చిరంజీవితో ఆ ఛాన్స్ మిస్సయ్యా.. ఇప్పటికీ థ్యాంక్స్ చెబుతుంటా: ఎస్వీ కృష్ణారెడ్డి

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు పెట్టింది పేరు . 1990 దశకంలో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేశారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, శుభలగ్నం, మావిచిగురు, యమలీల వంటి అద్భుతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. హీరోగా ఉగాది, అభిషేకం సినిమాల్లో మెరిశారు. తాను దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఆయనే సంగీతం అందించేవారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ఆయన కొత్తతరం దర్శకులు రాకతో పూర్తిగా కనుమరుగైపోయారు. అయితే ఇన్నేళ్లైనా ఆయన సినిమాలు ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 90వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ అందించేందుకు ప్రయత్నించారట రాఘవేంద్రరావు. చిరంజీవి-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాకు సంగీతం అందించే తనకు ఛాన్స్ వచ్చిందని తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. అయితే అప్పట్లో తాను మ్యూజిక్‌తో పాటు అన్ని విభాగాల్లో వర్క్ చేయడం వల్ల చిరంజీవి సినిమాకు పనిచేసే ఛాన్స్ కోల్పోయానని ఆమె వెల్లడించారు. Also Read: "చిరంజీవి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నన్ను కోరారు. కానీ ఆ సమయంలో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. అలా చిరంజీవి గారితో పనిచేసే ఛాన్స్ కోల్పోయా. అయితే ఆయన సినిమాకు పనిచేసే టాలెంట్ నాలో ఉందని గుర్తించిన రాఘవేంద్రరావు గారికి ఇప్పటికీ మనసులో థ్యాంక్స్ చెబుతూనే ఉంటా’ అని తెలిపారు. తాను వెండితెరకు దూరం కాలేదని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్‌గా ఓ కథ రాస్తున్నట్లు తెలిపారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ