‘మగధీర’ నా ఆల్‌టైమ్ ఫేవరేట్.. మహేష్‌కి పెద్ద ఫ్యాన్‌ని: విహారీతో తెలుగులో మాట్లాడిన అశ్విన్

వాళ్లిద్దరూ భారత్ తరఫున ఆడుతోన్న అంతర్జాతీయ క్రికెటర్లు. ఒకరకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టార్లు. అలాంటి క్రికెటర్లు తెలుగు సినిమాల గురించి చర్చించుకుంటే.. అందులోనూ తెలుగు భాషలోనే చర్చించుకుంటే విశేషమే కదా. తమిళనాడుకు చెందిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారీతో తెలుగులో మాట్లాడారు. తెలుగు సినిమాల గురించి చర్చించారు. వీరిద్దరూ కలిసి ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో లైవ్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న వీరిద్దరూ లైవ్‌లో కాసేపు వ్యక్తిగత విషయాలపై ముచ్చట్లు పెట్టారు. దీనిలో భాగంగా తెలుగు సినిమాల గురించి వీరిద్దరి మధ్య చర్చ వచ్చింది. అశ్విన్ చాలా చక్కగా తెలుగులో మాట్లాడారు. ‘‘లెట్స్ స్టార్ట్‌ అని తెలుగులో ఎలా అంటారు’’ అని విహారీని అశ్విన్ అడిగారు. దీనికి ‘మొదలుపెడదాం’ అని రిప్లై ఇచ్చారు విహారి. మొదట తెలుగు సినిమాల గురించి మాట్లాడదాం అని అశ్విన్ అన్నారు. ఇక అక్కడి నుంచి ఒకరినొకరు సినిమాల గురించి ప్రశ్నలు వేసుకున్నారు. Also Read: అశ్విన్: తెలుగులో మీ ఫేవరేట్ మూవీ ఏంటి? విహారి: నా ఫేవరేట్ మూవీ అంటే.. ఇటీవల ఒక మంచి కామెడీ సినిమా చూశాను. సినిమా పేరు ‘భీష్మ’. అశ్విన్: హీరో ఎవరు? విహారి: నితిన్. సినిమా చాలా బాగుంది. అశ్విన్: మా ఇంట్లో ప్రతి ఒక్కరూ అమెజాన్‌లో తెలుగు సినిమాలను ఆస్వాదిస్తున్నారు. నేను కూడా అద్భుతమైన తెలుగు సినిమాలు చూశాను. నేను తెలుగు సినిమాలకు పెద్ద ఫ్యాన్. విహారి: మీకు ఏ మూవీ ఇష్టం? అశ్విన్: నా ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ ‘మగధీర’. రామ్ చరణ్ మూవీ. ఈ మధ్య తెలుగు సినిమాలు చాలానే చూశాను. ‘ఎవరు’ సినిమా చాలా బాగుంది. అలాగే, మహేష్ బాబు పాత సినిమా ఒకటి ఉంది. చాలా ఇష్టం. టైటిల్ గుర్తులేదు. ఆ సినిమాను తమిళ్‌లో ‘గిల్లి’ పేరుతో తీశారు. నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్. విహారి: తమిళ్‌లో విజయ్ హీరో కదా. ఆ సినిమా ‘పోకిరి’. (నిజానికి ‘గిల్లి’ సినిమా ‘ఒక్కడు’ రీమేక్) అశ్విన్: మీరు చెన్నైలో క్రికెట్ ఆడారు కదా. తమిళం తెలుసా మీకు? విహారి: నాకు అర్థమవుతుంది. కానీ, నేను మాట్లాడలేను. అశ్విన్: తెలుగు సినిమాల గురించి మీరు ఏం చెబుతారు? అంటే, తెలుగు సినిమాలకు చాలా క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ప్రేక్షకుల వల్ల వచ్చిందా? హీరోల వల్లా? విహారి: నేను ప్రేక్షకులనే అనుకుంటున్నాను. ఇక్కడి ప్రజలు డైహార్డ్ ఫ్యాన్స్. అలాగే, టాలీవుడ్ చాలా పెద్ద పరిశ్రమ. Also Read: అశ్విన్: మహేష్ బాబు ఎంత పెద్ద హీరో? (నవ్వుతూ) విహారి: ఆయన సూపర్ స్టార్. మీరు మహేష్ బాబు ఫ్యాన్ అని అర్థమవుతోంది. అశ్విన్: అవును.. చాలా పెద్ద ఫ్యాన్‌ని. రీసెంట్‌గా అమెజాన్‌లో ఆయన సినిమా ఒకటి చూశాను. టైటిల్ నేను పలకలేకపోతున్నాను. ‘వైకుంఠపురములో’ చూసిన వెంటనే ఆ సినిమా కూడా చూశాను. విహారి: ఆ సినిమా పేరు ‘సరిలేరు నీకెవ్వరు’. అశ్విన్: అవును.. అదే. నీకెవ్వరు అంటే ఆయన నీకు ఏమవుతారు అనేగా? విహారి: ఆ టైటిల్‌కి అర్థం.. నీ కన్నా ఎవరూ ఎక్కువ కాదు అని. అశ్విన్: విజయ్ దేవరకొండ గురించి చెప్పండి. ఒక నటుడిగా మీరు ఆయనకి ఏం రేటింగ్ ఇస్తారు? విహారి: ఆయన డీసెంట్ యాక్టర్. ఆయన్ని యూత్ ఫేవరెట్‌గా చెప్పొచ్చు. అలాంటి పాత్రలే ఆయన చేస్తున్నారు. అశ్విన్: ‘గీత గోవిందం’ చూశారా? మీకు నచ్చిందా? విహారి: చూశాను.. నాకు నచ్చింది. మంచి సినిమా. ఇలా.. అశ్విన్, విహారి మధ్య సినిమాల గురించి సరదాగా సంభాషణ జరిగింది. అయితే, హనుమ విహారిని తాను విహారి అని పిలవలేనని.. హనుమ అని పిలుస్తానని అన్నారు అశ్విన్. ఇదిలా ఉంటే, విహారి ‘భీష్మ’ సినిమా గురించి మాట్లాడటం పట్ల ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా విహారి, అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పారు. అశ్విన్, హనుమ విహారి చిట్ చాట్ వీడియో


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ