్‌కి బ్రహ్మాజీ అభ్యర్థన! అలా చేయండంటూ నేరుగా చెప్పిన యాక్టర్

సినిమా అనే రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే. నిర్మాత, దర్శకుడు మొదలుకొని చిత్ర నిర్మాణంలో భాగమయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరిపై ఒక్కో బాధ్యత ఉంటుంది. ఎవరికి వారు వారి వారి పనులకు న్యాయం చేస్తేనే అనుకున్న అవుట్‌పుట్ బయటకొస్తుంది. ఇక ఆ సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో రివ్యూ రైటర్స్‌ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. మూవీ రిలీజ్ అయ్యాక రివ్యూ రైటర్స్ సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని సినిమాపై వారి వారి ఒపీనియన్స్ బయటపెడుతుంటారు. హీరో హీరోయిన్ల నటనతో పాటు దర్శకుడి ప్రతిభ, నిర్మాణ విలువలు, సాంకేతిక నిపుణుల పనితీరుపై ఓ వివరణ ఇస్తుంటారు. ఇవన్నీ కూడా సినిమా హిట్ కావడం, కాకపోవడంపై ఎంతోకొంత ప్రభావం చూపుతుంటాయి. అయితే తాజా పరిస్థితుల నడుమ సీనియర్ నటుడు రివ్యూ రైటర్స్‌కి బ్రహ్మాజీ ఓ అభ్యర్థన పెట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ''ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాలను థియేటర్‌కి రప్పించండి. లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు.. సినిమా చూడడానికి థియేటర్స్ ఉండవు.. సేవ్ సినిమా సేవ్ థియేటర్స్. థాంక్యూ'' అని పేర్కొంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. ఆయన చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజే విడుదలైన 'తిమ్మరుసు' సినిమాలో కీలక పాత్ర పోహ్సించారు బ్రహ్మాజీ. ఆయన చేసిన కామెడీ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయిందని తెలుస్తోంది. ఈ మేరకు 'తిమ్మరుసు'పై ఇప్పటివరకు వచ్చిన ట్విట్టర్ రెస్పాన్స్ పోస్ట్ చేస్తూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు బ్రహ్మాజీ.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ