కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే.. చిరంజీవితో బ్లాక్‌బస్టర్‌ మూవీ..

సినీ ఇండస్ట్రీలో వారసత్వం అన్నది సాధారణమే. హీరోలుగా, విలన్లుగా రాణించిన చాలామంది తమ వారసులను కూడా సినీ పరిశ్రమలో తీసుకొస్తూనే ఉన్నారు. తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే హీరోలే కాదు అలనాటి హీరోయిన్లలో కొందరు తమ కూతుళ్లను హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేష్ తల్లి ఒకప్పుడు అగ్ర హీరోయిన్‌గా కొనసాగారు. తెలుగు సినిమాల్లో కూడా నటించిన విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. Also Read: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో 1963లో పుట్టిన మేనక అసలు పేరు పద్మావతి. 1980లో విడుదలైన ‘రమాయి వయసుకు వంతుట్ట’ అనే సినిమా ద్వారా వెండితెరకి ఎంట్రీ ఇచ్చారు. ఆరేళ్లలోనే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఏకంగా 116 సినిమాల్లో నటించారు. అతి తక్కువ సమయంలోనే వంద సినిమాల్లో నటించిన రికార్డు ఆమె సొంతం. చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పున్నమినాగు’ సినిమాలో మేనక హీరోయిన్‌గా నటించారు. కెరీర్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ నిర్మాత జి.సురేష్‌ కుమార్‌ని వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు మేనక. వీరికి ఇద్దరు కూతుళ్లు. కీర్తి సురేష్‌ మలయాళంలోనే అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. వందకు పైగా సినిమాల్లో నటించిన మేనకకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవాలన్న ఆశ కలగానే మిగిలిపోయింది. అయితే ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌ ఆ అవార్డు అందుకోవడంతో మేనక ఉప్పొంగిపోయారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ