కరోనాకి వాడాల్సిన ముఖ్యమైన మాత్ర ఇదే.. ఆయుర్వేదంతో గో కరోనా: విశాల్

ఇటీవ‌ల వారి తండ్రి జి.కె.రెడ్డి క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే..ఈ సంద‌ర్భంగా తాను తన కుటుంబం కరోనాను ఎలా జయించారో తెలియజేస్తూ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ మహమ్మారిని ఎలా జయించాననే విషయాన్ని తెలియజేస్తున్నాను తప్పితే.. ఏ విధమైన ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్‌ను తాను ప్రమోట్ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు విశాల్. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మా నాన్నగారికి పోయిన నెలలో కరోనా పాజిటివ్ వచ్చింది.. అయితే ఆయన్ని హాస్పటల్‌లో జాయిన్ చేయాలని అనుకోలేదు. నేను హాస్పటల్, డాక్టర్స్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు.. ఈ విషయంలో క్షమించాలి. మా నాన్న గారిని ఇంట్లోనే ఉంచి దగ్గర ఉండి చూసుకోవాలని నా కోరిక. నేను దగ్గర ఉండి మా నాన్నగారిని చూసుకున్నా.. సో నాకు కూడా కరోనా సోకింది. దగ్గు, జ్వరం, జలుబు ఇవన్నీ వచ్చాయి. నాతో పాటు నా మేనేజర్‌కి కూడా వచ్చింది. మా అంకుల్ డాక్టర్ హరిశంకర్‌కి చాలా థాంక్స్ చెప్పాలి.. ఆయన సమక్షంలో మేం ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్ తీసుకుని కరోనా నుంచి కోలుకున్నాము. ఇది చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టే చెప్తున్నా.. అంతేకాని ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్‌ని ప్రచారం చేస్తున్నట్టు కాదు.. ఈ మెడిసిన్ నాకు మానాన్నగారికి, నా మేనేజర్‌కి ఎలా హెల్ప్ అయ్యిందని.. ఎలా కోలుకున్నాం అని అందరికీ చెప్పాలని అనుకున్నా. కరోనాకి మనం వేసుకునే మాత్రలకు ముందు మనం వేసుకునే ముఖ్యమైన మాత్ర ఏంటంటే మనలో భయం ఉండకూడదు. కోవిడ్ వచ్చే ముందు.. వచ్చిన తరువాత కూడా.. భయం అనేది ఉండకూడదు. ఆ ఫియర్ ఎప్పుడైతో లేదో తప్పకుండా కరోనా జయిస్తాం.. మనసులో బలంగా నేను కోలుకుంటాను అని అనుకుంటే తప్పకుండా కరోనాను జయించవచ్చు’ అంటూ వీడియోను వదిలారు విశాల్.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ