రాజ్ తరుణ్ సినిమాలోని పాటని విడుదల చేసిన విజయ్.. ‘థాంక్యూ బ్రో’ అన్న యువ హీరో

ఈ మధ్యకాలంలో ఓ హీరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లను మరో హీరోలతో విడుదల చేయించడం చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా సోషల్‌మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇది సహజంగా మారింది. తమ సినిమాకు పాపులారిటీ పెంచుకొనేందుకు మంచి క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాకు సంబంధించిన పోస్టర్లు కానీ, పాటలు కానీ, టీజర్ కానీ విడుదల చేయిస్తున్నాయి చిత్ర యూనిట్లు. చిన్న హీరోల విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. తాజాగా తన సినిమా పాటను విడుదల చేసినందుకు హీరో విజయ్ దేవరకొండకు హీరో థాంక్స్ చెప్పాడు. రాజ్ తరుణ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టినా కూడా ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా మారాడు. అలా కెరీర్ ప్రారంభంలోనే మంచి హిట్లు పడ్డాయి. వరుస బ్లాక్ బస్టర్‌లతో రాజ్ తరుణ్ దూసుకుపోయారు. కానీ ఆ తరువాతే అసలు సమస్య మొదలైంది. కుమారి 21ఎఫ్ తరువాత రాజ్ తరుణ్‌కు మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ఇంకా ఓ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ‘ఒరేయ్ బుజ్జిగా’ అంటూ చివరగా ప్రేక్షకులను పలకరించాడు రాజ్ తరుణ్. కానీ అది కూడా బోల్తా కొట్టేసింది. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ మరో కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నాడు. స్టాండప్ కామెడీ అనే కాన్సెప్ట్ ‘’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించేందుకు వస్తున్నాడు. ఈ మధ్యకాలంలోనే ఈ సినిమా టీజర్‌ను హీరో రానా విడుదల చేశాడు. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా స్టాండప్ కామెడీ చేసేందుకు రాజ్ తరుణ్ పడే పాట్లు.. ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాకు శాంటో దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటని.. రౌడీ స్టార్ విడుదల చేశాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ పుట్టినరోజు సందర్భంగా ‘అలా ఇలా’ అంటూ సాగే పాటను విడుదల చేశాడు విజయ్. ఈ సందర్భంగా వర్షకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయ్.. తనకెంతో ఇష్టమైన రాజ్ తరుణ్, వర్షలు నటించిన ఇంతటి చక్కటి సినిమా నుంచి ఈ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉందంటూ పేర్కొన్నాడు. అంతేకాక.. టీజర్‌ని కూడా తను ఎంతో ఇష్టపడ్డాను అని అన్నాడు. అయితే దీనిపై రాజ్ తరుణ్ స్పందించాడు. ‘పాటను విడుదల చేసినందుకు చాలా ధన్యవాదాలు బ్రో’ అంటూ రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ