ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో ‘ముబి’ సర్వీస్.. ఇకపై ఆ సినిమాలన్నీ చూసేయొచ్చు!

ముబి.. చాలా తక్కువ మందికి తెలిసిన క్యూరేటెడ్ ఫిల్మ్ స్ట్రీమింగ్ సర్వీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మాదిరిగా ఇది కూడా ఒక స్ట్రీమింగ్ సర్వీస్. కాకపోతే వాటికి.. ఈ ‘ముబి’కి తేడా ఉంది. ఇందులో ఏ సినిమా పడితే ఆ సినిమాను తోసేయరు. చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి అప్‌లోడ్ చేస్తారు. ప్రస్తుతం వినోదం అనేది ప్రపంచీకరణ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాలను, సిరీస్‌లను మాత్రమే చూడటం లేదు. ఇంగ్లిష్, కొరియన్, చైనీస్, జపనీస్.. ఇలా అన్ని భాషల కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా చూస్తున్నారు. అయితే, ఇప్పటికీ చాలా కంటెంట్ మనకు ఓటీటీల ద్వారా దొరకడం లేదు. అలాంటి కంటెంట్‌ను ముబిలో చూడొచ్చు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన.. అవార్డులను సొంతం చేసుకున్న సినిమాలు చాలానే మరుగున పడిపోయాయి.. పడిపోతున్నాయి. అలాంటి గొప్ప సినిమాలను అంతర్జాతీయంగా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ‘ముబి’లో ఉంచుతున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో లేని ఇండియన్, ఇంటర్నేషనల్ మూవీస్‌ని ముబి యాప్‌లో చూడొచ్చు. ఈ యాప్‌లో రోజుకో కొత్త సినిమా అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి వచ్చిన ప్రతి కొత్త సినిమా 30 రోజులపాటు ఇందులో ఉంటుంది. అయితే, ఈ ముబి సర్వీస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే కాస్త ఎక్కువగానే చెల్లించాలి. అందుకే, భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం ముబితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై ముబిలో సినిమాలన్నింటినీ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో చూడొచ్చు. ఇందులో కనిపించే ప్రతి సినిమాకు తెలుగు సబ్ టైటిల్స్ వస్తాయి. కాబట్టి, ఇతర భాషా చిత్రాలను బాగా ఆస్వాదించవచ్చు. ఆసిఫ్ కపాడియా ‘డిగో మారడోనా’ (2019), రూపెర్ట్ గూల్డ్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘జూడీ’ (2019), ఆషిమ్ అహ్లువాలియా దర్శకత్వంలో వచ్చిన ‘మిస్ లవ్‌లీ’ (2012), సలీమ్ అహ్మద్ ‘అడమింటే మకన్ అబు’ (2011), కాథీ యాన్ డెబ్యూ ఫిల్మ్ ‘డెడ్ పిగ్స్’ (2018), అలాగే విజయ్ కుమార్ దర్శకత్వం వహించి నిర్మించిన తమిళ చిత్రం ‘ఉరియాది’ (2016) వంటి ఎన్నో గొప్ప చిత్రాలు ముబిలో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌తో భాగస్వామ్యం గురించి ముబి వ్యవస్థాపకుడు, సీఈవో ఎఫె కాకరెల్ మాట్లాడుతూ.. ‘‘ముబిని ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌టెల్‌‌తో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన ఎన్నో సినిమాలు ఎప్పటికప్పుడు ముబిలో దర్శనమిస్తాయి. అందమైన, ఆసక్తికరమైన సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసి అందుబాటులోకి తెస్తాం. ఇప్పుడు ఈ సినిమాలన్నింటినీ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ వినియోగదారులకు అందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మరుగున పడిపోయిన అద్భుతమైన సినిమాలు, ఈ మధ్య కాలంలోని గొప్ప చిత్రాలను మీకు అందిస్తున్నాం. అలాగే, ఇండియన్ సినిమా నుంచి ఎన్నో గొప్ప చిత్రాలను ఎంపిక చేశాం’’ అని వెల్లడించారు. వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సుదీప్త బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘‘ముబితో భాగస్వామ్యం ఏర్పరుచుకుని 335 మిలియన్లకు పైగా ఉన్న తమ వినియోగదారులకు అవార్డులను గెలుచుకున్న, విశిష్టమైన సినిమాలను అందిస్తుండటం ఆనందంగా ఉంది. మన ఆడియన్స్ ఎప్పుడూ కొత్తదనం కోసం చూస్తుంటారు. ముబితో కలిసి అలాంటి చిత్రాలను ఆడియన్స్‌కు అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండియన్స్‌కు కావాల్సిన అన్ని రకాల కంటెంట్‌ను ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్‌లో అందుబాటులోకి తేవాలని మేం దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇండియన్ ఓటీటీ స్పేస్ మరింతగా విస్తరించేలా, ఆడియన్స్‌కు మరింతగా కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చేలా మేం కృషి చేస్తున్నాం’’ అని చెప్పారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ