ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా... విదేశీయులూ ఫిదా

ఒక భాషలో హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం చూస్తూనే ఉంటాం. కొన్ని సినిమాలను ఒకట్రెండు భాషల్లో తెరకెక్కిస్తే.. మరికొన్నింటిని ఇంకా ఎక్కువ భాషల్లోనూ తీస్తుంటారు. అయితే తెలుగు తెరపై స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఓ సినిమా ఏకంగా ఆరు భారతీయ భాషలు, రెండు విదేశీ భాషల్లో రీమేక్ చేశారంటే నమ్మగలమా?. ఆ సినిమానే సిద్ధార్థ, జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘’. ఈ సినిమాలో సిద్ధార్ధ్, త్రిష నటన ఎప్పటికీ మర్చిపోలేనిది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, ఎమ్మెస్ రాజు నిర్మాణం ఈ సినిమా విజయాన్ని మరో మెట్టు ఎక్కించాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాను ఆ తర్వాత తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లోనూ రీమేక్ చేయగా అక్కడా విజయం సాధించింది. దీంతో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు చిత్రంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కలెక్షన్లు, ప్రశంసలతో పాటు అవార్డులు కూడా భారీగా వచ్చాయి. తెలుగులో ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు ఐదు నంది అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు, రెండు సంతోషం అవార్డులు కూడా వచ్చాయి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ