టీవీ, సినిమా షూటింగులకు జగన్ సర్కార్ బంపరాఫర్.. ఇకపై అలా చేయక్కర్లేదు

రాష్ట్రంలో టీవీ, సినిమా షూటింగుల అనుమతిని మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతుల కోసం ఇక కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్‌లైన్లోనే ఉచితంగా అనుమతులు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రదేశాల్లో ఇక షూటింగ్ జరుపుకోవాలి అనుకునే వారు www.apsftvtdc.in వెబ్ సైట్లో అనుమతికి అప్లై చేసుకోవచ్చు. అలా చేసుకున్న దరఖాస్తులను నిర్దిష్ట కాలపరిమితిలో అనుమతి ఇచ్చి దరఖాస్తుదారుడికి ఆన్‌లైన్లోనే సమాచారం ఇస్తారు. ఈ అనుమతి కాపీని సంబంధిత శాఖ ఇన్‌ఛార్జికి కూడా పంపిస్తారు. Also Read: సినిమా, టీవీ షూటింగులకు ఆన్‌లైన్లో అనుమతి ఇవ్వడం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలు సులభతరంగాను, అందరికి అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న లొకేషన్లను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే షూటింగ్‌కి అనుమతులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. Also Read: గతంలో షూటింగ్ లొకేషన్లకు అనుమతి ఇవ్వాలంటే ఆయా నిర్మాతలు నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉండేదని, ఇప్పుడు ఉచితంగా ఆన్‌లైన్లోనే షూటింగ్ లొకేషన్ అనుమతి పొందవచ్చని విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 45 కూడా జారీ చేసిందని వెల్లడించారు. చలనచిత్ర, టీవీ రంగాలకు మరింత ప్రోత్సాహం ఇవ్వడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విజయకుమార్ రెడ్డి తెలిపారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ